TV: టీవీలో వీకెండ్‌కి డబుల్ ధమాకా- రేపు సీనియర్ హీరో కమ్‌బ్యాక్ మూవీ టీవీ ప్రీమియర్- సీరియల్స్ హీరోహీరోయిన్లతో సందడి!

Weekend TV Premieres Telugu: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా బుల్లితెర ఛానెల్ తమ ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ధమాకా అందించనుంది. ఈ ఆదివారం అంటే రేపు సీనియర్ హీరో కమ్‌బ్యాక్ ఇచ్చిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ టీవీ ప్రీమియర్‌తోపాటు సీరియల్స్ హీరోహీరోయిన్ల సందడితో షో ప్రసారం కానుంది.

Published on: Sep 19, 2026, 05:37:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Weekend TV Premieres Telugu: తెలుగువారి ఇళ్లలో పండుగ వాతావరణం వచ్చిందంటే చాలు బుల్లితెర ఛానళ్లు సరికొత్త వినోదాల విందుతో ముస్తాబవుతాయి. గణేష్ నవరాత్రుల శుభసందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ 'జీ తెలుగు' ప్రేక్షకులకు రెట్టింపు ఉత్సాహాన్ని అందించేందుకు రంగం సిద్ధం చేసింది.

టీవీలో వీకెండ్‌కి డబుల్ ధమాకా- రేపు సీనియర్ హీరో కమ్‌బ్యాక్ మూవీ టీవీ ప్రీమియర్- సీరియల్స్ హీరోహీరోయిన్లతో సందడి!
టీవీలో వీకెండ్‌కి డబుల్ ధమాకా- రేపు సీనియర్ హీరో కమ్‌బ్యాక్ మూవీ టీవీ ప్రీమియర్- సీరియల్స్ హీరోహీరోయిన్లతో సందడి!

బుల్లితెర సెలబ్రిటీల సందడితో

ఈ సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం నాడు అంటే రేపు భారీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒకవైపు సరికొత్త సినిమా టీవీ ప్రీమియర్, మరోవైపు బుల్లితెర సెలబ్రిటీల కోలాహలంతో కూడిన ప్రత్యేక కార్యక్రమంతో పండుగ శోభను ప్రతి ఇంటికీ తీసుకురానుంది.

వడ్డే నవీన్ రీ-ఎంట్రీ: 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' వరల్డ్ ప్రీమియర్

ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ హీరో వడ్డే నవీన్ సుదీర్ఘ విరామం తర్వాత ఈ చిత్రంతో అదిరిపోయే రీ-ఎంట్రీ ఇచ్చారు. కమల్ తేజ నర్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' చిత్రం కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకునే పూర్తిస్థాయి వినోదాత్మక కథాంశంతో రూపొందింది.

తొలిసారిగా ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు టీవీ ప్రీమియర్

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రాశి సింగ్ నటించిన ఈ చిత్రాన్ని మొదటిసారిగా బుల్లితెరపై ప్రసారం చేస్తున్నారు. సెప్టెంబర్ 20, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం కానుంది. వినాయక చవితి సెలవు దినాన కుటుంబ సమేతంగా ఆస్వాదించడానికి ఈ సినిమా సరైన ఎంపికగా నిలవనుంది.

సెలబ్రిటీల హంగామా: 'జై బోలో గణేష్ మహారాజ్ కీ జై'

సినిమా వినోదం ముగిసిన వెంటనే, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి గణేష్ నవరాత్రుల ప్రత్యేక సంబరం షురూ కానుంది. 'జై బోలో గణేష్ మహారాజ్ కీ జై' పేరిట పండుగ వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు.

స్టార్ యాంకర్, సీనియర్ హీరోయిన్లు

బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తనదైన టైమింగ్, చురుకైన యాంకరింగ్‌తో ఈ టీవీ షోను నడిపించనున్నారు. ఈ వేడుకలో సీనియర్ హీరోయిన్ రోజా, సదా మధ్య సాగే పోటీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీరిద్దరి నేతృత్వంలో జరిగే సరదా గేమ్‌లు, టీజింగ్‌లు ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని పంచనున్నాయి.

బుల్లితెర తారల వినోదాల విందు

కేవలం వెండితెర నటీనటులే కాకుండా జీ తెలుగులో ప్రసారమయ్యే ప్రజాదరణ పొందిన సీరియల్స్ హీరోహీరోయిన్లు ఈ వేడుకలో భాగమయ్యారు. కలర్‌ఫుల్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు, కామెడీ స్కిట్లు, నవ్వులు పూయించే ఛాలెంజ్‌లతో ఈ కార్యక్రమం సాగనుంది.

డబుల్ వినోదం, డబుల్ సంబరం

ప్రతీ ఏటా ఉత్సవాల వేళ ప్రత్యేక కార్యక్రమాలతో ఆకట్టుకునే జీ తెలుగు, ఈసారి కూడా డబుల్ వినోదం, డబుల్ సంబరంతో తెలుగు ఇళ్లలో పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేయడానికి సిద్ధమైంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More