8 నెలలు సెన్సార్‌లోనే ఉండిపోయింది, డబ్బులన్నీ ఖర్చు పెట్టి తీశారు- సీక్రెట్ సోల్జర్ ట్రైలర్ లాంచ్- బీవీఎస్ రవి కామెంట్స్
Secret Soldier Trailer Launch Event: టాలీవుడ్‌లో వస్తోన్న లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం సీక్రెట్ సోల్జర్. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ శైలేష్ కొలను, బీవీఎస్ రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Secret Soldier Trailer Launch Event: తెలుగులో వస్తున్న సరికొత్త స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా సీక్రెట్ సోల్జర్. ఈ సినిమాలో నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా చేశారు. సీక్రెట్ సోల్జర్ సినిమాకు అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

సీక్రెట్ సోల్జర్ ఇతర నటీనటులు
మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన సీక్రెట్ సోల్జర్ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక సెప్టెంబర్ 18న సీక్రెట్ సోల్జర్ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ సీక్రెట్ సోల్జర్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్‌లో కష్టం కనిపించింది
సీక్రెట్ సోల్జర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. సూర్య శ్రీనివాస్ ‘హిట్ 3’ మూవీ సమయంలో ఈ సినిమా గురించి చెబుతూ ఉండేవారు. నాకు ఈ ట్రైలర్ చాలా నచ్చింది. ట్రైలర్‌లో కష్టం కనిపించింది. చాలా కష్టపడి సినిమాను తీశారు అనే ఫీలింగ్‌ను ట్రైలర్ కలిగించింది" అని అన్నారు.
"ఇదే క్వాలిటీ సినిమాలో ఉంటే మాత్రం కచ్చితంగా తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. అద్భుతమైన రైటింగ్‌తో తీస్తే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆడియన్స్ చూస్తారు. నిహాల్ చాలా ఇంటెన్సిటీతో కనిపించాడు. శ్రీనివాస్ నాకు ‘హిట్ 3’ సినిమా నుంచి తెలుసు. ఆ సినిమాకి చాలా కష్టపడ్డాడు. ఇద్దరూ కూడా చాలా హార్డ్ వర్క్‌తో ఈ సినిమా చేశారని అనిపిస్తుంది" అని శైలేషు కొలను తెలిపారు.
సెన్సార్‌లోనే 8 నెలలు ఉందని
"కచ్చితంగా ప్రేక్షకులు వాళ్లను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 18న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఇది బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన సినిమా. డైరెక్టర్ విశ్వనాథ్ గారికి కంగ్రాచులేషన్స్. ఆల్ ది వెరీ బెస్ట్" అని శైలేష్ కొలను చెప్పారు.
రైటర్, డైరెక్టర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ.. "సీక్రెట్ సోల్జర్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ సినిమా సెన్సార్‌లోనే 8 నెలల పాటు ఉందని విన్నాను. కచ్చితంగా అందరికీ నచ్చడం వల్లే సెన్సార్ నుంచి బయటకు వచ్చింది" అని అన్నారు.
డబ్బులన్నీ ఖర్చుపెట్టి తీశారు
"నిర్మాత ఈ సినిమాకి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చుపెట్టి తీశారు. సినిమాపై చాలా ప్యాషన్ ఉంది ఆయనకి. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధించి, ఆయన మరో సినిమా తీయాలని కోరుకుంటున్నాను. కాలభైరవ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా మంచి స్ట్రాంగ్ టీమ్‌తో వస్తున్నారు. సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని బీవీఎస్ రవి ఆకాంక్షించారు.
నటుడు కమల్ కామరాజు మాట్లాడుతూ.. "డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు నాకు చాలా సర్‌ప్రైజ్‌గా అనిపించింది. చాలా పెద్ద స్కేల్‌లో తీసే కథ ఇది. తెలుగులో ఇలాంటి సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమాలు ఆడితే కొత్త ప్రొడ్యూసర్స్‌కు, డైరెక్టర్స్‌కు హోప్ వస్తుంది. సినిమాని థియేటర్లలో ఎంజాయ్ చేయండి" అని తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


