Horror Web Series: జియోహాట్‌స్టార్‌లో భయపెడుతున్న 9 ఎపిసోడ్ల హారర్ వెబ్ సిరీస్.. వరుస హత్యలు చేసే రాక్షసుడు.. 7 రేటింగ్

Horror Web Series: జియోహాట్‌స్టార్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న హారర్ వెబ్ సిరీస్ భయపెడుతోంది. ఈ డార్క్ థ్రిల్లర్ కు ఐఎండీబీలో 7కుపైగా రేటింగ్ ఉంది. దహన్ రాకన్ కా రహస్య పేరుతో ఉన్న ఈ సిరీస్ ఓ మస్ట్ వాచ్ అని చెప్పాలి.

Published on: Oct 10, 2026, 09:15:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Horror Web Series: ఓటీటీ వేదికగా ఎన్నో రకాల జానర్లలో వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. కానీ ఒళ్లు గగుర్పొడిచే నిజమైన హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ అనుభూతిని పంచే వెబ్ సిరీస్‌లు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి ఒక సరికొత్త, భయానక అనుభవాన్ని అందించిన వెబ్ సిరీస్‌ 'దహన్ - రాకన్ కా రహస్య' (Dahan - Rakan Ka Rahasya).

Horror Web Series: జియోహాట్‌స్టార్‌లో భయపెడుతున్న 9 ఎపిసోడ్ల హారర్ వెబ్ సిరీస్.. వరుస హత్యలు చేసే రాక్షసుడు.. 7 రేటింగ్
Horror Web Series: జియోహాట్‌స్టార్‌లో భయపెడుతున్న 9 ఎపిసోడ్ల హారర్ వెబ్ సిరీస్.. వరుస హత్యలు చేసే రాక్షసుడు.. 7 రేటింగ్

ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 9 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా భయపెడుతోంది. దీని ఐఎండీబీ రేటింగ్ కూడా 7.1గా ఉంది. రాజస్థాన్‌లోని ఒక మారుమూల శాపగ్రస్త గ్రామం బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది.

దహన్ వెబ్ సిరీస్ విశేషాలు

వెబ్ సిరీస్ : Dahan - Rakan Ka Rahasya (దహన్ - రాకన్ కా రహస్య)

జానర్ : సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్

ఓటీటీ: JioHotstar (జియోహాట్‌స్టార్)

ఎపిసోడ్లు : 9

డైరెక్టర్లు : విక్రాంత్ పవార్, జై శర్మ

రైటర్స్ : నిసర్గ్ మెహతా, శివ బాజ్‌పాయీ, నిఖిల్ నాయర్

నటీనటులు : టిస్కా చోప్రా, సౌరభ్ శుక్లా, రాజేష్ తైలాంగ్, ముకేశ్ తివారీ, రోహన్ జోషి

ఐఎండీబీ రేటింగ్ : 7.1 / 10

దహన్ స్టోరీ ఏంటంటే?

అవని రౌత్ (టిస్కా చోప్రా) అనే నిజాయితీ గల ఐఏఎస్ అధికారి వ్యక్తిగత జీవితంలో భయంకరమైన విషాదం, భర్త మరణం తాలూకు బాధ, అలాగే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆమెకు రాజస్థాన్‌లోని 'శిలాస్పూర్' (Shilaspur) అనే రహస్యమైన గ్రామానికి పోస్టింగ్ లభిస్తుంది.

అవని అక్కడ మాంగోన్ కార్పొరేషన్ తరఫున అత్యంత విలువైన, అరుదైన భూమిలోని ఖనిజాల మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు వెళుతుంది. అయితే ఆ గ్రామంలోని మైనింగ్‌ను గ్రామ పెద్దగా ఉండే స్వరూప్ (సౌరభ్ శుక్లా) తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. భూమిని తవ్వితే భూగర్భంలో ఉన్న 'రిధ్యాకన్' అనే క్రూరమైన రాక్షసుడు మేల్కొంటాడని, దానివల్ల ఊరికి ఊరే సర్వనాశనమైపోతుందని హెచ్చరిస్తాడు.

భయానక సంఘటనలు.. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్

గ్రామంలో వరుసగా చనిపోయిన పక్షులు కనిపించడం, వింతైన హత్యలు జరగడంతో కథ ఒక్కసారిగా ఊపందుకుంటుంది. ఐఏఎస్ అధికారి అయిన అవని ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తూ, ఒక డాక్టర్ సహాయంతో దీని వెనుక ఉన్న శాస్త్రీయ కోణాన్ని, నిజాలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆమె ప్రతి అడుగులోనూ ఊహించని భయానక దృశ్యాలు ఎదురవుతాయి.

ఈ వెబ్ సిరీస్‌ను విక్రాంత్ పవార్, జై శర్మ అద్భుతంగా డైరెక్ట్ చేశారు. టిస్కా చోప్రా, సౌరభ్ శుక్లా, రాజేష్ తైలంగ్, ముకేష్ తివారీ వంటి అనుభవజ్ఞులైన నటీనటులు తమ అద్భుతమైన నటనతో ఈ వెబ్ సిరీస్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు.

రైటర్స్‌కే థెరపిస్ట్ అవసరమైందట..

ఈ వెబ్ సిరీస్ వెనుక ఒక ఆసక్తికరమైన, షాకింగ్ విశేషం ఉంది. ఈ వెబ్ సిరీస్‌కు కథ అందించిన ముగ్గురు రైటర్లు నిసర్గ మెహతా, శివ బాజ్‌పాయ్, నిఖిల్ నయ్యర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షూటింగ్ సమయంలో పడిన మానసిక ఒత్తిడిని బయటపెట్టారు. రైటింగ్ చేసే సమయంలో స్క్రిప్ట్ కోసం ముగ్గురి మధ్య తీవ్రమైన వాదనలు, గొడవలు జరిగేవని చెప్పారు.

కొన్నిసార్లు గొడవలు ఎంత తీవ్రంగా ఉండేవంటే ఒకరిపై ఒకరు పెన్సిళ్లు విసురుకునేవారని, ఆ తర్వాత మానసిక పరిస్థితి దెబ్బతినడంతో ఏకంగా ఒక థెరపిస్ట్‌ను కూడా హైర్ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. డైరెక్టర్ తమకు పూర్తి స్వేచ్ఛనివ్వడం వల్లే ఈ రేంజ్ డార్క్ థ్రిల్లర్ కంటెంట్ బయటకు వచ్చిందని వారు వెల్లడించారు. వీకెండ్‌లో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More