Keerthy Suresh On Marriage: మతాంతర పెళ్లిపై కీర్తి సురేష్ ఇంట్లో కష్టాలు- డైరీతో బయటపడిన ప్రేమ, తగలేసి ఉంటుందన్న మహానటి!

Keerthy Suresh About Interfaith Marriage Struggles: వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌తో తన 15 ఏళ్ల ప్రేమాయణం, భిన్న మతాల వివాహంపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంటర్‌లోనే ప్రారంభమైన ఈ ప్రేమకథ ఇంట్లో తెలిసినప్పుడు ఎదురైన అనుభవాలను ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

Published on: Nov 5, 2026, 11:00:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Keerthy Suresh About Interfaith Marriage Struggles: 'మహానటి' చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా మెప్పించిన కీర్తి సురేష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుదీర్ఘకాలం పాటు రహస్యంగా సాగిన తన ప్రేమాయణం, పెళ్లి దిశగా సాగిన ప్రయాణంలో ఎదురైన సవాళ్ల గురించి మాట్లాడారు. వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌తో జరిగిన భిన్న మతాంతర వివాహం (Interfaith Marriage) వెనుక ఉన్న కష్టాలను ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విశ్లేషించారు.

మతాంతర పెళ్లిపై కీర్తి సురేష్ ఇంట్లో కష్టాలు- డైరీతో బయటపడిన ప్రేమ, తగలేసి ఉంటుందన్న మహానటి!
మతాంతర పెళ్లిపై కీర్తి సురేష్ ఇంట్లో కష్టాలు- డైరీతో బయటపడిన ప్రేమ, తగలేసి ఉంటుందన్న మహానటి!

డైరీ చదివి పట్టుకున్న తల్లి

తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో ఎలా బయటపడిందో కీర్తి సురేష్ గుర్తు చేసుకున్నారు. "ప్లస్ టు పూర్తి చేసిన వెంటనే మా ప్రేమ ప్రయాణం మొదలైంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు నా పర్సనల్ డైరీని మా అమ్మ (సీనియర్ నటి మేనక) చదివేసింది. అందులో మా ప్రేమ గురించిన ప్రతి వివరమూ ఉంది. తల్లిగా నీ డైరీ చదివే హక్కు నాకు ఉందంటూ అమ్మ ఆ ఆంతరంగిక విషయాలను చూసేసింది" అని కీర్తి తెలిపారు.

ఆ సంఘటన తర్వాత తాను డైరీ రాయడమే శాశ్వతంగా ఆపేసినట్లు కీర్తి సురేష్ చెప్పారు. "నాకు డైరీ రాయడం అంటే ఎంతో ఇష్టం. కానీ ఆ రోజు తర్వాత ఆ డైరీ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. బహుశా అమ్మ దాన్ని తగలేసి ఉంటుందని భావిస్తున్నాను. ఆ డైరీ మళ్లీ నాకు దొరికితే బాగుణ్ణు అనిపిస్తుంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మతాంతర వివాహం.. ఇంట్లో పెద్ద ఎత్తున సమస్యలు

హిందూ కుటుంబానికి చెందిన కీర్తి సురేష్, క్రైస్తవ మతానికి చెందిన ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకోవడం అంత సులువుగా జరగలేదు. 2009 డిసెంబర్‌లో మొదటిసారి కలిసిన వీరు, 2010 జనవరి నుంచి డేటింగ్ ప్రారంభించారు. ఆ సమయానికి కీర్తి వయసు 17 ఏళ్లు మాత్రమే. ఆంటోనీ ఆమె కంటే ఏడేళ్లు పెద్దవారు కావడం, ఖతార్‌లో ఉద్యోగం చేస్తుండటంతో దాదాపు ఆరేళ్ల పాటు దూరంగా ఉంటూనే (Long distance relationship) తమ బంధాన్ని కొనసాగించారు.

"ఆంటోనీ క్రిస్టియన్ కావడం వల్ల మా ఇంట్లో పెద్ద ఎత్తున సమస్యలు ఎదురయ్యాయి. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి నాకు చాలా సమయం పట్టింది" అని కీర్తిసురేష్ వివరించారు. తాను సినీ రంగానికి రాకముందే ఆయనకు తెలుసని, ఇద్దరం కలిసి ఎదుగుతూ ఒకరినొకరు అర్థం చేసుకున్నామని పేర్కొన్నారు.

టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారినా కూడా ఈ ప్రేమ వ్యవహారాన్ని 15 ఏళ్ల పాటు సినీ ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంచడం విశేషం. 2024 నవంబర్‌లో దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేస్తూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

గోవాలో గ్రాండ్ వెడ్డింగ్..

చివరకు ఇరు కుటుంబాల సమ్మతితో 2024 డిసెంబర్ 12న గోవా వేదికగా కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ దంపతులు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తమిళ హిందూ, మలయాళ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం ఈ వివాహ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. అత్యంత సన్నిహితులు, సినీ రంగానికి చెందిన కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.

ఓటీటీలో సందడి

ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌పై కూడా తన ముద్ర వేస్తున్నారు. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన 'అక్క' (Akka) సిరీస్‌లో రాధికా ఆప్టేతో కలిసి నటించారు. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో కీర్తి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కిన ఈ లేడీ ఓరియంటెడ్ సిరీస్‌తో డిజిటల్ మాధ్యమంలోనూ కీర్తి తన సత్తా చాటుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More