Friday OTT Top Release: ఓటీటీలో ఇవాళ మిస్ అవ్వకూడని టాప్ 7 సినిమాలు- నయనతార, అల్లరి నరేష్ నుంచి హారర్ థ్రిల్లర్ వరకు!

Friday OTT Release Movies Today: వీకెండ్ వినోదానికి ఓటీటీ వేదికలు సిద్ధమయ్యాయి. ఇవాళ ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’, నయనతార ‘హాయ్’ నుంచి హారర్ థ్రిల్లర్ వరకు సెప్టెంబర్ 25న ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Published on: Sep 25, 2026, 10:00:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Friday Top 7 OTT Release Movies Today: వారాంతం వచ్చిందంటే చాలు సినిమా ప్రియుల చూపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వైపే ఉంటుంది. థియేటర్లలో కొత్త సినిమాలు చూసే అవకాశంతో పాటు ఇంట్లోనే కూర్చుని వైవిధ్యమైన కథలను ఆస్వాదించేందుకు ఓటీటీ సంస్థలు సరికొత్త చిత్రాలను రెడీ చేశాయి.

ఓటీటీలో ఇవాళ మిస్ అవ్వకూడని టాప్ 7 సినిమాలు- నయనతార, అల్లరి నరేష్ నుంచి హారర్ థ్రిల్లర్ వరకు!
ఓటీటీలో ఇవాళ మిస్ అవ్వకూడని టాప్ 7 సినిమాలు- నయనతార, అల్లరి నరేష్ నుంచి హారర్ థ్రిల్లర్ వరకు!

టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు

ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 25న) ఓటీటీలోకి అస్సలు మిస్ అవ్వకూడని టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు . హారర్, కామెడీ, సస్పెన్స్, రొమాంటిక్ డ్రామా విభాగాల్లో అలరించేందుకు ఈ సినిమాలు సిద్ధమయ్యాయి. నయనతార, అల్లరి నరేష్ సినిమాల నుంచి హారర్ థ్రిల్లర్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ టాప్ 7 సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందు

1. అగధ ఓటీటీ: ప్రముఖ దర్శకుడు ఎమ్.ఎస్. రాజు తెరకెక్కించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జీ5 (ZEE5) ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. అనుమానాస్పదంగా జరిగిన ఒక మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు అడవిలోని రహస్య గుహ వైపు వెళ్లిన మహాదేవికి ఎదురైన భయంకరమైన అనుభవాలు ఏంటో ఈ కథలో ఉత్కంఠభరితంగా చూపించారు.

2. రంభ ఊర్వశి మేనక ఓటీటీ: అల్లరి నరేష్ తన మార్కు హాస్యంతో అలరించేందుకు వచ్చిన సోషియో ఫాంటసీ కామెడీ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమాలో దేవలోక రంభ, ఊర్వశి, మేనకలతో ఒక సామాన్యుడు చిక్కుల్లో పడటం కథాంశం. దేవలోకంలో జరిగిన ఒక పొరపాటు వల్ల భూలోకంలో తలెత్తిన గందరగోళం, నవ్వులు పూయించే మలుపులతో ఈ సినిమా సాగుతుంది.

యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్లు

3. మ్యాంగో పచ్చ ఓటీటీ: కన్నడ యంగ్ హీరో సంచిత్ సంజీవ్ నటించిన యాక్షన్ డ్రామా ‘మ్యాంగో పచ్చ’. వివేక దర్శకత్వం వహించిన ఈ సినిమా జియో హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మైసూర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో తండ్రి మరణం తర్వాత కుటుంబ రహస్యాలు తెలుసుకునే క్రమంలో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక సీడీ షాప్ ఓనర్ ప్రయాణం ఆకట్టుకుంటుంది.

4. హుంకార్ ది రోర్ ఓటీటీ: సామాజిక అంశంతో తీవ్ర ఉత్కంఠ రేపే ఇన్వెస్టిగేటివ్ డ్రామా ‘హుంకార్: ది రోర్’. జియోహాట్‌స్టార్‌లో తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాలో ఒక శక్తివంతమైన బాబాపై లైంగిక ఆరోపణలు చేసిన 17 ఏళ్ల బాలిక కేసును ఛేదించే ఏసీపీ జస్లీన్ సింగ్ సోని పాత్రలో ఫాతిమా సనా షేక్ కనిపించారు. ప్రజా స్పందన, రాజకీయ ఒత్తిళ్ల మధ్య సాగే విచారణ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు

5. హాయ్ ఓటీటీ: లేడీ సూపర్ స్టార్ నయనతార, కావిన్ రాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘హాయ్!’ చిత్రం జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్న ఇద్ద వ్యక్తుల మధ్య అనుకోకుండా మొదలైన ప్రయాణం, వారి జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను ఈ సినిమాలో మనసుకి హత్తుకునేలా ఆవిష్కరించారు.

6. డోంట్ బి షై ఓటీటీ: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నిర్మాణంలో వచ్చిన యూత్‌ఫుల్ రొమాంటిక్ కాన్సెప్ట్ చిత్రం ‘డోంట్ బి షై’. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం నలుగురు కొత్త నటీనటులతో తెరకెక్కింది. కాలేజీ లవ్ స్టోరీ, ప్రేమలో విఫలమైన తర్వాత తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ఒక అమ్మాయి ప్రయాణాన్ని ఇందులో చూపించారు.

7. హబీబీ ఓటీటీ: దక్షిణ తమిళనాడు సంస్కృతి, తమిళ ముస్లింల జీవన విధానం నేపథ్యంగా రూపుదిద్దుకున్న ఎమోషనల్ డ్రామా చిత్రం ‘హబీబీ’. సోనీ లివ్ (Sony LIV) లో ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమా మానవ సంబంధాలు, స్వచ్ఛమైన ప్రేమకథతో రూపుదిద్దుకుంది. హబీబీ ఓటీటీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More