Anakapalli: నిర్మాతల కష్టం నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది, ఆ ట్విస్ట్ ఎవరు ఊహించరు: డైరెక్టర్ త్రినాథరావు నక్కిన

Trinadha Rao Nakkina Lagadapati Sridhar On Anakapalli Movie: తెలుగులో వస్తున్న లేటెస్ట్ సినిమా అనకాపల్లి. ఈ సినిమాలో నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా చేస్తున్నాడు. తాజాగా నిర్వహించిన అనకాపల్లి ప్రెస్ మీట్‌లో త్రినాథరావు నక్కిన, లగడపాటి శ్రీధర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

Published on: Oct 1, 2026, 10:40:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Trinadha Rao Nakkina Lagadapati Sridhar On Anakapalli Movie: తెలుగులో వస్తోన్న లేటెస్ట్ రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నటిస్తూ ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా చేస్తున్నాడు.

నిర్మాతల కష్టం నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది, ఆ ట్విస్ట్ ఎవరు ఊహించరు: డైరెక్టర్ త్రినాథరావు నక్కిన
నిర్మాతల కష్టం నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది, ఆ ట్విస్ట్ ఎవరు ఊహించరు: డైరెక్టర్ త్రినాథరావు నక్కిన

అనకాపల్లి మీడియా ఇంటరాక్ట్

అనకాపల్లి సినిమాలో విక్రమ్ సహిదేవ్‌కు జోడీగా హీరోయిన్ సంధ్యా వశిష్ట నటిస్తోంది. అలాగే నటుడు తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించాడు. అనకాపల్లి సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ చిత్రానికి ధమామాక దర్శకుడు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లేని అందించారు.

అనకాపల్లి చిత్రాన్ని అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం (సెప్టెంబర్ 30) నాడు మీడియాతో ఇంటరాక్ట్ నిర్వహించారు అనకాపల్లి దర్శకనిర్మాతలు. ఈ మీడియా మీట్‌లో నిర్మాత లగడపాటి శ్రీధర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

సినిమాను మరింత బెటర్ చేశాం

లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ .. "‘అనకాపల్లి’ మూవీ అక్టోబర్ 2న రాబోతోంది. ఆగస్ట్‌లోనే ఈ సినిమా రావాల్సింది. అయితే చాలా మందికి ఈ మూవీని చూపించాం. అందరి సలహాల్ని తీసుకున్నాం. సినిమాని మరింత బెటర్ చేశాం" అని అన్నారు.

"ఈ మూవీ కోసం మా అబ్బాయి విక్రమ్‌ని అడిగిన త్రినాథరావు గారికి థాంక్స్. నేను ఎప్పుడో ఆయన్ను నాకు ఓ సినిమా చేసి పెట్టండని అడిగాను. విక్రమ్‌కి ఇంత మంచి అవకాశం ఇచ్చిన త్రినాథరావు గారికి థాంక్స్. నాయుడు గారు పడ్డ కష్టం, ఆయనకి ఉన్న ప్యాషన్ కోసమైనా ‘అనకాపల్లి’ పెద్ద విజయం సాధించాలి" అని ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ కోరుకున్నారు.

ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్‌ప్రైజింగ్‌గా

"సంధ్య పోషించిన పాత్ర కొత్తగా ఉంటుంది. తారక్ పొన్నప్ప అయితే అందరినీ భయపెట్టేస్తాడు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. మ్యూజిక్, ఆర్ఆర్ అద్భుతంగా కుదిరింది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు నిర్మాత లగడపాటి శ్రీధర్.

త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ .. "నిర్మాతల కష్టం నాకు ఇప్పుడిప్పుడు అర్థం అవుతోంది. సినిమా తీయడం కంటే ఆడియెన్స్ ముందుకు తీసుకు రావడం మరింత కష్టంగా మారింది. నిర్మాతగా కంటే దర్శకుడిగా ఉండటమే బెటర్ అనిపిస్తోంది. కానీ నిర్మాణం అనేది నాకు ప్యాషన్. నిర్మాతగా నా ఈ జర్నీని ఎంజాయ్ చేశాను" అని చెప్పారు.

అన్ని చోట్లా ఫుల్ అవుతున్నాయి

"మేం ఓపెన్ చేసిన బుకింగ్స్ అన్ని చోట్లా ఫుల్ అవుతున్నాయి. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్‌ని ఎవ్వరూ ఊహించరు. క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ‘మేం వయసుకు వచ్చాం’ తర్వాత నేను మళ్లీ అలాంటి ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత నాకు మళ్లీ ఓ అద్భుతమైన ప్రేమ కథ తట్టింది. అదే ‘అనకాపల్లి’" అని డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అన్నారు.

"ఇందులోని ఫ్యామిలీ డ్రామా గొప్పగా ఉంటుంది. విక్రమ్ ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమాతో విక్రమ్‌కి మంచి పేరు వస్తుంది. సంధ్య అద్భుతంగా నటించింది. తారక్ పొన్నప్ప అందరినీ భయపెడతాడు. మా నిర్మాత నాయుడు కూడా ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించాడు" అని త్రినాథరావు నక్కిన తెలిపారు.

అక్టోబర్ 2న రిలీజ్

"‘అనకాపల్లి’ సినిమాని అనకాపల్లిలో ప్రదర్శించాం. అక్కడ మాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘అనకాపల్లి’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను" అని దర్శకుడు త్రినాథరావు నక్కిన కోరారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More