Jithu Madhavan: ఫస్టాఫ్ అంతా ఆ ట్విస్ట్‌తోనే, మొదటి లుక్‌కు ముందే అది లీక్ అయింది, చాలా భయపడ్డా: సూర్య సీన్ డైరెక్టర్
Jithu Madhavan About Suriya Scene Secret Leak: సూర్య, నజ్రియా నజిమ్, నస్లేన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'సీన్' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. అయితే సినిమా విడుదలకు ముందే హీరో క్యారెక్టర్ సీక్రెట్ లీక్ అవ్వడంపై దర్శకుడు జిత్తు మాధవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా భయపడిపోయినట్లు తెలిపారు.
Jithu Madhavan About Suriya Scene Secret Leak: మలయాళంలో 'రోమాంచమ్', 'ఆవేశం' వంటి ఘనవిజయాల తర్వాత తమిళంలోకి అడుగుపెట్టిన దర్శకుడు జిత్తు మాధవన్, స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కించిన చిత్రం 'సీన్'. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

ఎదుర్కొన్న ఆందోళనలు, ట్విస్టులు
అయితే ఈ సినిమా నిర్మాణ సమయంలో తాను ఎదుర్కొన్న ఆందోళనలను, ట్విస్టుల లీకేజీ భయాలను ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో జిత్తు మాధవన్ తాజాగా బయటపెట్టారు. ఈ సీన్ సినిమాలో సూర్య డిఎస్పీ ఇన్బరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.
సీక్రెట్ లీక్.. భయపడిపోయానన్న డైరెక్టర్
కథలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఆ పాత్ర చూపు లేనిది (అంధుడు). ఈ విషయాన్ని ప్రథమార్ధం చివర వరకు రహస్యంగా ఉంచాలని చిత్ర బృందం భావించింది. అయితే విడుదలకు ముందే ఈ ట్విస్ట్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో తాను ఎంతో ఆందోళన చెందానని జిత్తు మాధవన్ తెలిపారు.
"ఇది అభిమానుల ఊహాగానం కాదు, ఎవరో కావాలనే లీక్ చేశారు. నా ఫస్టాఫ్ మొత్తం ఈ ట్విస్ట్ ఆధారంగానే నడుస్తుంది. షూటింగ్ సమయంలో ఎంతో జాగ్రత్త పడ్డాం. మొదటి లుక్ రాకముందే ఈ విషయం బయటకు రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాను" అని సినీ ఉలగం ఇంటర్వ్యూలో జిత్తు పేర్కొన్నారు. అయితే టీజర్ వచ్చాక ప్రేక్షకులు ఆ లీక్‌ను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నానని ఆయన వెల్లడించారు.
'హీరో ఎలివేషన్' పాటల సిద్ధాంతం మాది కాదు!
అలాగే అక్టోబర్‌లో విడుదలైన 'ఆతి ఇవా యార్రా' పాటపై వచ్చిన విమర్శలపైనా దర్శకుడు స్పందించారు. 'కరుప్పు', 'విశ్వనాథ్ అండ్ సన్స్' వంటి వరుస విజయాల తర్వాత సూర్య నుంచి భారీ మాస్ ఎలివేషన్ సాంగ్ వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఆ పాట నజ్రియా పాత్ర చుట్టూ సాగడంతో కొంత నిరాశ వ్యక్తమైంది.
"మాకు హీరో ఎలివేషన్ పాటలు చేయడం పెద్దగా అలవాటు లేదు. అభిమానులు మాస్ సాంగ్ ఆశించినప్పుడు కాస్త గందరగోళానికి గురయ్యాను. ముందుగా నస్లేన్, ఆ తర్వాత నజ్రియా పాత్రలను పరిచయం చేసి, సూర్య సర్ పాత్రను విడుదలకు వారం ముందు మాత్రమే రివీల్ చేయాలని భావించాం. ఆలోచన వేరైనా, థియేటర్లలో ప్రేక్షకులకు సినిమా నచ్చడం సంతోషంగా ఉంది" అని జిత్తు వివరించారు.
బాక్సాఫీస్ వద్ద 'సీన్' హవా
తెలుగు రాష్ట్రాల్లోనూ సూర్యకు విపరీతమైన అభిమాన గణం ఉంది. ఆయన ప్రతి సినిమా ఇక్కడ భారీ ఓపెనింగ్స్ సాధించడం సహజం. ఈ క్రమంలోనే 'సీన్' చిత్రం ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 174.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించిందని ట్రేడ్ నివేదికలు వెల్లడించాయి. నస్లేన్ సుపారీ కిల్లర్ ఈశ్వరన్ పాత్రలో, నజ్రియా నజీమ్ మాయ పాత్రలో ఆకట్టుకోగా.. పోలీస్ అధికారిగా సూర్య నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


