Sreeleela Janhvi Kapoor: ఒకే ప్రేమికుడు.. ఇద్దరి సైకో అబ్సెషన్.. జాన్వీ కపూర్, శ్రీలీలా డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్?
Sreeleela Janhvi Kapoor: బాలీవుడ్ భామ జాన్వీ కపూర్, టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల కలసి ఒకే సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకే వ్యక్తిని ప్రాణంగా ప్రేమించే ఇద్దరు యువతుల మధ్య పెరిగే తీవ్రమైన సైకోలాజికల్ అబ్సెషన్ స్టోరీగా ఈ మూవీ రాబోతుందని టాక్. డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.
Sreeleela Janhvi Kapoor: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లు ఒకే సినిమాలో స్క్రీన్ పంచుకోబోతుండటం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఉత్తరాది, దక్షిణాది ఇండస్ట్రీలలో విశేష ప్రజాదరణ సొంతం చేసుకున్న జాన్వీ కపూర్, శ్రీలీల కలసి ఓ భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.

శ్రీలీల, జాన్వీ కలిసి
బాలాజీ మోషన్ పిక్చర్స్, సిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు ఏక్తా కపూర్, ఆస్కార్ విజేత గునీత్ మోంగా కపూర్ ఈ వినూత్న చిత్రాన్ని నిర్మించనున్నారని తెలిసింది. 'పగ్లైట్', 'గ్యారా గ్యారా' వంటి విభిన్న కాన్సెప్ట్ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఉమేష్ బిష్ట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం.
సైకోలాజికల్ క్రైమ్ థ్రిల్లర్
సాధారణంగా ఇద్దరు హీరోయిన్లు ఉన్న కథలు రొటీన్ ట్రయాంగిల్ ప్రేమకథలుగానే తెరకెక్కుతుంటాయి. కానీ ఈ అన్‌టైటిల్డ్ ప్రాజెక్ట్ పూర్తిగా డార్క్ రొమాన్స్, సైకోలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అంశాల కలయికగా సాగనుందని తెలిసింది. ఒకే అబ్బాయిని తీవ్రంగా ప్రేమించే ఇద్దరు అమ్మాయిలు, అతడిని దక్కించుకోవడం కోసం వేసే మైండ్ గేమ్‌లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెప్తున్నారు.
ఒకరిపై ఒకరికి పగ
ఆ ప్రేమ కాస్తా క్రమంగా ఒకరిపై ఒకరు పగ తీర్చుకునే సైకో అబ్సెషన్‌గా మారుతుంది. ఈ క్రమంలో జరిగే పరిణామాలు, అనుమానాస్పద నేరాలు ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురిచేసేలా స్క్రీన్‌ప్లే డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమాలో హీరోయిన్ల మధ్య నలిగిపోయే హీరో క్యారెక్టర్ కోసం మేకర్స్ వెతుకుతున్నారని టాక్.
కెరీర్ లకు కీలకం
ఇద్దరు హీరోయిన్ ల కెరీర్ కు ఈ సినిమా అత్యంత కీలకంగా మారనుంది. టాలీవుడ్‌లో వరుస హిట్‌లతో దూసుకెళ్లిన శ్రీలీల.. బాలీవుడ్ లోనూ అదరగొట్టాలని చూస్తోంది. నటనకు విపరీతమైన స్కోప్ ఉన్న ఈ డార్క్ థ్రిల్లర్ ఆమె హిందీ మార్కెట్ పునాదిని బలపరచనుందని అంటున్నారు. అందుకే ఈ మూవీ కోసం ఆమె స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టనుందని తెలిసింది.
మరోవైపు 'పెద్ది' సినిమాలో తన పాత్రపై సాగిన చర్చల తర్వాత, ప్రస్తుతం టైగర్ ష్రాఫ్‌తో 'లగ్ జా గలే' చేస్తున్న జాన్వీ కపూర్‌కు కూడా ఇది సరైన ఇమేజ్ మేకోవర్ ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 అక్టోబర్ లేదా నవంబర్ నెలలో షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


