Horror Thriller Web Series: రాత్రిపూట ఒంటరిగా అస్సలు చూడకూడని వెబ్ సిరీస్.. ఓటీటీలోని ఈ హారర్ థ్రిల్లర్ చూశారా?
Horror Thriller Web Series: ఓటీటీలో ఓ 8 ఎపిసోడ్ల హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అదరగొడుతోంది. ఓ అమ్మాయి, తన ఉండే రూమ్, అందులో జరిగే వింత ఘటనల చుట్టూ తిరుగుతూ రాత్రిపూట నిద్ర పట్టకుండా చేస్తున్న సిరీస్ ఇది.
Horror Thriller Web Series: సైకలాజికల్ హారర్, సూపర్ నేచురల్ థ్రిల్లర్స్ ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే భయాన్ని అందిస్తే ఆ కిక్కే వేరు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ఆడియన్స్ కి నిద్రలేకుండా చేస్తున్న లేటెస్ట్ కల్ట్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఖౌఫ్' (Khauf). 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టడమే కాకుండా ప్రతి సీన్ లోనూ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ సిరీస్ కు ఐఎండీబీలో 7.4 రేటింగ్ నమోదైంది.

ఖౌఫ్ వెబ్ సిరీస్ కథేంటంటే?
గ్వాలియర్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయిన ఒక యువతి 'మధు' జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గతంలో తను ఫేస్ చేసిన ఒక దారుణమైన లైంగిక వేధింపుల (Sexual Assault) దాడి నుంచి బయటపడటానికి ఢిల్లీ వచ్చి ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో చేరుతుంది. అయితే అక్కడ ఆమెకు కేటాయించిన 'రూమ్ నంబర్ 333' వెనుక ఒక డార్క్ హిస్టరీ, భయంకరమైన గతం దాగి ఉంటాయి.
రూమ్ నంబర్ 333లో అసలు ఏం జరిగింది?
ఆ రూమ్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మధుకి రకరకాల వింత అనుభవాలు ఎదురవుతాయి. ఒకవైపు రూమ్ లో జరిగే హారర్ సీన్స్, మరోవైపు హాస్టల్ లో ఉన్న మిగతా అమ్మాయిలతో గొడవలు ఆమెను మానసికంగా నరకానికి గురిచేస్తాయి. మిగిలిన అమ్మాయిలు తనని కావాలనే వేధిస్తున్నారని మధు భ్రమ పడుతుంది. కానీ ఆ రూమ్ లో దాగున్న డార్క్ ఫోర్స్ అసలు నిజం అని తెలుసుకునే లోపే కథ మైండ్ బెండింగ్ ట్విస్టులు తీసుకుంటుంది.
ఇదే సమయంలో ఆమె గతంలో తనపై దాడి చేసిన 'నకుల్' మళ్లీ ఎంట్రీ ఇవ్వడంతో కథ మరింత ఇంటెన్స్ గా మారుతుంది. సైకలాజికల్ డ్రామా నుంచి ప్యూర్ హారర్ కి షిఫ్ట్ అయ్యే విధానం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి.
నటీనటుల పర్ఫార్మెన్స్, డైరెక్షన్ అల్టిమేట్
డైరెక్టర్స్ పంకజ్ కుమార్, సూర్య ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. రైటర్ స్మితా సింగ్ రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రతి ఎపిసోడ్ లోనూ సస్పెన్స్ పెంచుకుంటూ పోతుంది. మెయిన్ లీడ్ లో నటించిన మోనిక పన్వార్ (జాంతారా ఫేమ్) తన బాధ, భయం, ఆవేదనను స్క్రీన్ పై జీవించేసింది.
ఇక వర్సటైల్ యాక్టర్ రజత్ కపూర్ క్యారెక్టర్ మేక్ ఓవర్ ఈ సిరీస్ కి మేజర్ హైలైట్. ఆయన క్యారెక్టర్ లో ఉండే ట్విస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. గీతాంజలి కులకర్ణి, శిల్పా శుక్లా, అభిషేక్ చౌహాన్, చుమ్ దరాంగ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాధారణంగా హారర్ సినిమాల్లో జంప్ స్కేర్స్ (Jump Scares) ఎక్కువ ఉంటాయి. కానీ 'ఖౌఫ్' లో ప్రొడక్షన్ డిజైన్, లైటింగ్, కెమెరా వర్క్ తోనే ఒక రకమైన క్లాస్ట్రోఫోబిక్ భయాన్ని క్రియేట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటుంటే గుండె వేగం పెరగడం ఖాయం.
ప్రతి ఎపిసోడ్ దాదాపు 43 నుంచి 50 నిమిషాల నిడివితో ఉంటుంది. ఒక్కసారి స్టార్ట్ చేస్తే 8 ఎపిసోడ్స్ పూర్తయ్యే వరకు స్క్రీన్ కి అతుక్కుపోతారు. 7.4 ఐఎండీబీ (IMDb) రేటింగ్ సొంతం చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ని థ్రిల్లర్ లవర్స్ అస్సలు మిస్ కాకూడదు. ధైర్యం చేసి చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో వెంటనే వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. అయితే రాత్రి పూట ఒంటరిగా చూడాలనుకునే ముందు కాస్త ఆలోచించుకోండి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


