OTT Release: అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్-డైరెక్టర్ నటించిన సినిమా-ఇవాళ ఓటీటీలోకి తెలుగు విలేజ్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్!

OTT Release: థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న రూరల్ యాక్షన్ క్రైమ్ డ్రామా ‘అనకాపల్లి’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ విలేజ్ యాక్షన్ డ్రామా ఊహించని ట్విస్ట్ లతో సాగుతుంది. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఇందులో నటుడిగా ఓ కీలక పాత్ర పోషించారు. 

Published on: Nov 3, 2026, 05:46:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Release: డైరెక్టర్ ఖగేష్ తమ్మినేని తెరకెక్కించిన విలేజ్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా అనకాపల్లి అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి కథ అందించడమే కాకుండా హీరో తండ్రిగా ఓ కీలక పాత్రలో నటించి, నిర్మాణంలోనూ భాగమయ్యారు.

అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్-డైరెక్టర్ నటించిన సినిమా-ఇవాళ ఓటీటీలోకి తెలుగు విలేజ్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్!
అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్-డైరెక్టర్ నటించిన సినిమా-ఇవాళ ఓటీటీలోకి తెలుగు విలేజ్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్!

అనకాపల్లి ఓటీటీ

థియేట్రికల్ రన్ ముగియడంతో అనకాపల్లి సినిమా ఓటీటీ బాట పట్టింది. ఇవాళ (నవంబర్ 3) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్'లో డిజిటల్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. విలేజ్ యాక్షన్ డ్రామా చూడాలనుకునే తెలుగు ఆడియన్స్ కు ఈ మూవీ పర్ఫెక్ట్ ఛాయిస్.

సినిమా కథ ఏంటంటే?

అనకాపల్లి ప్రాంతంలో సాగే కథ ఇది. సూర్య (విక్రమ్ సహిదేవ్) డిగ్రీ పూర్తి చేసిన ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. అతడి తండ్రి సాంబశివరావు (త్రినాథరావు నక్కిన) ఎలక్ట్రిసిటీ ఆఫీసులో నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి. అయితే, ఆ సాధారణ మిడిల్ క్లాస్ జీవితం నచ్చని సూర్య.. అనకాపల్లిలో బాగా పలుకుబడి ఉన్న రౌడీ షీటర్ 'బుల్లెట్' (తారక్ పొన్నప్ప) యాటిట్యూడ్‌కు ఆకర్షితుడవుతాడు. బుల్లెట్ దగ్గర అనుచరుడిగా చేరి, కొన్నాళ్లకే అతనికి నమ్మిన బంటుగా ఎదుగుతాడు.

ఇదే క్రమంలో స్థానిక డ్రగ్ డీలర్, ఎమ్మెల్యే అనుచరుడైన నాయుడుతో వీరికి గొడవలు వస్తాయి. ఆధిపత్య పోరులో సూర్య, బుల్లెట్ కలిసి నాయుడిని మర్డర్ చేస్తారు.

ఊహించని ట్విస్ట్..

మరోవైపు సూర్య.. కరెంటు మీటర్ కోసం తన సహాయం తీసుకున్న అమృత (సంధ్య వశిష్ట)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా తనను ప్రేమిస్తోందని సూర్య గుడ్డిగా నమ్ముతాడు. కానీ, వాలెంటైన్స్ డే రోజు సూర్యకి ఓ ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. తాను ప్రాణంగా ప్రేమించిన అమృత.. తన సొంత అన్నలా భావించే రౌడీ షీటర్ బుల్లెట్‌ను ప్రేమిస్తున్నానని సూర్యకు చెబుతుంది. ఈ ఒక్క సంఘటనతో బుల్లెట్, సూర్య మధ్య వైరం మొదలవుతుంది. ఆ తర్వాత సూర్య ఏం చేశాడు? తన ప్రేమను త్యాగం చేశాడా? లేదా ప్రాణ స్నేహితుడైన బుల్లెట్‌ను ఎదిరించాడా? అనేది తెరపై చూడాల్సిన మిగతా స్టోరీ.

యాక్టింగ్ అదుర్స్

హీరోగా విక్రమ్ సహిదేవ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టాడు. హీరోయిన్ సంధ్యా వశిష్ట పల్లెటూరి అమ్మాయిలా అమాయకపు చూపులతో సహజంగా నటించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న బుల్లెట్ పాత్రలో తారక్ పొన్నప్ప ఒదిగిపోయాడు. సూర్య తల్లిదండ్రులుగా సీనియర్ నటి ఇంద్రజ, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దేవ్‌జాంద్ అందించిన నేపథ్య సంగీతం, వంశీకృష్ణ సినిమాటోగ్రఫీ అనకాపల్లి వాతావరణాన్ని కళ్లకు కట్టాయి.

ఓటీటీలో ఎందుకు చూడాలి?

కేవలం యాక్షన్, క్రైమ్ మాత్రమే కాకుండా.. ఒక మంచి రూరల్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ వద్ద వచ్చే ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ చిత్రాన్ని వీకెండ్‌లో ఇంటిల్లిపాది హాయిగా చూసెయ్యొచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More