Sudha Kongara: నా 8 కోట్లు ఎక్కడ? కోర్టుకెక్కిన నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్.. తమన్, ఫహాద్ ఫాజిల్ సినిమాకు ముప్పు!

Sudha Kongara: నేషనల్ అవార్డు గెలిచిన డైరెక్టర్ సుధా కొంగర మద్రాస్ హైకోర్టుకెక్కింది. తన పరాశక్తి మూవీకి సంబంధించిన రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్ ఇంకా ఇవ్వలేదని ఆమె వాదిస్తోంది. దీంతో ఆ ప్రొడ్యూసర్ నెక్ట్స్ మూవీ రిలీజ్ ప్రమాదంలో పడింది.

Published on: Jun 30, 2026, 13:34:46 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sudha Kongara: కోలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని వివాదం ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర తన రెమ్యూనరేషన్ బకాయిల కోసం మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కారు. సంక్రాంతి 2026 సీజన్‌లో రిలీజైన ‘పరాశక్తి’ సినిమా రైటింగ్, డైరెక్షన్ బాధ్యతలకు గానూ తనకు రావాల్సిన రూ. 8.39 కోట్ల పేమెంట్స్ నిలిచిపోయాయంటూ ఆమె న్యాయ పోరాటానికి దిగారు.

Sudha Kongara: నా 8 కోట్లు ఎక్కడ? కోర్టుకెక్కిన నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్.. తమన్, ఫహాద్ ఫాజిల్ సినిమాకు ముప్పు!
Sudha Kongara: నా 8 కోట్లు ఎక్కడ? కోర్టుకెక్కిన నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్.. తమన్, ఫహాద్ ఫాజిల్ సినిమాకు ముప్పు!

రంగంలోకి దిగిన మద్రాస్ హైకోర్టు.. శాటిలైట్ రైట్స్‌పై స్టే

సుధా కొంగర దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు సంచలన మధ్యంతర ఉత్తర్వులు పాస్ చేసింది. ఈ సినిమాలో లీడ్ ప్రొడ్యూసర్ అయిన ఆకాష్ భాస్కరన్‌తో పాటు అతని బ్యానర్ 'డాన్ పిక్చర్స్' పార్ట్‌నర్లపై కోర్టు సీరియస్ అయింది.

జులై 8 వరకు 'పరాశక్తి' సినిమా శాటిలైట్ టెలివిజన్ రిలీజ్, దానికి సంబంధించిన ఎలాంటి కమర్షియల్ డీల్స్ చేయకూడదంటూ ప్రొడ్యూసర్లను కోర్టు ఆదేశించింది. తన ఐపీ రైట్స్ (Intellectual Property) పూర్తిగా బదిలీ చేసినా, అగ్రిమెంట్ ప్రకారం ఫుల్ పేమెంట్ ఇవ్వకుండా మోసం చేశారని సుధా కొంగర కోర్టుకు వివరించారు.

‘ఇదయం మురళి’ సినిమాకు పెద్ద బ్రేక్?

ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. డాన్ పిక్చర్స్ బ్యానర్ నుంచి జులై 10న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్న 'ఇదయం మురళి' సినిమా థియేట్రికల్ రిలీజ్‌ను కూడా అడ్డుకోవాలని సుధా కొంగర కోర్టును కోరారు.

అథర్వ మురళి, కయదు లోహర్, ప్రీతి ముకుంధన్, ఫహాద్ ఫాజిల్, తమన్ నటించిన ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ జులై 7న జరగబోయే తదుపరి విచారణలో కోర్టు గనుక ఈ సినిమా రిలీజ్‌పై స్టే విధిస్తే, ప్రొడ్యూసర్లపై మరింత ఒత్తిడి పెరగనుంది.

సినీ ఇండస్ట్రీలో మహిళా డైరెక్టర్లపై వివక్షపై ఫైట్

సుధా కొంగర ఈ కేస్‌ను కేవలం తన వ్యక్తిగత రెమ్యునరేషన్ కోసమే కాకుండా, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మహిళా దర్శకులు ఎదుర్కొంటున్న కాంట్రాక్చువల్ అన్యాయాలు, రెమ్యూనరేషన్‌లో వివక్షపై ఒక పెద్ద పోరాటంగా అభివర్ణించారు.

'సూరరై పొట్రు' (ఆకాశం నీ హద్దురా) లాంటి నేషనల్ అవార్డ్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్‌కే ఇలాంటి పరిస్థితి వస్తే, మిగతా మహిళా టెక్నీషియన్ల పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది.

పరాశక్తి కలెక్షన్స్ బాగున్నా.. రెమ్యూనరేషన్ ఎగ్గొట్టారా?

శివకార్తికేయన్, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన 'పరాశక్తి' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించిందని ప్రొడక్షన్ హౌస్ గతంలో ప్రకటించింది. సుధా కొంగర టోటల్ రెమ్యూనరేషన్ రూ. 15 కోట్లు కాగా, కేవలం రూ. 9.31 కోట్లు మాత్రమే చెల్లించి మిగతా మొత్తం ఎగ్గొట్టారని లాయర్లు కోర్టులో వాదించారు. సక్సెస్ ఫుల్ సినిమాతో లాభాలు సంపాదించి, అదే డబ్బుతో కొత్త సినిమా 'ఇదయం మురళి'ని రిలీజ్ చేస్తూ, పాత బకాయిలు తీర్చలేమనడం అన్యాయమని సుధా కొంగర తరపు లాయర్లు గట్టిగా వాయిస్ వినిపించారు.

ప్రస్తుతం కోర్టు ఈ కేసు కౌంటర్ దాఖలు చేయాలని ప్రొడ్యూసర్లను ఆదేశించింది. జులై మొదటి వారంలో రాబోయే ఫైనల్ జడ్జిమెంట్‌పైనే ఇప్పుడు కోలీవుడ్ ట్రేడ్ వర్గాల ఫోకస్ అంతా ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More