Nazriya Nazim Suriya: సూర్య సినిమాలను మూడేళ్లు రిజెక్ట్ చేసిన పుష్ప విలన్ భార్య? అసలు నిజం బయటపెట్టిన నజ్రియా నజీమ్!
Nazriya Nazim About Rejecting Suriya Movies: హీరో సూర్య సినిమాలను మూడుసార్లు తిరస్కరించానంటూ వస్తున్న వార్తలపై ప్రముఖ హీరోయిన్, పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ తాజాగా స్పందించారు. సూర్య కామెంట్స్ వెనుక ఉన్న అసలు నిజాన్ని వివరిస్తూ, తమ కొత్త సినిమా 'సీన్' విశేషాలను పంచుకున్నారు.
Nazriya Nazim About Rejecting Suriya Movies: తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'సీన్' (Scene) సినిమాతో దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బ్యూటిఫుల్ హీరోయిన్, పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ మళ్లీ కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి ఆమె నటించిన తొలి చిత్రమిది.

మంచి క్రేజ్ ఉన్న ఇద్దరు స్టార్స్
తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఉన్న ఈ ఇద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రమోషన్ల వేడుకలో "నజ్రియా నా మూడు సినిమాలను తిరస్కరించింది, నాలుగోసారి అడిగితే ఒప్పుకుంది" అంటూ సూర్య సరదాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ప్రచారంపై కొచ్చిలో జరిగిన సీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నజ్రియా క్లారిటీ ఇచ్చారు.
ఆ వార్తల్లో నిజం లేదు.. డేట్ల సమస్యే కారణం!
సూర్య కామెంట్స్‌పై నజ్రియా స్పందిస్తూ.. "సూర్య సర్ నేను ఆయన మూడు సినిమాలను రిజెక్ట్ చేశానని సరదాగా అన్నారు" అని స్పష్టం చేశారు. అప్పట్లో కాల్ షీట్లు సర్దుబాటు కాకపోవడం, ఇతర షూటింగ్‌ల వల్ల వచ్చిన గందరగోళం వల్లే ఆ ప్రాజెక్టులు చేయలేకపోయాను తప్ప ఉద్దేశపూర్వకంగా తిరస్కరించలేదని ఆమె తెలిపారు. "సూర్య సర్ లాంటి స్టార్ హీరో సినిమాను నేను ఎలా రిజెక్ట్ చేస్తాను?" అని నజ్రియా నజీమ్ వ్యాఖ్యానించారు.
'ఆవేశం' డైరెక్టర్ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్
మలయాళంలో 'రోమాంచమ్', ఇటీవల సుధీర్ బాబుతో పోటీపడి సంచలన విజయం సాధించిన 'ఆవేశం' చిత్రాలను అందించిన జిత్ మాధవన్ ఈ సీన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య 'డిఎస్పీ ఇన్బరాజ్' అనే శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్లాలని భావించే ఒక ఆఫీసర్, ఊహించని రీతిలో ఒక సైకో కిల్లర్ కేస్‌ను చేజిక్కించుకోవడానికి రంగంలోకి దిగడమే ఈ చిత్ర కథాంశం.
యాక్షన్ మోడ్‌లో నజ్రియా.. విలన్‌గా నస్లేన్
ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలో నజ్రియా 'మాయ' అనే కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో తాను కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చేసినట్లు ఆమె వెల్లడించారు. ఇక 'ప్రేమలు' సినిమాతో సౌత్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నస్లేన్ ఈ చిత్రంలో 'ఈశ్వరణ్' అనే సైకో కిల్లర్ పాత్రతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.
క్యాట్ అండ్ మౌస్ గేమ్స్
సూర్య, నస్లేన్ మధ్య సాగే మైండ్ గేమ్స్, క్యాట్ అండ్ మౌస్ ఛేజింగ్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దర్శకుడు, సాంకేతిక నిపుణులు, నటీనటులు ఎక్కువమంది మలయాళీలే కావడంతో షూటింగ్ ఒక హాలిడే లొకేషన్ తరహాలో హాయిగా సాగిపోయిందని నజ్రియా నజీమ్ తెలిపారు. ఈ చిత్రం నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


