Koushik Mekala OTT: ఓటీటీ టు వెండితెర- 4, 5 సినిమాలతో జోరుమీదున్న యంగ్ హీరో కౌశిక్ మేకల- ఎన్టీఆర్, నాగార్జునతో బ్రాండ్స్

Koushik Mekala OTT And Upcoming Movies: ప్రియురాలు, సిట్ ఓటీటీ సినిమాలతో అలరించిన యంగ్ హీరో కౌశిక్ మేకల వరుస సినిమాలతో వెండితెరపై దూసుకెళ్తున్నారు. పార్ట్ టైమర్స్ ఓటీటీ సిరీస్‌తో మెప్పించిన ఈ హీరో ప్రస్తుతం అరడజను సినిమాలను లైన్‌లో పెట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Published on: Sep 26, 2026, 17:47:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Koushik Mekala OTT And Upcoming Movies: తెలుగు చిత్రసీమలో సరికొత్త కాన్సెప్టులతో దూసుకొస్తున్న యువ నటులు తమదైన ముద్ర వేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్, యాడ్స్ నుంచి మొదలుపెట్టి ఓటీటీ సిరీస్‌లు, వెండితెర వరకు వరుస అవకాశాలు పట్టుకుంటూ సత్తా చాటుతున్నారు.

ఓటీటీ టు వెండితెర- 4, 5 సినిమాలతో జోరుమీదున్న యంగ్ హీరో కౌశిక్ మేకల- ఎన్టీఆర్, నాగార్జునతో బ్రాండ్స్
ఓటీటీ టు వెండితెర- 4, 5 సినిమాలతో జోరుమీదున్న యంగ్ హీరో కౌశిక్ మేకల- ఎన్టీఆర్, నాగార్జునతో బ్రాండ్స్

జీ5 ఓటీటీలో

ఈ క్రమంలోనే సోనీ లివ్ ఓటీటీ 'ప్రియురాలు', జీ5 ఓటీటీ 'సిట్' వంటి చిత్రాలతో డిజిటల్ వీక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న యంగ్ ఆర్టిస్ట్ కౌశిక్ మేకల, ఇప్పుడు వరుస ప్రాజెక్ట్‌లతో టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.

వెబ్ సిరీస్ నుంచి బ్రాండ్ అంబాసిడర్ వరకు..

ఇటీవల ఓటీటీ రిలీజ్ అయిన 'పార్ట్ టైమర్స్' వెబ్ సిరీస్‌లో కౌశిక్ కథానాయకుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నేటి తరం ఆలోచనలకు అద్దం పట్టే కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.

నాగార్జున, ఎన్టీఆర్‌తో కలిసి

కేవలం సినిమాలే కాకుండా, టాలీవుడ్ అగ్ర కథానాయకులు అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి ప్రముఖ బ్రాండ్ అడ్వర్టైజ్‌మెంట్లలో నటించి మెప్పించారు కౌశిక్ మేకల. టీవీ ప్రకటనల ద్వారా తెలుగు ఇళ్లలో తన రూపంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

రిలీజ్‌కు రెడీగా ఉన్న క్రేజీ ప్రాజెక్ట్‌లు

చిత్ర పరిశ్రమలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కౌశిక్ తన కెరీర్‌ను పక్కా ప్రణాళికతో నిర్మించుకుంటున్నారు. కౌశిక్ మేకల కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ "వైరల్ వీడియో". చిత్రం నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని త్వరలోనే థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది వైరల్ వీడియో సినిమా.

వినూత్నమైన డ్రామాతో సినిమా

మరోవైపు ప్రముఖ దర్శకుడు జీవి రామరాజు కాంబినేషన్‌లో కౌశిక్ హీరోగా నటించిన కొత్త సినిమా కూడా విడుదల దశకు చేరుకుంది. వినూత్నమైన డ్రామాతో రూపొందిన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

సెట్స్‌పై మూడు చిత్రాలు.. లైన్‌లో మరికొన్ని!

ప్రస్తుతం కౌశిక్ చేతిలో మూడు ప్రాజెక్ట్‌లు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అందులో 'సైక్ సిద్ధార్థ్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వరుణ్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఒకటి. వీటితో పాటు ఫైన్ ఫ్రేమ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందుతున్న మరో చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.

వైవిధ్యమైన రోల్స్ ఎంచుకోవడం

డిఫరెంట్ కంటెంట్‌తో వస్తున్న యంగ్ డైరెక్టర్లను నమ్ముతూ, వైవిధ్యమైన రోల్స్ ఎంచుకోవడమే కౌశిక్ ప్లస్ పాయింట్. ఇవే కాకుండా మరికొన్ని పెద్ద బ్యానర్ల చిత్రాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే వాటికి సంబంధించిన అధికారిక వివరాలను చిత్రబృందాలు వెల్లడించనున్నాయి.

ఓటీటీ నుంచి వెండితెర హీరోగా

మొత్తానికి ఓటీటీ స్పేస్ నుంచి మొదలైన కౌశిక్ ప్రయాణం.. ఇప్పుడు వెండితెరపై కీలక పాత్రలు, హీరోగా వరుస అవకాశాలతో సరికొత్త ఎత్తుకు చేరుకుంటోంది. చిన్న సినిమాలకు, కథాబలం ఉన్న కాన్సెప్టులకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కౌశిక్ రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో మరిన్ని నూతన మైలురాళ్లను అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More