JioHotstar Horror: జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఒకేరోజు తెలుగులో రిలీజైన 2 హారర్ థ్రిల్లర్స్- ఒకటి యాక్షన్, మరోటి క్రైమ్‌తో!

JioHotstar OTT Horror Thrillers In Telugu New: ఈ వారాంతంలో ఓటీటీ ప్రియులకు అసలైన థ్రిల్ అందించేందుకు రెండు భయానక హారర్ చిత్రాలు జియోహాట్‌స్టార్‌లో తెలుగులో ఒకేరోజు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఒకటి యాక్షన్, అడ్వెంచర్ ఎలిమెంట్స్‌తో ఉంటే.. మరోటి నరబలి, చేతబడి, క్రైమ్ అంశాలతో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

Published on: Sep 22, 2026, 18:36:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

JioHotstar OTT Horror Thrillers In Telugu New: న్యూ వీక్ వస్తే చాలు డిజిటల్ వేదికలపై సరికొత్త సినిమాల సందడి మొదలవుతుంది. హారర్, మైండ్-బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఓటీటీలో ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.

JioHotstar Horror: జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఒకేరోజు తెలుగులో రిలీజైన 2 హారర్ థ్రిల్లర్స్- ఒకటి యాక్షన్, మరోటి క్రైమ్‌తో!
JioHotstar Horror: జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఒకేరోజు తెలుగులో రిలీజైన 2 హారర్ థ్రిల్లర్స్- ఒకటి యాక్షన్, మరోటి క్రైమ్‌తో!

జియోహాట్‌స్టార్ ఓటీటీలో

థ్రిల్ కోరుకునే సినిమా ప్రియుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ రెండు భయానక హారర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. ఒకటి యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఉంటే మరోటి క్రైమ్, మిస్టరీ అంశాలతో తెరకెక్కింది. సెప్టెంబర్ 19 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న హారర్ థ్రిల్లర్స్ ఏంటో తెలుసుకుందాం.

అడవిలో దాగి ఉన్న అదృశ్య శక్తి 'ది అవేకనింగ్'

కొలంబియన్ దర్శకుడు హైమే ఒసోరియో మార్కెజ్ తెరకెక్కించిన ఇంటర్నేషనల్ హారర్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'ది అవేకనింగ్ (2026)' కూడా ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు వచ్చేసింది. క్లాడియో కాటానో, హిల్డా రూయిజ్, అలెజాండ్రో బుయిత్రాగో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కథాంశం ఉత్కంఠభరితంగా సాగుతుంది.

దక్షిణ అమెరికాలోని దట్టమైన అడవుల్లోకి ప్రత్యర్థి లక్ష్యాన్ని మట్టుబెట్టేందుకు ఒక ప్రత్యేక సైనిక బృందం అడుగుపెడుతుంది. సాధారణ వ్యూహాత్మక ఆపరేషన్‌గా ప్రారంభమైన ఈ మిషన్, అడవి లోతుల్లో నుంచి ఉద్భవించే ఒక అతీంద్రియ శక్తి వల్ల భయంకరమైన స్వప్నంగా మారుతుంది.

500 ఏళ్ల నాటి శక్తి

500 సంవత్సరాల క్రితం స్పెయిన్‌కు చెందిన అన్వేషకుల బృందం కూడా సరిగ్గా ఇదే తరహా అదృశ్య శక్తి బారినపడి నాశనమవుతుంది. శతాబ్దాల వ్యవధి ఉన్నప్పటికీ, ఒకే ప్రాంతంలో మనుషులు ఏమాత్రం అడ్డుకోలేని ఆ ప్రాచీన 500 ఏళ్ల నాటి దుష్ట శక్తి వీరిని ఎలా వేటాడింది, అసలు అది ఎలా బయటకొచ్చింది, దాని మిస్టరీ ఏంటీ అనే అంశాలు నరనరాల్లో భయం కలిగించేలా చిత్రీకరించారు.

నరబలి, చేతబడి నేపథ్యంలో 'కర్మాఖ్య'

బుల్లితెరపై 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన అభినయ కృష్ణ (అదిరే అభి) రచయితగా, దర్శకుడిగా కొత్త అవతారమెత్తిన సినిమా హారర్ థ్రిల్లర్ కర్మాఖ్య. సైకలాజికల్ హారర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన 'కర్మాఖ్య' ఐఎమ్‌డీబీ (IMDb)లో 8.6 రేటింగ్ సాధించి ఓటీటీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

కర్మాఖ్య సినిమాలో సమైరా, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా సముద్రఖని, అభిరామి, మధునందన్, ధనరాజ్, ఆనంద్ భారతి కీలక పాత్రల్లో మెరిశారు. శాఖపట్నంలోని ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో అనాథ అయిన కామాఖ్య (సమైరా) నివసిస్తుంటుంది. అక్కడ కామాఖ్యకు ప్రవళిక (శరణ్య ప్రదీప్) అనే బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది.

ఫ్రెండ్ కోసం వెళ్తే

అయితే, ఓ రోజు ప్రవళిక చేయాల్సిన ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్క్‌ను పూర్తి చేయడానికి కామాఖ్య ఊరి చివర అడవి శివార్లలోని ఒక పాత ఇంట్లో నివసించే వృద్ధ దంపతుల వద్దకు వెళ్లాల్సి వస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్లిన కామాఖ్యకు ఊహించని భయానక పరిస్థితులు ఎదురవుతాయి.

దుష్ట తంత్రాలు, భ్రమలు, నరబలుల కుట్రల నుంచి కామాఖ్య ఎలా బయటపడింది, అసలు కామాఖ్య పుట్టుక ఏంటీ, ఆమె జననం వెనుక ఉన్న రహస్యం ఏంటీ అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో కర్మాఖ్య సినిమాను తెరకెక్కించారు.

3, 5 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్

ఇకపోతే సెప్టెంబర్ 19న జియో హాట్‌స్టార్‌లో తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ వంటి 5 భాషల్లో కర్మాఖ్య ఓటీటీ రిలీజ్ అయింది. అలాగే, అదే రోజున హాట్‌స్టార్‌లో తెలుగు, హిందీ, తమిళం 3 భాషల్లో ది అవేకనింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. భయంకరమైన సన్నివేశాలు, సైకలాజికల్ థ్రిల్ కోరుకునే వారు ఈ ఈ రెండు సినిమాలను ఎంచక్కా తెలుగులో వీక్షించవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More