Suman: నిర్మాతే విలన్‌గా నటించారు- సీనియర్ హీరో సుమన్ కామెంట్స్- ఇండస్ట్రీ పెద్దలెవరూ పట్టించుకోలేదన్న నిర్మాత లక్షణరావు

Maa Ramudu Andarivadu Pre Release Event Suman Speech: తెలుగులో వస్తున్న సరికొత్త సినిమా మా రాముడు అందరివాడు. శ్రీరామ్, స్వాతి మందాడి హీరో హీరోయిన్లుగా నటించిన మా రాముడు అందరివాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో సీనియర్ హీరో సుమన్, నిర్మాత లక్ష్మణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Sep 3, 2026, 14:49:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Maa Ramudu Andarivadu Pre Release Event Suman Speech: అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు.

నిర్మాతే విలన్‌గా నటించారు- సీనియర్ హీరో సుమన్ కామెంట్స్- ఇండస్ట్రీ పెద్దలెవరూ పట్టించుకోలేదన్న నిర్మాత లక్షణరావు
నిర్మాతే విలన్‌గా నటించారు- సీనియర్ హీరో సుమన్ కామెంట్స్- ఇండస్ట్రీ పెద్దలెవరూ పట్టించుకోలేదన్న నిర్మాత లక్షణరావు

మా రాముడు అందరివాడు నటీనటులు

అలాగే, మా రాముడు అందరివాడు సినిమాలో సీనియర్ హీరో, నటుడు సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి ఇతర పాత్రలు పోషించారు.

సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా మా రాముడు అందరివాడు సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో మా రాముడు అందరివాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

మా రాముడు అందరివాడు ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ మా రాముడు అందరివాడు ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ ఈ చిత్రం ఘన విజయం సాధించి మూవీ టీమ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.

ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ .. "సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే టాలెంట్ ముఖ్యమని ఇప్పటికే చాలామంది నిరూపించారు. ఈ సినిమా హీరో శ్రీరామ్‌లో కూడా మంచి టాలెంట్ ఉంది. డ్యూయెల్ రోల్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ బాగా చేశారు" అని చెప్పారు.

మంచి మెసేజ్ ఇచ్చే పాత్ర

"ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా మంచి మెసేజ్ ఇచ్చే పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు మైకిల్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నిర్మాత లక్ష్మణ్ గారు ఇందులో విలన్‌గా కూడా నటించారు. ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు" అని సీనియర్ నటుడు సుమన్ తెలిపారు.

"ఇది చాలా మంచి కథ. ట్విస్టులు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరింతమంది కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు" అని సుమన్ ఆకాంక్షించారు.

20 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసి

నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ.. "మా సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తూనే, ఇందులో విలన్‌ పాత్ర పోషించా. ఫస్టాఫ్‌లో వైల్డ్ విలన్‌గా కనిపిస్తా. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసి అరాచకంగా ఆ ఊరిని ఎలా కంట్రోల్ పెట్టుకుంటాడనేది నా క్యారెక్టర్" అని పేర్కొన్నారు.

"సుమన్ గారు ఇందులో సీఎంగా నటించారు. మా మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ అలరిస్తాయి. మారెడుమిల్లి ఫారెస్ట్‌లో షూటింగ్ చేశాం. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. మనీష్ కుమార్ మ్యూజిక్ అందించిన నాలుగు పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి" అని వెల్లడించారు ప్రొడ్యూసర్ అనుమల లక్ష్మణరావు.

ఎవరు పట్టించుకోలేదు

"డీవోపీ వినోద్, కుమార్‌‌ సహా టీమ్ అంతా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దవారిని సపోర్ట్ చేయాలని కోరాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ట్రైలర్ చూసి వారే బాగుందని చెప్పారు. 200పైగా థియేటర్స్‌లో సెప్టెంబర్ 4న ప్రేక్షకులముందుకు రానున్న మా చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నా" అని కోరారు నిర్మాత లక్ష్మణరావు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More