Hyper Aadi: నాగబాబు అడగడమే లేటు.. జబర్దస్త్ లో హైపర్ ఆది రీ ఎంట్రీ.. మళ్లీ పంచ్ ల ప్రవాహమే.. ఎప్పటి నుంచంటే?

Hyper Aadi: జబర్దస్త్ తో వెలుగులోకి వచ్చి, ఇప్పుడు తెలుగు సినిమాల్లో కమెడియన్ గా బిజీ అయిన హైపర్ ఆది మళ్లీ బుల్లితెరపైకి రాబోతున్నాడు. జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నాగబాబు అడగడమే ఆలస్యం మళ్లీ స్కిట్ లు చేస్తానని ఆది ఒప్పుకున్నాడు.

Published on: May 17, 2026, 05:31:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hyper Aadi: జబర్దస్త్.. పుష్కర కాలానికి పైగా టీవీ ఆడియన్స్ ను నవ్విస్తున్న కామెడీ షో. ఎంతోమందికి వెండితెర బాటలు పరిచిన షో. టాలీవుడ్ కు యంగ్ అండ్ టాలెంటెడ్ కమెడియన్స్, హీరోస్ ను అందించిన షో. మధ్యలో షో జోరు కాస్త తగ్గినా ఇప్పుడు నాగబాబు తిరిగి రావడంతో మళ్లీ పుంజుకుంటుంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇది.

జబర్దస్త్ లోకి హైపర్ ఆది రీ ఎంట్రీ (youtube)
జబర్దస్త్ లోకి హైపర్ ఆది రీ ఎంట్రీ (youtube)

హైపర్ ఆది రీ ఎంట్రీ

జబర్దస్త్ తోనే జనాల అభిమానాన్ని సంపాదించి, సినిమాల్లో కమెడియన్ గా అదరగొడుతున్న హైపర్ ఆది గురించి తెలుసు కదా. ఒకప్పుడు అతను జబర్దస్త్ లో చేసే స్కిట్లు సూపర్ హిట్లు. అతని మాటల ధాటి, పంచ్ ల ప్రవాహం అనర్గళంగా సాగిపోయేది. హైపర్ ఆది స్కిట్ అంటే తిరుగుండేది కాదు. కానీ సినిమాల కారణంగా అతను షో మానేశాడు. దీంతో షోకే కళ తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఆ పంచ్ ల ఎక్స్ ప్రెస్ తిరిగి జబర్దస్త్ లోకి రాబోతుంది. అవును.. హైపర్ ఆది రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఎప్పటి నుంచి?

తాజాగా రిలీజ్ చేసిన జబర్దస్త్ ప్రోమోలో హైపర్ ఆది మెరిశాడు. తనదైన స్టైల్లో టీమ్ లీడర్స్, కంటెస్టెంట్లపై పంచ్ లు వేశాడు. ఇక చివర్లో ‘ఆది ఎప్పుడొస్తావ్ జబర్దస్థ్ కు’ అని నాగబాబు అడిగాడు. ఆ వెంటనే జూన్ నుంచి స్టార్ట్ చేస్తానని హైపర్ ఆది చెప్పేశాడు. అంటే జబర్దస్త్ లో మళ్లీ హైపర్ ఆది పంచ్ ల ప్రవాహాన్ని జూన్ నుంచి చూడొచ్చన్న మాట. అందరిని కలుపుకొని వస్తానని కూడా ఆది చెప్పాడు.

అప్పట్లో సంచలనం

2013, ఫిబ్రవరి 7న స్టార్ట్ అయిన జబర్దస్త్ అప్పట్లో సంచలనం. కామెడీ స్కిట్లతో నవ్వించడమనే కాన్సెప్ట్ బుల్లితెరపై అప్పుడే కొత్తగా వచ్చింది. గంటసేపు జనాలను హాయిగా నవ్వించిన ఈ షో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు జనాలు క్రమంగా ఈ షోకు అలవాటు పడిపోయారు. జడ్జీలుగా నాగబాబు, రోజా.. యాంకర్ గా అనసూయ షోను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చారు. ఇప్పుడు డైరెక్టర్లుగా మారిన వేణు, ధన్ రాజ్ తో పాటు చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, రోలర్ రఘు, చలాకీ చంటి టీమ్ లీడర్లుగా జబర్దస్త్ జనాల్లోకి దూసుకుపోయింది. ఆ తర్వాత కొత్త రక్తం వచ్చింది.

మధ్యలో బ్రేక్

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ ఎంటర్ టైన్మెంట్ డబుల్ అయింది. కొత్త టీమ్ లీడర్లు వచ్చాయి. టీమ్స్ మారాయి. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. కానీ ఫస్ట్ సుధీర్, ఆ తర్వాత హైపర్ ఆది వెళ్లిపోవడంతో షో డల్ అయింది. అంతేకాకుండా జడ్జీలు మారడం కూడా దెబ్బతీసింది. రేటింగ్స్ పడిపోయాయి. పోటీగా వేరే ఛానెల్స్ లో ఇతర కామెడీ షోలు వచ్చాయి. ఇది కామెడీ ఏంట్రా బాబూ? అంటూ జనాలు కామెంట్లలో తమ అసహనం వ్యక్తం చేశారు.

పునర్‌వైభవం దిశగా

జబర్దస్త్ ఇప్పుడు పునర్‌వైభవం దిశగా అడుగులు వేస్తోంది. నాగబాబు జడ్జీగా తిరిగి వచ్చాడు. స్కిట్లలో క్వాలిటీ పెరిగింది. ఇక ఇప్పుడేమో హైపర్ ఆది రాబోతున్నాడు. దీంతో మరోసారి జబర్దస్త్ పై తెలుగు జనాలు కన్నేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోసారి రేటింగ్ రికార్డులు బద్దలయ్యే సూచనలూ కనిపిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More