Jr NTR Surgery: జూనియర్ ఎన్టీఆర్ సర్జరీ సక్సెస్.. కిమ్స్ హాస్పిటల్ రిలీజ్ చేసిన అప్డేట్ ఇదే.. రెస్ట్ ఎన్ని రోజులంటే?
Jr NTR Surgery: జూనియర్ ఎన్టీఆర్ కు విజయవంతంగా సర్జరీ పూర్తయింది. డ్రాగన్ మూవీ షూటింగ్ లో గాయపడిన ఆయనకు సికిందరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు సర్జరీ చేశారు. రెండు నుంచి మూడు నెలల పాటు షూటింగులకు తారక్ దూరం కానున్నారు.
Jr NTR Surgery: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఊరటనిచ్చే వార్త బయటకు వచ్చింది. భుజం గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్‌కు సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆస్పత్రిలో ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ (Arthroscopic Surgery) విజయవంతంగా పూర్తయింది.

డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సుర్గప్నేని నేతృత్వంలోని నిపుణులైన ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి చాలా స్థిరంగా ఉందని, త్వరలోనే ప్రత్యేక ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తారని వైద్యులు వెల్లడించారు.
2 నుంచి 3 నెలల రెస్ట్.. ఆ తర్వాతే 'డ్రాగన్' సెట్స్‌లోకి..
భుజానికి సర్జరీ సక్సెస్ కావడంతో ఎన్టీఆర్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు ధీమా వ్యక్తం చేశారు. అయితే పూర్తిగా సాధారణ పరిస్థితికి రావడానికి ఆయనకు కనీసం 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని స్పష్టం చేశారు. ఈ సమయంలో ఎన్టీఆర్ పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు.
ఈ హెల్త్ అప్‌డేట్‌తో గ్లోబల్ వైడ్‌గా ఉన్న నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో 'గెట్ వెల్ సూన్ తారక్' అంటూ వేలాదిగా పోస్టులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
గ్లోబల్ కాన్వాస్‌పై ఎన్టీఆర్ హవా.. రీసెంట్ బాక్సాఫీస్ రికార్డులు
'ఆర్‌ఆర్ఆర్' (RRR) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్, తన కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నారు. రీసెంట్‌గా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర: పార్ట్ 1' (Devara Part 1) బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.
హిందీ బెల్ట్‌లో కూడా ఎన్టీఆర్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించిన 'వార్ 2' (War 2) సినిమాతో హిందీలోకీ అడుగు పెట్టారు. ఈ మూవీ ఆశించిన ఫలితం సాధించలేకపోయినా.. తారక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్'.. అంచనాలు నెక్స్ట్ లెవెల్
కోలుకున్న తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి భారీ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. 'కేజీఎఫ్' (KGF), 'సలార్' (Salaar) వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలను తెరకెక్కించిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. డ్రాగన్ అనే టైటిల్ ను ఆ మధ్య ఖరారు చేశారు. ఈ మూవీ షూటింగ్ లోనే తారక్ గాయపడ్డారు.
ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ ఎపిక్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ శ్రమ పడుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


