Janhvi Kapoor OTT: ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్-పెద్ది తర్వాత తమిళంలో క్రేజీ సిరీస్-బాలీవుడ్ బ్యూటీ డెబ్యూ ప్లాన్
Janhvi Kapoor OTT: అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. తమిళంలో తన డిజిటల్ అరంగేట్రం చేయబోతుందని టాక్. ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ షో రన్నర్‌గా క్రేజీ సిరీస్ రాబోతుందని అంటున్నారు. ఈ సిరీస్ ఏ ఓటీటీలో వస్తుందో చూసేయండి.
Janhvi Kapoor OTT: బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలోనూ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) త్వరలోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. పెద్ది మూవీతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఈ భామ.. తమిళంలో వెబ్ సిరీస్ తో డిజిటల్ డెబ్యూ చేస్తుందని అంటున్నారు.

జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. టాలీవుడ్ లో దేవర, పెద్ది సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. ఈ నేపథ్యంలో పెద్ది మూవీ తర్వాత జాన్వీ కపూర్ తమిళ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టనుందని తెలిసింది.
పాపులర్ ఓటీటీ దిగ్గజం 'నెట్‌ఫ్లిక్స్' (Netflix) ఈ సిరీస్ ను నిర్మిస్తుందని సమాచారం. జాన్వీ కపూర్ నటించనున్న ఈ క్రేజీ వెబ్ సిరీస్ కు ‘కురత్తి’ (Kurathi) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్.
షో రన్నర్ ఎవరంటే?
ఈ తమిళ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సాంకేతిక వివరాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రముఖ తమిళ దర్శకుడు సర్గుణం (Sarkunam) ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నాడని తెలిసింది.
ఇక కల్ట్ అండ్ రా చిత్రాలకు పేరుగాంచిన ప్రఖ్యాత దర్శకుడు పా. రంజిత్ (Pa. Ranjith) ఈ సిరీస్‌కు షో రన్నర్‌గా వ్యవహరించబోతున్నాడని అంటున్నారు.
'పెద్ది' బ్లాక్‌బస్టర్ తర్వాత
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించిన 'పెద్ది' (Peddi) చిత్రం భారీ విజయం సాధించడంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇప్పటికే టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ భామ, ఇప్పుడు కోలీవుడ్ డిజిటల్ స్పేస్‌లోకి కూడా అడుగుపెడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
సర్గుణం మార్క్ స్టోరీ టెల్లింగ్, పా. రంజిత్ క్రియేటివ్ మైండ్ కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్ ఎలాంటి డిఫరెంట్ అండ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించబోతున్నారనే దానిపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఓటీటీలోకి స్టార్లు
ప్రస్తుతం ఓటీటీలకు చాలా డిమాండ్ నెలకొంది. ఇంట్లో కూర్చునే వినోదాన్ని ఆస్వాదించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఓటీటీ సినిమాలు, సిరీస్ ల్లో నటించేందుకు సై అంటున్నారు. ఇప్పటికే తెలుగులో నాగ చైతన్య ఓ వెబ్ సిరీస్ చేశాడు.
తాజాగా సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా ఓ వెబ్ సిరీస్ తో రావడం చూశాం. ఓటీటీ ఆడియన్స్ కు దగ్గరయ్యేందుకు స్టార్లు డిజిటల్ డెబ్యూపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


