OTT Horror Web Series: జీ5 ఓటీటీలోని టాప్ 5 హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు-క్షణక్షణం భయమే-వెన్నులో వణుకు పుట్టేలా!
OTT Horror Web Series: ఓటీటీలో హారర్ థ్రిల్లర్లను చూసే ఆడియన్స్ సంఖ్య ఎక్కువే. అలాంటి హారర్ థ్రిల్లర్ లవర్స్ కచ్చితంగా చూడాల్సిన అయిదు వెబ్ సిరీస్ ల లిస్ట్ ఇక్కడుంది. ఇవన్నీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సిరీస్ లు చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయమనే కామెంట్లు వస్తున్నాయి.
OTT Horror Web Series: డిజిటల్ స్క్రీన్స్ పై ఇప్పుడు సరికొత్త భయం రాజ్యం నడుస్తోంది. నైట్ టైమ్ ఒంటరిగా కూర్చుని ఒళ్లు గగుర్పొడిచే సస్పెన్స్ హారర్ కంటెంట్ చూడాలనుకునేవాళ్లకు జీ5 ఓటీటీ డిఫరెంట్ కంటెంట్ అందిస్తోంది. విభిన్నమైన కథలతో, సరికొత్త ట్విస్టులతో తెలుగు ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తున్న బెస్ట్ తెలుగు అండ్ డబ్బింగ్ హారర్ వెబ్ సిరీస్ ల వివరాలు ఇక్కడున్నాయి.

వీరభద్రుని రహస్యం
ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న సరికొత్త సిరీస్ వీరభద్రుని రహస్యం. భీమగాని శ్రీవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సీజన్ 1లో పార్ట్ 2 జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
సిటీకి చెందిన ధైర్యవంతురాలైన అమ్మాయి ఒక మారుమూల పల్లెటూరులోకి అడుగుపెడుతుంది. అక్కడ ఉన్న మూఢనమ్మకాలు, వింత సంఘటనలను ఛాలెంజ్ చేస్తుంది. చివరకు ఊరి జనాలు దెయ్యం లేదా శాపం అని నమ్మే విషయాల వెనుక దాగి ఉన్న అసలు నేరాలను, భయానకమైన రహస్యాలను ఛేదిస్తుంది.
కణ్ణామూచి
ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే మరో పాపులర్ హారర్ వెబ్ సిరీస్ కణ్ణామూచి. సస్పెన్స్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో సాగే ఈ కథ ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఒక అమాయకపు తల్లి కనిపించకుండా పోయిన తన చిన్నారి కోసం వెతుకుతుంది. అలా వెళ్లిన ఆ తల్లికి పాత కాలపు నివాసంలో భీతి గొలిపే సంఘటనలు, ఆత్మల ఊహించని మలుపులు ఎదురవుతాయి.
పర్చాయీ: ఘోస్ట్ స్టోరీస్
రస్కిన్ బాండ్ రాసిన హారర్ కథల ఆధారంగా తెరకెక్కిన పర్చాయీ: ఘోస్ట్ స్టోరీస్ కూడా తెలుగు ఆడియెన్స్ ను బాగా భయపెడుతోంది. డిఫరెంట్ ఎపిసోడ్స్ తో సాగే ఈ ఆంథాలజీ సిరీస్ లోని ప్రతి స్టోరీ ఒక సరికొత్త భయాన్ని పరిచయం చేస్తుంది. ప్రశాంతంగా సాగిపోయే కొండ ప్రాంతాలు, పాత బంగళాల చుట్టూ ఈ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. దెయ్యాల మిస్టరీల వల్ల ప్రతి ఎపిసోడ్‌లోనూ గూస్ బంప్స్ రావడం ఖాయం.
దాయన్
చేతబడి, మూఢనమ్మకాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే దాయన్ వెబ్ సిరీస్ కూడా జీ5 లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రొమాన్స్, సస్పెన్స్ తో పాటు భయంకరమైన మిస్టరీని ఈ కథలో అద్భుతంగా మిక్స్ చేశారు. ఒక అందమైన జంటపై చేతబడి జరుగుతుంది. వాళ్లపై దుష్టశక్తులు, ఆత్మలు దాడి చేస్తాయి. వాటి నుంచి తమను తాము కాపాడుకోవడానికి వారు చేసే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ పోరాటమే ఈ కథ.
భ్రమ
ఇక చివరగా హారర్ తో పాటు సైకలాజికల్ మిస్టరీని ఇష్టపడే వారి కోసం భ్రమ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. కల్కి కోచ్లిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతుంది. మానసిక గాయంతో బాధపడుతున్న ఒక నవల రచయిత్రి ప్రశాంతత కోసం ఒక హిల్ స్టేషన్‌కు మారుతుంది. కానీ అక్కడ ఆమెకు మాత్రమే ఓ అమ్మాయి ఆత్మ కనిపిస్తుంది. అది నిజంగానే ఆత్మనా లేకపోతే భ్రమనా అనేది ఉత్కంఠ కలిగిస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


