OTT: ఓటీటీలోకి బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ అలీ బయోపిక్- ది గ్రేటెస్ట్ ట్రైలర్ రిలీజ్-ఆయన ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఆమోదం!
Muhammad Ali Biopic The Greatest OTT Trailer Released: ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ అలీ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఓటీటీ సిరీస్ ది గ్రేటెస్ట్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. మహమ్మద్ అలీ ఫ్యామిలీ నుంచి ఆమోదం పొందిన తొలి సిరీస్‌గా ది గ్రేటెస్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
Muhammad Ali Biopic The Greatest OTT Trailer Released: బాక్సింగ్ రింగ్‌లో మెరుపు వేగంతో పంచ్‌లు విసురుతూ ప్రత్యర్థులను పడగొట్టడమే కాదు, రింగ్ వెలుపల తన సిద్ధాంతాలు, నమ్మకాల కోసం ప్రపంచవ్యాప్తంగా గళమెత్తిన ధీరుడు మహమ్మద్ అలీ.

సాధారణ కుటుంబంలో పుట్టి
సాధారణ కుటుంబంలో 'క్యాషియస్ క్లే'గా ప్రయాణం ప్రారంభించి ప్రపంచం గర్వించే 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'గా ఎదిగిన ఆ మహోన్నత క్రీడాకారుడు మహమ్మద్ అలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తొలి అధికారిక ఓటీటీ సిరీస్ 'ది గ్రేటెస్ట్' (The Greatest). తాజాగా ది గ్రేటెస్ట్ ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లను సదరు ఓటీటీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మహమ్మద్ అలీ జీవితంపై ఇప్పటివరకు అనేక డాక్యుమెంటరీలు, సినిమాలు వచ్చాయి. అయితే ఆయన కుటుంబం నుంచి అధికారిక అనుమతి పొంది (Authorized Scripted Series), పూర్తి నాటకీయతతో రూపొందించిన ఏకైక వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం.
రింగ్ లోపలా, వెలుపలా సాగిన సంచలన ప్రయాణం
అమెరికాలోని లూయిస్విల్లే ప్రాంతానికి చెందిన యువకుడు క్యాషియస్ క్లే.. ప్రపంచ బాక్సింగ్ సామ్రాజ్యాన్ని శాసించిన మహమ్మద్ అలీగా ఎలా రూపాంతరం చెందాడనేది ఈ ఓటీటీ సిరీస్ ప్రధాన కథాంశం. క్రీడా ప్రపంచంలో అతను సాధించిన అద్భుత విజయాలతో పాటు వ్యక్తిగత, సామాజిక, రాజకీయ రంగాల్లో ఎదుర్కొన్న సవాళ్లను అత్యంత ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు.
సమాజంలో తన సొంత గుర్తింపు కోసం, ఆత్మగౌరవం కోసం ఒక యోధుడు చేసిన నిరంతర పోరాటమే ఈ ది గ్రేటెస్ట్ ఓటీటీ సిరీస్. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్ నవంబర్ 4 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 240కి పైగా దేశాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ది గ్రేటెస్ట్ ఓటీటీ రిలీజ్ కానుంది.
నటీనటుల ప్రతిభ, హాలీవుడ్ స్థాయి మేకింగ్
ఈ వెబ్ సిరీస్‌లో మహమ్మద్ అలీ (క్యాషియస్ క్లే) ప్రధాన పాత్రను నటుడు జాలెన్ బెస్ట్ పోషించారు. అలీ తండ్రి క్యాషియస్ క్లే సీనియర్ పాత్రలో ఒమారీ హార్డ్‌విక్, తల్లి ఒడెస్సా పాత్రలో డానా గౌరియర్, సోదరుడు రూడీగా కై పర్హామ్ అద్భుతంగా నటించారు.
అలీకి ఎంతగానో తోడ్పడిన బాక్సింగ్ కోచ్ ఏంజెలో డండీ పాత్రను జియోవన్నీ రిబిసి, నాటి పౌర హక్కుల నేత మాల్కం ఎక్స్ పాత్రను మైఖేల్ ఈలీ, ప్రధాన ప్రత్యర్థి బాక్సర్ సన్నీ లిస్టన్ పాత్రను అమిన్ జోసెఫ్ ధరించారు. నటీనటుల హావభావాలు, ఆ కాలం నాటి అమెరికన్ వాతావరణాన్ని రీ-క్రియేట్ చేసిన తీరు ది గ్రేటెస్ట్ ట్రైలర్లోనే ఆకట్టుకుంటోంది.
అలీ భార్య నిర్మాణంలో..
మహమ్మద్ అలీ సతీమణి లోనీ అలీ ఈ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సిరీస్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి ప్రతి సన్నివేశం వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకున్నారు. ప్రముఖ షోరన్నర్ బెన్ వాట్కిన్స్ ఈ సిరీస్‌ను సృష్టించి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
హాలీవుడ్ స్టార్ నటుడు మైఖేల్ బి. జోర్డాన్ (అవుట్‌లయర్ సొసైటీ), అంతర్జాతీయ సంగీత దిగ్గజం జే-జీ (షాన్ కార్టర్ - రాక్ నేషన్) కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములయ్యారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్‌తో కలిసి వీరంతా భారీ వ్యయంతో ఈ సిరీస్‌ను నిర్మించారు.
ది గ్రేటెస్ట్ ఓటీటీ స్ట్రీమింగ్
క్రీడా రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించడమే కాకుండా, సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహమ్మద్ అలీ ప్రయాణాన్ని కళ్లకు కట్టే ఈ సిరీస్ కోసం క్రీడాభిమానులతో పాటు ఓటీటీ ప్రియులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కాబట్టి, స్పోర్ట్స్, మహమ్మద్ అలీ జీవిత చరిత్ర చూడాలనుకునేవారు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ది గ్రేటెస్ట్ సిరీస్ కోసం ఎదురుచూడాల్సిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


