OTT Friday Release: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 5 క్రేజీ సినిమాలు- తమన్నా హారర్ టు దుల్కర్ సల్మాన్ క్రైమ్ థ్రిల్లర్!

OTT Release Movies Friday: నవంబర్ 6న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయడానికి ఐదు విభిన్న చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. తమన్నా, సైఫ్ అలీ ఖాన్, దుల్కర్ సల్మాన్ నటించిన క్రేజీ మూవీస్ సోనీలివ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5లలో మరికొన్ని గంటల్లో ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.

Published on: Nov 5, 2026, 14:45:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Top 5 Friday OTT Release Movies: థియేటర్లలో రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' వంటి భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తుండగా, ఓటీటీ ప్రియులకు సైతం పండగ లాంటి వార్త అందింది. నవంబర్ 6న డిజిటల్ ప్రియులను అలరించేందుకు ఐదు విభిన్న చిత్రాలు వివిధ ఓటీటీ స్ట్రీమింగ్ వేదికలపైకి అడుగుపెడుతున్నాయి.

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 5 క్రేజీ సినిమాలు- తమన్నా హారర్ టు దుల్కర్ సల్మాన్ క్రైమ్ థ్రిల్లర్!
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 5 క్రేజీ సినిమాలు- తమన్నా హారర్ టు దుల్కర్ సల్మాన్ క్రైమ్ థ్రిల్లర్!

తమన్నా హారర్ టు దుల్కర్ క్రైమ్

అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ నుంచి దుల్కర్ సల్మాన్ క్రైమ్ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ వరకు వినోదాల విందు సిద్ధమైంది. వీకెండ్‌లో ఏ సినిమా చూడాలో ప్లాన్ చేసుకునే ప్రేక్షకుల కోసం ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

1. హైవాన్ (Haiwaan) – సోనీలివ్

బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన 2016 నాటి మలయాళ చిత్రం 'ఒప్పం' ఆధారంగా రూపుదిద్దుకున్న బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ 'హైవాన్'. దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. చూపులేని ఒక కేర్‌టేకర్ పాత్రలో సైఫ్ కనిపించనుండగా, ఒక భయంకరమైన హంతకుడి పాత్రను అక్షయ్ కుమార్ పోషించారు. వీరిద్దరి మధ్య సాగే ఉత్కంఠభరిత పోరాటం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది.

2. ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ (The Vvaan: Force Of The Forrest) – అమెజాన్ ప్రైమ్ వీడియో

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మిస్టరీ హారర్ థ్రిల్లర్ 'ది వాన్'. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్వేతా తివారీ, సునీల్ గ్రోవర్ ముఖ్య పాత్రలు పోషించారు. తన పూర్వీకుల భూమిని అమ్మడానికి గ్రామానికి వచ్చే 'రిషి' అనే యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. మూఢనమ్మకాలు, దెయ్యాల కథలను అస్సలు నమ్మని రిషి, అనుకోకుండా అడవిలోని ఒక ప్రాచీన ముద్రను (Seal) తొలగిస్తాడు. దాంతో బయటకు వచ్చిన అదృశ్య శక్తులను అతను ఎలా ఎదుర్కొన్నాడనేది ఉత్కంఠభరితంగా సాగుతుంది.

3. ఐ యామ్ గేమ్ (I'm Game) – జియోహాట్‌స్టార్

తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ క్రైమ్, ఫాంటసీ థ్రిల్లర్ 'ఐ యామ్ గేమ్'. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో దుల్కర్ 'దాన్ జాన్' అనే ధైర్యవంతుడైన జూదరి పాత్రలో కనిపించనున్నారు. ఎంతటి ప్రమాదాన్నైనా లెక్కచేయకుండా రిస్క్ తీసుకోవడం అతని నైజం. అయితే, ఆ అలవాటే అతడిని ఒక చిక్కుముడిలో పడేస్తుంది. ఆ ఉచ్చు నుంచి అతను ఎలా బయటపడ్డాడో తెరపై చూడాల్సిందే.

4. మీసయ మురుక్కు 2 (Meesaya Murukku 2) – సోనీలివ్

సంగీత దర్శకుడు, నటుడు ఆది (హిప్‌హాప్ తమిళా) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మ్యూజికల్ కామెడీ డ్రామా 'మీసయ మురుక్కు 2'. ఇందులో కేతిక శర్మ, చైత్ర జె ఆచార్, రమ్య రంగనాథన్ హీరోయిన్లుగా నటించారు. ఒక యువ సంగీతకారుడు తన కెరీర్‌లో ఎదగడానికి పడే తాపత్రయం, ఒక పెద్ద నిర్మాత కుమారుడి వల్ల అతని ప్రేమ జీవితంలో వచ్చే సమస్యలు ఈ కథలో మలుపులు తీసుకుంటాయి. ఇందులో ఆది విభిన్న తరాల పాత్రలలో కనిపిస్తుండటం విశేషం.

5. నూరు కోడి వానవిల్ (Nooru Kodi Vaanavil) – జీ5

యంగ్ హీరో హరీష్ కల్యాణ్, సిద్ధి ఇద్నానీ జంటగా నటించిన ఫీల్ గుడ్ లవ్ డ్రామా 'నూరు కోడి వానవిల్'. శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా జీ5 ఓటీటీలో అడుగుపెడుతోంది. నేటి తరం జంటల మధ్య ఉండే ప్రేమ, కుటుంబ బాధ్యతలు, ఒత్తిళ్ల మధ్య నడిచే సంబంధాలను దర్శకుడు ఎంతో సహజంగా ఆవిష్కరించారు. ప్రేమను నిలబెట్టుకోవడానికి చేసే త్యాగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఓటీటీలో బెస్ట్ ఆప్షన్

ఇలా రేపు ఒక్కరోజే ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్, కామెడీ, రోమాన్స్ వంటి అన్ని రకాల జోనర్లలో సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీకెండ్‌లో ఇంటి పట్టునే ఉంటూ వినోదాన్ని ఆస్వాదించాలనుకునే ఓటీటీ రిలీజ్ అయ్యే ఈ సినిమాలు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More