OTT Horror Telugu: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సిరీస్- మనుషులను తినే వింత రాక్షసులు!

The Village OTT Streaming In Telugu: వెర్సటైల్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన తెలుగు, తమిళ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది విలేజ్ ఓటీటీలో ఇప్పటికీ దూసుకుపోతోంది. మనుషులను వేటాడి తినే వింత రాక్షసుల మధ్యలో తన కుటుంబాన్ని కాపాడుకునే తండ్రి కథ. ది విలేజ్ ఓటీటీ రిలీజ్‌పై లుక్కేద్దాం.

Published on: Oct 11, 2026, 08:42:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT SciFi Horror Thriller The Village Release In Telugu: తమిళ చిత్రసీమలో స్టార్ హీరోగా ఆర్య మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో వరుడు సినిమాతో విలన్‌గా పరిచయమైన ఆర్య హీరోగానూ మెప్పించాడు. తెలుగు రాష్ట్రాల్లో హీరోగా గుర్తింపు పొందిన ఆర్య నటించిన ఓటీటీ వెబ్ సిరీస్ ది విలేజ్.

ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సిరీస్- మనుషులను తినే వింత రాక్షసులు!
ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సిరీస్- మనుషులను తినే వింత రాక్షసులు!

గ్రాఫిక్ నవల ఆధారంగా

సైన్స్ ఫిక్షన్ క్రీచర్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో ది విలేజ్‌ను తెరకెక్కించారు. భారతదేశంలో ఒక గ్రాఫిక్ నవల్ ఆధారంగా లైవ్-యాక్షన్ రూపంలో తెరకెక్కిన మొదటి సిరీస్‌గా దీనిపై ఓటీటీ ప్రియుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఇది. 'గృహం' చిత్రంతో ప్రేక్షకులను భయపెట్టిన మిలింద్ రావు ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

అలాంటి ది విలేజ్ ఓటీటీలో ఇప్పటికీ దూసుకుపోతోంది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో ది విలేజ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 2023లో నవంబర్ 24న ఓటీటీలోకి వచ్చిన ది విలేజ్ వెబ్ సిరీస్ ఇప్పటికీ దూసుకుపోవడం విశేషం.

మనుషులని తినే వింత జీవులు.. కట్టియాల్ గ్రామం సస్పెన్స్!

నగర జీవితానికి దూరంగా, తమిళనాడులోని తూత్తుకుడి తీర ప్రాంతంలో ఉన్న 'కట్టియాల్' అనే ఒక నిర్మాణుష్య గ్రామం నేపథ్యంగా ఈ కథ సాగుతుంది. గౌతమ్ (ఆర్య), అతడి భార్య నేహా (దివ్య పిళ్లై), కుమార్తె మాయ తమ కారు పంక్చర్ కావడంతో అనుకోకుండా ఈ భయంకరమైన ఊరి సరిహద్దుల్లో చిక్కుకుపోతారు. సాయం కోసం గౌతమ్ దగ్గరలోని టౌన్‌కు వెళ్లిన సమయంలో అతడి భార్య, కూతురు వింతగా అదృశ్యమవుతారు.

తిరిగి వచ్చిన గౌతమ్, ఆ ఊరి నేపథ్యం తెలిసిన స్థానికులు పీటర్ (జార్జ్ మేరియన్), కరుణాగమ్ (ముత్తు కుమార్), శక్తివేల్ (ఆడుకాలం నరేన్) సాయంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అడవిలోకి వెళ్తాడు.

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్

మరోవైపు, పక్షవాతంతో వీల్ చైర్‌కే పరిమితమైన ప్రకాష్ (అర్జున్ చిదంబరం) అనే నేరస్థుడు, తాను మళ్లీ నడవడానికి ఉపయోగపడే 'లాంటనైట్' అనే రసాయనం కోసం ఫర్హాన్ (జాన్ కొక్కెన్) నాయకత్వంలో కొందరు రౌడీలను, శాస్త్రవేత్తలను అదే గ్రామానికి పంపిస్తాడు. వీళ్లందరినీ కట్టియాల్ అడవిలోని వింత జీవులు, విచిత్రమైన మ్యూటెంట్ రాక్షసులు ఎలా వెంటాడాయి? గౌతమ్ తన కుటుంబాన్ని దక్కించుకున్నాడా లేదా అనేది అసలు కథ.

హారర్ జోనర్‌లో ప్రేక్షకుడు సీటు అంచున కూర్చోవాలి. 'ది విలేజ్' ఆ విషయంలో పర్వాలేదనిపిస్తుంది. దర్శకుడు సృష్టించుకున్న ఫాంటసీ ప్రపంచంలో ఎంతో వైవిధ్యం ఉంది. 6 ఎపిసోడ్స్‌గా ఉన్న ఈ ఓటీటీ సిరీస్ డైలాగ్స్, థ్రిల్లింగ్, భయపెట్టే సీన్లతో ఆకట్టుకుంటుంది.

భయపెట్టే విజువల్ ఎఫెక్ట్స్

నటీనటుల విషయానికి వస్తే, హీరో ఆర్య మెప్పించాడు. భార్యాపిల్లలు అదృశ్యమైనప్పుడు ఒక తండ్రి పడే వేదన, భయం వంటి ఎక్స్‌ప్రెషన్స్ బాగా పలికించాడు. ఆడుకాలం నరేన్, ముత్తు కుమార్ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. అయితే, జార్జ్ మేరియన్ వంటి మంచి నటుడి పాత్రకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. కమాండోలు, శాస్త్రవేత్తలుగా చేసిన మిగిలిన పాత్రలు నాటకీయంగా కనిపిస్తాయి.

సాంకేతిక విభాగంలో కట్టియాల్ ఫ్యాక్టరీ సెట్ డిజైన్లు, మేకప్ చాలా బాగా మెప్పిస్తాయి. చివరి రెండు ఎపిసోడ్లలో వయోలెన్స్, గోర్ (Gore) సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ భయపెట్టేలా ఉంటాయి. హాలీవుడ్ హారర్ సినిమాలను అనుకరిస్తూ తీసిన 'ది విలేజ్' బాగానే ఆకట్టుకుంటుంది.

ది విలేజ్ ఓటీటీ స్ట్రీమింగ్

ఇలాంటి హారర్ థ్రిల్లర్ సిరీస్ ది విలేజ్ ఓటీటీలో అదరగొడుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ది విలేజ్ ఓటీటీ రిలీజ్ అయింది. ప్రస్తుతం 5 భాషల్లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉన్న ది విలేజ్ వెబ్ సిరీస్ వీకెండ్‌కు చూసేందుకు బెస్ట్ ఆప్షన్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More