OTT Telugu: ఒకేరోజు 3 ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు కామెడీ మూవీ- మలుపుతిప్పే క్రికెట్ బెట్టింగ్, బిజినెస్‌లోకి చిల్లరోళ్లు!
Ameer Log OTT Streaming On 3 Platforms: హైదరాబాదీ పాతబస్తీ నేపథ్యంతో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అమీర్ లోగ్ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఒకేరోజు 3 ఓటీటీల్లో అమీర్ లోగ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎమ్‌డీబీలో 9.6 రేటింగ్ సాధించిన అమీర్ లోగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Ameer Log OTT Release In 3 Platforms: పాతబస్తీ హంగామా, హైదరాబాదీ బిర్యానీ ఘుమఘుమలు, యూత్‌ఫుల్ ఎమోషన్స్ సమ్మేళనంగా తెరకెక్కిన లేటెస్ట్ టాలీవుడ్ సినిమా 'అమీర్ లోగ్'. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఏకంగా మూడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకేరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తోంది.

ఎక్కువ మంది ఓటీటీ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యేలా
సాధారణంగా ఏదైనా సినిమా ఒకే ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే అందుబాటులోకి వస్తుంది. అయితే అమీర్ లోగ్ చిత్రాన్ని ఎక్కువ మంది వీక్షకులకు చేరవేయాలనే ఉద్దేశంతో 3 ఓటీటీల్లోకి ఒకేసారి స్ట్రీమింగ్‌కు దించారు మేకర్స్.
అమీర్ లోగ్ ఐఎమ్‌డీబీ రేటింగ్
ఆగస్ట్ 21న థియేటర్లలో విడుదలైన అమీర్ లోగ్ సినిమా ఐఎమ్‌డీబీ (IMDb)లో 9.6 రేటింగ్ సాధించడం విశేషం. అమీర్ లోగ్ సినిమాకు రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించగా.. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించారు.
పాతబస్తీ పోరగాళ్లు.. బిర్యానీ బిజినెస్!
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన శ్రీను (హరి మున్నంగి), మల్లేష్ (శశిధర్ కొచ్చర్లకోట), రఫీక్ (మనోజ్ ఆవుల) ప్రాణ స్నేహితులు. చదువుపై దృష్టి పెట్టకుండా బస్తీలో అల్లరి చిల్లరగా చేయడం, గల్లీ క్రికెట్ ఆడటం, ఇంట్లోవాళ్ల చేత తిట్లు తినడమే వీరి దినచర్య.
వీరికి అక్కలాంటి గీత (వేధ జలంధర్) సరైన దారి చూపిస్తుంది. తన సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో శ్రీనుకు ఆఫీస్ బాయ్‌గా ఉద్యోగం ఇప్పిస్తుంది. ఆ తర్వాత మల్లేష్ క్యాబ్ డ్రైవర్‌గా, రఫీక్ బైక్ మెకానిక్‌గా మారతారు.
క్రికెట్ బెట్టింగ్ ఇచ్చిన మలుపు
శ్రీను తన ఆఫీస్‌లోని సాఫ్ట్‌వేర్ టీమ్‌తో ఆడే ఒక క్రికెట్ బెట్టింగ్ వీరి జీవితాలను మలుపు తిప్పుతుంది. ఆ మ్యాచ్‌లో శ్రీను బ్యాచ్ ఓడిపోవడంతో, బెట్టింగ్ డబ్బులకు బదులుగా పాతబస్తీ చాచాతో వండించిన స్పెషల్ బిర్యానీతో పార్టీ ఇస్తారు.
బిర్యానీ రుచికి ఫిదా
ఆ బిర్యానీ రుచికి ఫిదా అయిన సాఫ్ట్‌వేర్ టీమ్ హెడ్ రవి.. ఈ ముగ్గురితో కలిసి 'కిర్రాక్ బిర్యానీ' పాయింట్ ప్రారంభించాలనే ప్రతిపాదన తెస్తాడు. జాలిగా తిరిగే ఈ పాతబస్తీ కుర్రాళ్లు బిర్యానీ బిజినెస్‌లో ఎలాంటి విజయాలు సాధించారు, వారి జీవితాలు ఎలా మారాయనేది తెరపై ఆసక్తికరంగా సాగుతుంది.
యూత్‌ను ఆకట్టుకునే సాంకేతిక బలం
స్మరణ్ సాయి అందించిన సంగీతం, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ వర్క్ కథలోని నేటివిటీని తెరపైకి తెచ్చాయి. రావన్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి తదితరులు తమ పాత్రల్లో మెప్పించారు. నటీనటుల కామెడీ టైమింగ్, పాతబస్తీ యాస ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఓటీటీలో సరదాగా సాగిపోయే హైదరాబాదీ వినోదాన్ని కోరుకునే వారికి ఈ సినిమా మంచి ఎంపిక.
అమీర్ లోగ్ ఓటీటీ స్ట్రీమింగ్
మంచి తెలుగు కామెడీ డ్రామా తెరకెక్కిన అమీర్ లోగ్ ఏకంగా 3 ఓటీటీల్లోకి ఒకేసారి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్, ఆహా, సన్ నెక్ట్స్‌లలో అమీర్ లోగ్ ఓటీటీ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 28 అంటే నిన్నటి నుంచి ఈ మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో తెలుగులో అమీర్ లోగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


