OTT Horror: ఇవాళ, రేపు వీకెండ్- 2 ఓటీటీల్లోకి సరికొత్తగా వచ్చిన టాప్ 6 హారర్ థ్రిల్లర్స్- రెండింట్లో 3, 3- తెలుగులో 3!

OTT Horror Thrillers To Watch This Weekend: ఓటీటీ ప్రియులను భయపెట్టేందుకు ఈ వారం సరికొత్తగా టాప్ 6 పవర్‌ఫుల్ హారర్ సినిమాలు, సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో రెండు ఓటీటీలో రిలీజైన ఈ 6 హారర్ థ్రిల్లర్స్, వాటి స్టోరీలపై ఇక్కడ లుక్కేద్దాం.

Published on: Oct 10, 2026, 21:48:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Top 6 New OTT Horror Thrillers To Watch This Weekend: వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీ వీక్షకులు సరికొత్త థ్రిల్ కోసం వెతుకుతుంటారు. హారర్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లలో వచ్చే సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అయిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఈ వీకెండ్‌ని మైండ్ బ్లాకింగ్ హారర్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపేశాయి.

ఇవాళ, రేపు వీకెండ్- 2 ఓటీటీల్లోకి సరికొత్తగా వచ్చిన టాప్ 6 హారర్ థ్రిల్లర్స్- రెండింట్లో 3, 3- తెలుగులో 3!
ఇవాళ, రేపు వీకెండ్- 2 ఓటీటీల్లోకి సరికొత్తగా వచ్చిన టాప్ 6 హారర్ థ్రిల్లర్స్- రెండింట్లో 3, 3- తెలుగులో 3!

ఇవాళ, రేపు వీకెండ్

ఇవాళ, రేపు వీకెండ్ కాబట్టి ఓటీటీలో చూసేందుకు సరికొత్తగా టాప్ 6 హారర్ థ్రిల్లర్స్ వచ్చేశాయి. ఈ వారంలో 2 ఓటీటీల్లోకి వచ్చిన ఆ న్యూ 6 హారర్ థ్రిల్లర్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌లో భయపెట్టే యానిమేషన్, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్!

ససకి అండ్ పీప్స్ సీజన్ 2: జపనీస్ యానిమేషన్ ఫాంటసీ హారర్ అడ్వెంచర్ సిరీస్ 'ససకి అండ్ పీప్స్' రెండో సీజన్ అక్టోబర్ 07 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఉద్యోగంలో విసిగిపోయిన ససకి అనే వ్యక్తి పీప్స్ అనే పక్షిని పెంచుకోవడం మొదలుపెడతాడు. అయితే ఆ పక్షి వేరే లోకానికి చెందిన శక్తివంతమైన జ్ఞాని. ససకికి మాయా శక్తులు ప్రసాదించడంతో పాటు వేరే ప్రపంచాల్లోకి వెళ్లే వెసులుబాటు కల్పిస్తుంది. జపాన్‌లో అతను ఎదుర్కొనే దెయ్యాల పోరాటాలు, ఇతర లోకాల వింతలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

హాంటెడ్ హోటల్ సీజన్ 2: అడల్ట్ యానిమేషన్ హారర్ కామెడీ ప్రియుల కోసం రూపుదిద్దుకున్న 'హాంటెడ్ హోటల్' సీజన్ 2 అక్టోబర్ 09న ఓటీటీ రిలీజ్ అయింది. సోదరుడు నాథన్ మరణించిన తర్వాత క్యాథరిన్ అనే ఒంటరి తల్లి అండర్‌వేల్ హోటల్‌ను దక్కించుకుంటుంది. దెయ్యాలు, వింత ఆత్మలతో నిండిన ఆ హోటల్‌ను ఆమె ఎలా నడిపింది? దెయ్యంగా మారిన సోదరుడు నాథన్ ఆమెకు ఎలా సాయం చేశాడనేది హాస్యభరితంగా చూపిస్తారు. ఈ రెండో సీజన్‌లో కొత్త రాక్షసులు, నూతన ఉద్యోగి రాకతో కథ మరింత రసవత్తరంగా మారింది.

జాన్ కార్‌పేంటర్స్ ఘోస్ట్ ఆఫ్ మార్స్: హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జాన్ కార్‌పేంటర్ తెరకెక్కించిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఘోస్ట్ ఆఫ్ మార్స్' అక్టోబర్ 09 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. 22వ శతాబ్దంలో అంగారక గ్రహం (మార్స్) పై మానవ నివాసాలు ఏర్పడిన నేపథ్యంతో ఈ కథ సాగుతుంది. మార్స్‌పై ఉన్న గని కార్మికుల శరీరాల్లోకి ప్రాచీన రాక్షస ఆత్మలు ప్రవేశిస్తాయి. వారి నుంచి తప్పించుకోవడానికి పోలీసులు, ఖైదీలు కలిసి చేసే ప్రాణాంతక పోరాటమే ఈ సినిమా. నటాషా హెన్‌స్ట్రిడ్జ్, ఐస్ క్యూబ్, జేసన్ స్టాథమ్ వంటి ప్రముఖ నటులు ఇందులో నటించారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోతెలుగు డబ్బింగ్ హారర్ ధమాకా!

ఇన్సీడియస్-అవుట్ ఆఫ్ ది ఫర్దర్: ప్రసిద్ధ హారర్ ఫ్రాంచైజీ 'ఇన్సీడియస్' నుంచి వచ్చిన 'అవుట్ ఆఫ్ ది ఫర్దర్' చిత్రం అక్టోబర్ 06 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. తమ సంతానాన్ని కాపాడుకోవడానికి 'ది ఫర్దర్' అనే పాపాత్మల ప్రపంచంలోకి ప్రవేశించే అపూర్వమైన శక్తిని కలిగి ఉన్న ఒక తల్లి కథ ఇది. ఆ లోకంలోని దెయ్యాల నుంచి ఆమె ఎలా బయటపడింది అనే సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ప్రఖ్యాత నటి లిన్ షే, అమేలియా ఈవ్ జెమ్మ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

కేరీ ఓటీటీ: స్టీఫెన్ కింగ్ రాసిన ప్రముఖ నవల ఆధారంగా, ప్రముఖ దర్శకుడు మైక్ ఫ్లానగన్ రూపొందించిన సైకలాజికల్ హారర్ డ్రామా సిరీస్ 'కేరీ' అక్టోబర్ 07 నుంచి తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తల్లి పెంపకంలో బయటి ప్రపంచానికి దూరంగా పెరిగిన కేరీ వైట్ అనే అమ్మాయికి అనుకోకుండా మైండ్ పవర్స్ (టెలికినెటిక్ శక్తులు) వస్తాయి. స్కూల్లో విద్యార్థుల వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొన్న ఆమె ఆ శక్తులతో ఎలాంటి విధ్వంసం సృష్టించిందో ఈ సిరీస్‌లో ఆకట్టుకునేలా చూపించారు. సమర్ హెచ్ హావెల్, సమంతా స్లోయాన్ ముఖ్య పాత్రల్లో మెరిశారు.

వీడియో: కన్నడలో సంచలనం సృష్టించిన ఫౌండ్-ఫుటేజ్ హారర్ థ్రిల్లర్ మూవీ 'వీడియో' అక్టోబర్ 09 నుంచి తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. శ్రీనిధి బెంగళూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల చుట్టూ తిరుగుతుంది. గ్రహణం రోజున ఒడిశాలోని ఒక నిర్జనమైన భయంకర పాఠశాలకు వెళ్లిన యువకులు అక్కడ ఎలాంటి వింత అనుభవాలను ఎదుర్కొన్నారు? ఆ భవనంలో ఎలా చిక్కుకుపోయారనేది సెల్ ఫోన్, కెమెరా ఫుటేజ్ శైలిలో చిత్రీకరించారు. భరత్ కె తుమకూర్, జీవన్ శివకుమార్ తమ నటనతో భయపెడతారు.

వీకెండ్‌లో చూసేందుకు పర్ఫెక్ట్ ఛాయిస్!

ఈ వారాంతంలో సరికొత్త కథాంశాలు, విజువల్ ఎఫెక్ట్స్, తెలుగు డబ్బింగ్ అనుభూతితో భయపడాలనుకునే హారర్ ప్రియులకు ఈ 6 చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలో అద్భుతమైన వినోదాన్ని అందిస్తాయి. మీ అభిరుచికి తగ్గట్టు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో వీటిని చూసి ఎంజాయ్ చేయవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More