Jyothika OTT: ఆ 8 ఏళ్లు భయం వేసింది- రీ ఎంట్రీ కష్టాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల బడ్జెట్‌పై హీరోయిన్ జ్యోతిక కామెంట్స్
Jyothika Re Entry Fear And Lady Oriented Movie Budget: స్టార్ హీరోయిన్ జ్యోతిక తన సినీ ప్రయాణం, పెళ్లి తర్వాత తీసుకున్న విరామం, మళ్లీ కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అమెజాన్ ప్రైమ్‌లోలో జ్యోతిక నటించిన సిస్టమ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
Jyothika About Re Entry Fear And Lady Oriented Movie Budget: టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనదైన నటనతో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ జ్యోతిక. 'చంద్రముఖి'గా తెలుగు ప్రేక్షకులను మెప్పించి, 'ఠాగూర్' సినిమాతో భావోద్వేగాలకు గురిచేసిన జ్యోతిక.. కెరీర్ అగ్రస్థానంలో ఉన్నప్పుడే సినిమాలకు దూరం అయ్యారు.

హీరో సూర్యతో వివాహం తర్వాత
హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్ ఉన్న సమయంలోనే, 27 ఏళ్ల వయసులో కోస్టార్, హీరో సూర్యను వివాహం చేసుకున్నారు. అనంతరం కుటుంబ బాధ్యతల కోసం జ్యోతిక వెండితెరకు విరామం ప్రకటించారు. అయితే, ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు జ్యోతిక. ఈ నేపథ్యంలో రీ ఎంట్రీపై తన అనుభవాలను, ఆ సమయంలో పడ్డ టెన్షన్‌ను ఓటీటీ మూవీ రిలీజ్ సందర్భంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో జ్యోతిక పంచుకున్నారు.
కెమెరా ముందుకు రాగానే ఒణుకు..
"ఎనిమిదేళ్ల పాటు కెమెరాకు దూరంగా ఉండి, మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టినప్పుడు మనసులో ఒక రకమైన భయం, ఆందోళన కలగడం సహజం. అంతా మొదటి నుంచి మొదలుపెడుతున్నట్లు అనిపించింది" అని జ్యోతిక గుర్తుచేసుకున్నారు. కేవలం నటన మాత్రమే కాకుండా భాష కూడా తనకు పెద్ద సవాలుగా మారిందని ఆమె చెప్పారు.
ముంబై నుంచి వచ్చిన తనకు తమిళం ఎప్పుడూ కొత్తగా నేర్చుకోవాల్సిన భాషగానే ఉండేదని, రీఎంట్రీలో డైలాగులు చెప్పడానికి మరింత కష్టపడాల్సి వచ్చిందని జ్యోతిక వివరించారు. 2006లో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె, మళ్లీ 2015లో '36 వయదినిలే' (36 ఏళ్ల వయసులో) చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
మహిళా ప్రధాన చిత్రాలకు పునర్జీవం
జ్యోతిక రీఎంట్రీ ఇచ్చిన సమయానికి సౌత్ ఇండస్ట్రీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. అప్పట్లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల నిర్మాణం దాదాపు ఆగిపోయింది. అలాంటి తరుణంలో జ్యోతిక నటించిన '36 వయదినిలే', నయనతార నటించిన 'మాయ' చిత్రాలు ఒకేసారి విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ఈ రెండు సినిమాలు సాధించిన విజయమే టాలీవుడ్, కోలీవుడ్‌లలో మళ్లీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ట్రెండ్‌ను తీసుకొచ్చింది.
అయితే, ఇలాంటి సినిమాల్లో నటించడం కత్తిమీద సాము లాంటిదేనని జ్యోతిక అంటారు. "మహిళా ప్రధాన చిత్రాలను మేమే ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమాలకు బడ్జెట్ చాలా తక్కువగా ఇస్తారు. వేరే పెద్ద నటీనటులను పెట్టుకునేంత బడ్జెట్ ఉండదు. అందువల్ల బాధ్యత అంతా మాపైనే పడుతుంది, పని కూడా ఎక్కువే ఉంటుంది" అని జ్యోతిక చెప్పుకొచ్చారు.
బాలీవుడ్ ఎంట్రీ.. ఓటీటీలో బిజీ
కేవలం రూ. 5 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన '36 వయదినిలే' భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా జ్యోతికకు ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో జ్యోతిక కేవలం ఒకే భాషకు పరిమితం కాలేదు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ వైవిధ్యమైన పాత్రలు పోషించారు.
దాదాపు 26 ఏళ్ల తర్వాత 'భూత్' కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ 'సైతాన్' (2024) సినిమాతో బాలీవుడ్‌లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'డబ్బా కార్టెల్' సిరీస్ ద్వారా ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన డబ్బా కార్టెల్ మంచి ఆదరణ దక్కించుకుంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ఇక ఇప్పుడు మరో ఓటీటీ మూవీతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు జ్యోతిక. కోర్ట్ రూమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సిస్టమ్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి మరో ప్రధాన పాత్ర పోషించారు జ్యోతిక. అమెజాన్ ప్రైమ్‌లో సిస్టమ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. మే 22న ప్రైమ్ వీడియోలో సిస్టమ్ ఓటీటీ రిలీజ్ అవనుంది.
ఇందులో సోనాక్షి సిన్హా, జ్యోతికతోపాటు అశుతోష్ గోవారికర్ కీలక పాత్ర పోషించారు. సిస్టమ్ ఓటీటీ సినిమాలో జ్యోతిక కోర్టు స్టెనోగ్రాఫర్‌గా నటిస్తుండగా, సోనాక్షి సిన్హా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కనిపిస్తారు. అశ్విని అయ్యర్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


