OTT Review: ఓటీటీ రివ్యూ- హైస్కూల్ విద్యార్థిపై సైబర్ వేధింపులు, కంటిచూపుతో శాసించే శక్తితో ప్రతీకారం- హారర్ సిరీస్ ఇలా!
Carrie Series Review In Telugu And Rating: ప్రసిద్ధ రచయిత స్టీఫెన్ కింగ్ క్లాసిక్ హారర్ కథ 'కేరీ' ఆధారంగా తెరకెక్కిన కొత్త వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి తెలుగులో వచ్చేసింది. సైబర్ వేధింపులపై సైకలాజికల్ హారర్ డ్రామాగా తీసిన కేరీ ఏమేరకు మెప్పించిందో నేటి కేరీ ఓటీటీ రివ్యూలో చూద్దాం.
Carrie Web Series OTT Review In Telugu And Rating: ప్రపంచవ్యాప్తంగా హారర్, మిస్టరీ కథలకు ఉండే క్రేజ్ వేరు. అందులోనూ ప్రసిద్ధ రచయిత స్టీఫెన్ కింగ్ నవలల ఆధారంగా వచ్చే చిత్రాలకు సినీ ప్రియుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

8 ఎపిసోడ్లతో కేరీ ఓటీటీ సిరీస్
ఆయన రాసిన ఐకానిక్ హారర్ కథ 'కేరీ' ఆధారంగా గతంలోనే సినిమాలు వచ్చినప్పటికీ, నేటి సోషల్ మీడియా యుగానికి తగినట్లుగా సరికొత్తగా ఈ 2026 కేరీని ఆవిష్కరించారు ప్రముఖ దర్శకుడు మైక్ ఫ్లానగన్. ఎనిమిది ఎపిసోడ్ల ఓటీటీ సిరీస్‌గా 'కేరీ' (Carrie) రూపొందించారు.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేరీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీషుతోపాటు తెలుగులో కూడా అక్టోబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో కేరీ ఓటీటీ రిలీజ్ అయింది. మరి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉన్న ఈ ఓటీటీ సిరీస్ ఎలా ఉందో నేటి కేరీ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
యువెన్ హైస్కూల్లో చేరిన కేరీ వైట్ (సమ్మర్ హెచ్ హోవెల్) అనే అమాయకపు అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తీవ్రమైన మూఢనమ్మకాలు కలిగిన తల్లి మార్గరెట్ (సమంతా స్లోయెన్) ఆంక్షల మధ్య పెరిగిన కేరీ, తొలిసారిగా బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. తండ్రి ప్రమాదంలో చనిపోవడంతో మానసికంగా ఒంటరిగా మారిన కేరీ, హైస్కూల్లో కొత్త స్నేహితులను సంపాదించుకోవాలని ఆశిస్తుంది.
అయితే హైస్కూల్లో ఉండే క్రిస్టీన్ (అలిసన్ థార్న్‌టన్) అనే అమ్మాయి కేరీని టార్గెట్ చేసి ర్యాగింగ్ చేస్తుంది. కేరీ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచి సైబర్ వేధింపులకు గురిచేస్తుంది. ఈ వేధింపులు తాళలేక తీవ్ర ఆవేదనకు గురైన కేరీ, తనలో దాగి ఉన్న భయంకరమైన టెలికినెటిక్ శక్తులను (వస్తువులను కంటిచూపుతోనే కదిలించే శక్తి) గుర్తిస్తుంది. ఆ తర్వాత తనను వేధించిన వారిపై కేరీ ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అసలు కేరీకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కేరీ వల్ల ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? అనేదే అసలు కథ.
విశ్లేషణ:
ఇప్పటికే కేరీ టైటిల్‌తో ఇదే తరహా కాన్సెప్ట్ ఓటీటీ సిరీస్‌లు వచ్చాయి. అవి చూసిన వారికి కేరీ 2026 వెబ్ సిరీస్ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. కానీ, కొత్తగా చూసేవారికి అదిరిపోయే థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. కేరీ వైట్ హైస్కూల్‌లో చేరడం, అప్పటివరకు తల్లి నీడలో, కండిషన్స్ మధ్య పెరగడవం వంటి సీన్స్ పర్వాలేదనిపిస్తాయి.
హైస్కూల్‌లో కేరీ చేరినప్పటినుంచే అసలు కథ మొదలవుతుంది. కేరీని మిగతా స్టూడెంట్స్ టార్గెట్ చేయడం, ఏడిపించడం, సెన్సిబుల్ విషయాల్లో కూడా ఆటాడుకోవడం వంటివి చూసే ఆడియెన్స్ ఆలోచింజపజేసేలా ఉంటాయి. డిజిటల్ యుగంలో ట్రోలింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ సంస్కృతి విద్యార్థుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఇందులో బాగా ఆవిష్కరించారు.
సైబర్ బుల్లీయింగ్.. టెలికినెటిక్ శక్తుల ప్రతీకారం!
ఈ వేధింపులు తట్టుకోలేక ఒక్కసారి తనలోని టెలికినెటిక్ శక్తి బయటపడగానే కథ కొత్త ఊపు అందుకుంటిది. ఆ శక్తులతో కేరీ చేసే ప్రయోగాలు, అవేంటనే అయోమయం, కొన్నిసార్లు తల్లిపై కూడా ఆ శక్తులని తెలియకుండానే ప్రయోగించడం వంటివి, సైబర్ బుల్లియింగ్, టెలికినెటిక్ శక్తులతో తీర్చుకునే ప్రతీకార అంశాలు బాగున్నాయి.
మైక్ ఫ్లానగన్‌తో పాటు మిగతా దర్శకులు పాటించిన మేకింగ్ స్టాండర్డ్స్ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. చరిత్రలో వింత శక్తులు ఉన్న మహిళలను సమాజం ఎలా రాక్షసత్వంతో చూసిందో వివరించే సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా పార్టీ సీక్వెన్స్, క్లైమాక్స్ వైపు సాగే ప్రతీకార సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతాయి.
నటీనటుల ప్రతిభ.. మేకింగ్ హైలైట్స్
కేరీ వైట్ పాత్రలో సమ్మర్ హెచ్ హోవెల్ అద్భుతంగా నటించింది. అమాయకపు చూపుల నుంచి భయంకరమైన ప్రతీకార రూపంలోకి మారే విధానాన్ని ఎంతో సహజంగా పండించింది. కేరీ తల్లిగా సమంతా స్లోయెన్, టీచర్ పాత్రలో అంబర్ మిడ్‌థండర్ తమ నటనతో ఆకట్టుకున్నారు. కేవలం కేరీ పాత్రనే కాకుండా, ఆమెను వేధించే క్రిస్టీన్ పాత్రలోని అంతరంగాన్ని కూడా దర్శకుడు ఆసక్తికరంగా చూపించారు.
కొన్ని లోపాలు ఉన్నా.. వీకెండ్‌కు బెస్ట్ చాయిస్!
మొత్తం ఎనిమిది ఎపిసోడ్లలో కొన్ని మధ్య భాగాలు కొంత స్లోగా, సాగదీసినట్లు అనిపిస్తాయి. తల్లి, కుమార్తెల మధ్య ఉండే సంఘర్షణను మరింత లోతుగా చూపిస్తే కేరీ ప్రతీకారాన్ని ఇంకా జస్టిఫై చేసినట్లుగా ఉండేది. అయినప్పటికీ, సోషల్ మీడియా యుగంలో మానసిక వేధింపులు, సానుభూతి లేని సమాజంపై ఒక అమ్మాయి తిరుగుబాటును ఎంతో అర్థవంతంగా తెరకెక్కించారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
పాత కథనే నేటితరానికి అనుగుణంగా మార్చి హారర్ అభిమానులను అలరించడంలో మైక్ ఫ్లానగన్ విజయం సాధించారు. సైకలాజికల్ థ్రిల్లర్లు, హారర్ కంటెంట్ ఇష్టపడే సినీ ప్రియులకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ కేరీ సిరీస్ మంచి అనుభూతిని ఇస్తుంది.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


