Indraja: ఇంతమంచి సినిమాకు థియేటర్లు ఇవ్వకపోవడం బాధగా ఉంది, ఓటీటీలో కూడా చూడండి- సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కామెంట్స్
Indraja About Anakapalli Theaters And OTT: నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన రా అండ్ రస్టిక్ మూవీ అనకాపల్లి. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా థ్యాంక్యూ మీట్‌ను ఇవాళ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో త్రినాథరావు, ఇంద్రజ, లగడపాటి శ్రీధర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Indraja About Anakapalli Theaters And OTT Watch In Thank You Meet: భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట హీరోహీరోయిన్లుగా.. తారక్ పొన్నప్ప విలన్‌గా నటించారు.

అక్టోబర్ 2న విడుదలై మంచి రెస్పాన్స్
ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన అనకాపల్లి సినిమాకు కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లేని అందించిన అనకాపల్లి సినిమా అక్టోబర్ 2న విడుదలై అద్భుతమైన స్పందనతో దూసుకుపోతోంది.
త్రినాథరావు, ఇంద్రజ, లగడపాటి శ్రీధర్ కామెంట్స్
ఈ క్రమంలో మంగళవారం (అక్టోబర్ 6) నాడు అనకాపల్లి థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, లగడపాటి శ్రీధర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నేను డబ్బులేమీ పెట్టలేదు
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ .. "‘అనకాపల్లి’ సినిమాకి నేను డబ్బులేమీ పెట్టలేదు. నా పేరు పెడితే ఎవరైనా చూసేందుకు వస్తారని అలా పెట్టారు. సోమవారం వరకు రిజల్ట్ కోసం వెయిట్ చేశాను. సోమవారమే కాదు.. ఈ రోజు (మంగళవారం) కూడా మంచి ఫ్లోటింగ్ ఉంది. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి" అని చెప్పారు.
ఆర్టిస్టులందరికీ మంచి పేరు వస్తోంది
"అనకాపల్లి సినిమాకు అన్ని వైపుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. పర్ఫామెన్స్ పరంగా ఆర్టిస్టులందరికీ మంచి పేరు వస్తోంది. ఈ సినిమాని ఇలానే మరింత ముందుకు తీసుకు వెళ్లాలని మీడియా, ఆడియెన్స్‌ని కోరుకుంటున్నాను" అని త్రినాథరావు నక్కిన కోరారు.
అసలు సిసలు విజయం
సీనియర్ హీరోయిన్, నటి ఇంద్రజ మాట్లాడుతూ .. "‘అనకాపల్లి’ అసలు సిసలు విజయాన్ని సాధించింది. అందుకే ఈ రోజు ఈ థాంక్యూ మీట్‌కి వచ్చాను. ఇలాంటి మంచి చిత్రానికి సరైన సంఖ్యలో థియేటర్లు ఇవ్వకపోవడం బాధగా ఉంది. చూసిన ప్రతీ ఒక్కరూ సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు" అని అన్నారు.
థియేటర్లో చూడలేకపోయామనుకుంటారు
"సినిమాలో ఎవరున్నారు? ఎవరు తీశారు అన్నది పట్టించుకోవడం లేదు. బాగుందా? లేదా? నచ్చిందా? లేదా? అన్నది మాత్రమే ఆడియెన్స్ చూస్తున్నారు. మా సినిమాకి మరిన్ని మంచి థియేటర్లు లభిస్తాయని ఆశిస్తున్నాను. ఓటీటీలో కూడా మా మూవీని చూడండి. కానీ అప్పుడు థియేటర్లో చూడలేకపోయామనే ఫీల్ అవుతారు. మా చిత్రం అంత అద్భుతంగా ఉంటుంది" అని ఇంద్రజ చెప్పుకొచ్చారు.
నా కొడుకు మీద సినిమా తీయడం
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ .. "‘అనకాపల్లి’ సక్సెస్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది. విక్రమ్ నా కొడుకు అవ్వడం, అతని మీద ఒక సినిమా తీయడానికి త్రినాథ్ రావు గారు, నాయుడు గారు ముందుకు రావడం గొప్ప విషయం. ఇలాంటి చిన్న చిత్రాలకు మీడియానే ముందుండి సపోర్ట్ చేస్తుంది" అని తెలిపారు.
ఎవడిగోల వాడిదే లాగా
"‘ఎవడిగోల వాడిదే’ సినిమాని ఫస్ట్ వీక్‌కే తీసేస్తామని అన్నారు. కానీ, అదే థియేటర్లో చివరకు సిల్వర్ జూబ్లీ జరిగింది. అలానే ‘అనకాపల్లి’ కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుంది. దసరా ధమాకాగా ‘అనకాపల్లి’ నిలుస్తుంది. మండే నైట్ షోలు కూడా ఫుల్స్ అయ్యాయి. నూకాలమ్మ తల్లి ఆశీస్సులతో ‘అనకాపల్లి’ చిత్రం మరింత విజయాన్ని సాధిస్తుందని కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించారు లగడపాటి శ్రీధర్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


