Suriya Scene: దుబాయ్‌లో సీన్ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. దీపావళికి నయనతార, సాయి పల్లవితో హీరో సూర్య పోటీ!
Suriya Scene Pre Release Event In Dubai: తమిళ స్టార్ హీరో సూర్య, 'ఆవేశం' దర్శకుడు జిత్తు మాధవన్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'సీన్'. దుబాయ్‌లో సీన్ సినిమా భారీ ప్రమోషనల్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించనున్నారు. అయితే, దీపావళి బాక్సాఫీస్‌కి నయనతార, సాయి పల్లవితో హీరో సూర్య పోటీ పడనున్నాడు.
Suriya Scene Box Office Clash With Nayanthara Sai Pallavi: తెలుగు నేలపై విశేష ఆదరణ కలిగిన తమిళ స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సీన్'.

దీపావళి పండుగ సందర్భంగా
నవంబర్ 6న దీపావళి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సీన్ సినిమాపై దక్షిణాది సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు కేవలం కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.
హాలీవుడ్ స్థాయి హంగామా కోసం విదేశీ ప్రమోషన్లపై మేకర్స్ ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 25న యుఏఈ (దుబాయ్)లోని ప్రముఖ 'సిలికాన్ సెంట్రల్ మాల్'లో సీన్ భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. గల్ఫ్ ప్రాంతంలో సూర్యకు ఉన్న ఫ్యాన్ బేస్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
సస్పెన్స్ పెంచుతున్న దుబాయ్ వేడుక
దుబాయ్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. ప్రమోషన్ల చివరి దశలో భాగమైన ఈ వేదికపై నుంచే మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సీన్ సినిమా అధికారిక ట్రైలర్ లేదా ఆడియోను ఇదే వేదికపై ఆవిష్కరిస్తారనే ప్రచారం సినీ వర్గాల్లో గట్టిగా సాగుతోంది. దీనిపై నిర్మాణ సంస్థ నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.
ఖాకీ అవతారంలో సూర్య.. 'ఆవేశం' డైరెక్టర్ మ్యాజిక్
'రోమాంచమ్', 'ఆవేశం' వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో మలయాళ చిత్రసీమను ఊపేసిన జిత్తు మాధవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. 'సీన్' చిత్రంలో సూర్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.
'రాజా రాణి' ఫేమ్ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, 'ప్రేమలు' సినిమాతో కుర్రకారును ఆకట్టుకున్న నస్లేన్ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'ఏరోప్లేన్', 'ఆతి ఇవా యారా' పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. సూర్య, నజ్రియాల మధ్య ఉండే బాండింగ్ ఈ కథకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
మలయాళ దిగ్గజాల తమిళ ఎంట్రీ.. సొంత బ్యానర్‌లోనే నిర్మాణం
సూర్య, జ్యోతిక దంపతులు తమ సొంత నిర్మాణ సంస్థ '2D ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళంలో వరుస చార్ట్‌బస్టర్స్ అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ ఈ సినిమాతోనే తమిళంలోకి అడుగుపెడుతున్నారు.
జై, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక విభాగంలో వినీత్ ఆగస్టియన్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, అజ్మల్ సాబు ఎడిటర్‌గా, చేతన్ డిసౌజా యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
దీపావళి రేసులో త్రిముఖ పోరు
ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద అసలైన సమరం జరగనుంది. నవంబర్ 6న సూర్య 'సీన్' థియేటర్లలోకి వస్తుండగా, అదే సమయంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన 'మూకుత్తి అమ్మన్ 2' (తెలుగులో మహాశక్తి), బాలీవుడ్ భారీ చిత్రం 'రామాయణ: పార్ట్ 1' (రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి) పోటీకి దిగుతున్నాయి. పండుగ రేసులో ఈ మూడు చిత్రాలు పోటీపడుతుండటంతో ప్రేక్షకులు దేనికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


