OTT Today: 2 ఓటీటీల్లోకి ఇవాళ సడెన్‌గా వచ్చిన తెలుగు డార్క్ కామెడీ థ్రిల్లర్- కిడ్నాప్ చేసిన శవంతో కోటిన్నర డీలింగ్!

MRP OTT Streaming Today: 2 ఓటీటీల్లోకి ఇవాళ సడెన్‌గా తెలుగు డార్క్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎమ్ఆర్‌పీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. నీకెంత నాకెంత అనేది క్యాప్షన్. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే కేవలం 21 రోజుల్లో ఎమ్ఆర్‌పీ ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఎమ్ఆర్‌పీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Aug 7, 2026, 13:42:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

MRP Neekentha Nakentha OTT Release Today: ఇటీవల వచ్చే అన్ని రకాల జోనర్ల సినిమాలను ఓటీటీ లవర్స్ ఆదరిస్తున్నారు. అయితే, కామెడీ, హారర్, థ్రిల్లర్ వంటి సినిమాలకు ఎక్కువ క్రేజ్ ఉంటోంది. ఈ క్రమంలోనే తెలుగులో వచ్చిన లేటెస్ట్ డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా ఎమ్ఆర్‌పీ.

2 ఓటీటీల్లోకి ఇవాళ సడెన్‌గా వచ్చిన తెలుగు డార్క్ కామెడీ థ్రిల్లర్- కిడ్నాప్ చేసిన శవంతో కోటిన్నర డీలింగ్!
2 ఓటీటీల్లోకి ఇవాళ సడెన్‌గా వచ్చిన తెలుగు డార్క్ కామెడీ థ్రిల్లర్- కిడ్నాప్ చేసిన శవంతో కోటిన్నర డీలింగ్!

నీకెంత నాకెంత

నీకెంత నాకెంత అనేది సినిమా క్యాప్షన్. విభిన్నమైన కథాంశంతో, పూర్తిస్థాయి వినోదాన్ని అందిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించాడు. అతని ఫ్రెండ్స్‌గా సుదర్శన్, కసిరెడ్డి రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించగా.. వెన్నెల కిశోర్, నంద గోపాల్, దొనాల్ బిష్ట్ తదితరలు ఇతర రోల్స్ ప్లే చేశారు.

జులై 17న థియేటర్లలోకి వచ్చిన ఎమ్ఆర్‌పీ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే, బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా నిరాశపరిచింది. ఐఎమ్‌డీబీలో మాత్రం పదికి 7.7 రేటింగ్ పొందింది ఎమ్ఆర్‌పీ సినిమా. ఇలాంటి ఎమ్ఆర్‌పీ ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చేసింది.

అసలు కథేంటంటే?

మనోహర్ (నరేష్ అగస్త్య), దూళ్ల రవి (కసిరెడ్డి రాజ్‌కుమార్), పరమేశ్వరరావు (సుదర్శన్) చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు. హైదరాబాద్‌లో ఒకే రూమ్‌లో ఉంటూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటారు. ఎలాగైనా సొంతగా బిజినెస్ పెట్టి సెటిల్ అవ్వాలని మనోహర్ కలలు కంటుంటాడు. అతని ఆలోచనకు స్నేహితులు కూడా తోడవుతారు.

అయితే, సొంతంగా వ్యాపారం పెట్టేందుకు ఇంట్లో వాళ్లు డబ్బులు ఇవ్వకపోవడంతో ఓ గ్యాంగ్‌స్టర్ దగ్గర భారీ వడ్డీకి అప్పు తీసుకుంటారు. బిజినెస్‌లో నష్టాలు రావడంతో వడ్డీ కట్టలేక ముగ్గురు స్నేహితులు తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. సరిగ్గా అదే సమయంలో అప్పిచ్చిన గ్యాంగ్‌స్టర్ దైవాజీకి అతడి తండ్రి, తమ్ముడితో ఆస్తి వివాదాలు ఉన్నాయని తెలుసుకుంటారు.

కిడ్నాప్ చేసిన శవంతో డీల్

ఎలాగైనా దైవాజీ తండ్రి ద్వారానే తమ అప్పు తీర్చుకోవాలని ప్లాన్ చేస్తారు. అయితే, ఊహించని విధంగా దైవాజీ తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చనిపోతాడు. దైవాజీకి, అతని తమ్ముడు భానుకు పడకపోవడంతో.. చనిపోయిన తండ్రి శవాన్ని కిడ్నాప్ చేసి, బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ఈ ముగ్గురు స్నేహితులు భావిస్తారు.

పక్కా ప్లాన్‌తో శవాన్ని కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ చేసిన శవంతో దైవాజీ తమ్ముడితో కోటిన్నరకు డీల్ కుదుర్చుకునేందుకు ట్రై చేస్తారు. మరి ఆ డీల్ కుదిరిందా? దైవాజీ తండ్రి శవాన్నే కిడ్నాప్ చేశారా? అసలు శవాన్ని కిడ్నాప్ చేస్తే డబ్బులు ఎలా వస్తాయి? గ్యాంగ్‌స్టర్ దైవాజీ కుటుంబ గొడవల్లో ఈ ముగ్గురు ఎలా చిక్కుకున్నారు? చివరకు మనోహర్, అతని స్నేహితుల అప్పు తీరిందా లేదా? పోలీసుల నుంచి వీరు ఎలా బయటపడ్డారు? అనేదే ఎమ్‌ఆర్‌పీ కథ.

ఎమ్ఆర్‌పీ ఓటీటీ స్ట్రీమింగ్

ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఎమ్‌ఆర్‌పీ ఓటీటీలోకి ఇవాళ ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సైలెంట్‌గా వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఎమ్‌ఆర్‌పీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తోపాటు జియోహాట్‌స్టార్‌లో కూడా ఎమ్ఆర్‌పీ ఓటీటీ రిలీజ్ అయింది.

థియేటర్లలో విడుదలైన కేవలం 21 రోజుల్లోనే రెండు ఓటీటీల్లో ఎమ్ఆర్‌పీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషల్లో అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ ఓటీటీల్లో ఎమ్ఆర్‌పీ నవ్వించేందుకు అందుబాటులో ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More