OTT Telugu: 2 ఓటీటీల్లోకి తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్- అమ్మాయిల బాడీ నుంచి పర్ఫ్యూమ్ తీసే కిల్లర్-10కి 10 రేటింగ్
Mayookha OTT Streaming On 2 Platforms: ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మయూఖ స్ట్రీమింగ్ కానుంది. అది కూడా 2 ఓటీటీల్లో. పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో, బిగ్ బాస్ అమన్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీతేజ్ ఎస్‌కే దర్శకత్వం వహించారు. మరి ఈ మయూఖ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.
OTT Telugu Psychological Crime Thriller Mayookha On 2 Platforms: తెలుగు ఓటీటీ రంగంలో థ్రిల్లర్, సస్పెన్స్ సినిమాలకు ఎప్పుడూ విశేష ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా సైకలాజికల్ అంశాలతో కూడిన క్రైమ్ కథాంశాలను ఓటీటీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అలాగే, ఇటు థియేటర్లలో విడుదల కాగానే ఆ సినిమాల ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి చూపుతుంటారు.

మయూఖ ఓటీటీ స్ట్రీమింగ్
ఈ క్రమంలోనే, విభిన్నమైన ప్లాట్‌తో థియేటర్లలో సస్పెన్స్ రేపిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'మయూఖ' (Mayookha) ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్యూరియాసిటీ నెలకొంది. బ్యూటిఫుల్ పాయల్ చెంగప్ప హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో బిగ్ బాస్ తెలుగు 10 కంటెస్టెంట్ అమన్ మసూద్ కీలక పాత్ర పోషించడం విశేషం.
పేరు మార్చుకుని డైరెక్టర్‌గా
అంతేకాకుండా మయూఖ సినిమాతో నిర్మాత శ్రీకాంత్ కాండ్రెగుల.. శ్రీ తేజ్ ఎస్‌కే (Shree Tej SK)గా పేరు మార్చుకుని దర్శకత్వం వహించారు. శశిధర్ నల్లా నిర్మించిన ఈ సినిమాలో పాయల్, అమన్‌తోపాటు దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిష్మా డబ్బారా కీలక పాత్రలు పోషించారు.
ఐఎమ్‌డీబీలో 10కి 10 రేటింగ్
అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలైన మయూఖ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్ ట్విస్టులు, సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ పంచిందని కామెంట్స్ వచ్చాయి. వీటన్నింటికి మించి ఐఎమ్‌డీబీ సంస్థ మయూఖ సినిమాకు 10కి 10 రేటింగ్ (అక్టోబర్ 12 నాటికి) ఇవ్వడం ఆశ్చర్యకరమైన విషయం.
భయంకరమైన గతం.. ఇంట్లోనే దాక్కున్న అపరిచితుడు!
ఈ సినిమా కథ విషయానికి వస్తే, మయూఖ (పాయల్ చెంగప్ప) ఒక బ్యాంకు ఉద్యోగి. పదేళ్ల వయసులో జరిగిన ఒక చేదు అనుభవం ఆమెను నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. ఆ భయం నుంచి బయటపడటానికి ఆమె పడే తాపత్రయం ఒకెత్తయితే, ఆమె ప్రమేయం లేకుండానే ఆమె ఇంట్లోకి ఒక అపరిచితుడు ప్రవేశించడం మరొక ఎత్తు.
ప్రతి రాత్రి ఆమె పక్కనే పడుకుని, ఎలాంటి హాని తలపెట్టకుండా ఉదయాన్నే వెళ్లిపోయే ఆ సీక్రెట్ వ్యక్తి ఎవరు అనేది కథలో ప్రధాన రహస్యంగా మారుతుంది. మరోవైపు నగరంలో ఒక సైకో కిల్లర్ సంచరిస్తూ మహిళలను వరుసగా హత్య చేస్తుంటాడు.
బాధితుల చేతుల నుంచి ఒక ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాన్ని (పర్ఫ్యూమ్) సేకరించడమే లక్ష్యంగా ఆ కిల్లర్ క్రూరమైన నేరాలకు పాల్పడుతుంటాడు. మయూఖ జీవితం, ఈ సైకో కిల్లర్ మార్గంతో ఎలా ముడిపడింది? ఆమె తన ప్రాణాలను ఎలా కాపాడుకుంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.
ఆకట్టుకునే సెకండాఫ్.. అలరించే ట్విస్టులు
దర్శకుడు శ్రీ తేజ్ ఎస్‌కే ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రథమార్థంలో ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, కథానాయిక మానసిక భయాన్ని చూపించేందుకు కొంత ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, సెకండాఫ్‌లో కథ వేగం పుంజుకుంటుంది.
సైకో కిల్లర్ గతం, అతడు హత్యలు చేయడానికి గల కారణాలు ప్రేక్షకులను గగుర్పాటుకు గురిచేస్తాయి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడు చాలా చక్కగా ఉత్కంఠంగా తీర్చిదిద్దారు. ఇంతటి క్రేజ్ తెచ్చుకుంటోన్న మయూఖ ఏకంగా రెండు ఓటీటీల్లోకి వచ్చేయనుంది.
2 ఓటీటీల్లో స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్, ఆహాలలో మయూఖ ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం. ఇదే నెలలో అక్టోబర్ 30 నుంచి ఈ రెండింట్లో మయూఖ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుందని టాక్ నడుస్తోంది.
లైట్‌గా హారర్ ఎలిమెంట్స్, ఎక్కువగా సైకలాజికల్, మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో సాగే మయూఖ ఓటీటీలో చూసేందుకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే, ఓటీటీ కంటే థియేటర్లలో మయూఖను ఎక్స్‌పీరియెన్స్ చేయడం మరింత బెటర్ ఆప్షన్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


