Vaishnavi: బేబీ మూవీ ఇమేజ్‌పై ప్రశ్నకు ఇబ్బంది పడ్డ వైష్ణవి.. మైక్ తీసుకుని సపోర్ట్‌గా ఆనంద్ దేవరకొండ కామెంట్లు
Vaishnavi: బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ జోడీ అనిపించుకున్నారు వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ. ఇప్పుడీ ఇద్దరు కలిసి నటించిన మరో సినిమా ‘ఎపిక్’. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజైంది. టీజర్ లాంఛ్ ఈవెంట్లో ఓ ప్రశ్నకు వైష్ణవి ఇబ్బంది పడగా.. ఆనంద్ సమాధానమిచ్చాడు.
Vaishnavi: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య.. బేబీ మూవీతో ఇండస్ట్రీని షేక్ చేసిన జంట ఇది. వీళ్లు కలిసి స్క్రీన్ పై చేసిన మ్యాజిక్ కారణంగా బేబీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి తమ కెమిస్ట్రీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఆనంద్, వైష్ణవి రెడీ అయ్యారు. ఈ జంట తాజాగా కలిసి నటిస్తున్న మూవీ ‘ఎపిక్’.

ఎపిక్ టీజర్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘ఎపిక్’ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇందులో రొమాన్స్ తో ఈ జోడీ రెచ్చిపోయింది. వేరే లెవల్ కెమెస్ట్రీని చూపించేందుకు రెడీ అయింది. అయితే ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్లో వైష్ణవి చైతన్యకు ఆనంద్ సపోర్ట్ గా మాట్లాడటం తెగ వైరల్ గా మారింది.
ఆ ప్రశ్నతో
బుధవారం (ఏప్రిల్ 29) ఎపిక్ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య, డైరెక్టర్ ఆదిత్య హాసన్ ను మీడియా వాళ్లు ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో తనకు ఎదురైన ఓ ప్రశ్నతో వైష్ణవి చైతన్య చాలా ఇబ్బంది పడ్డట్లు కనిపించింది.
బేబీ ఇమేజ్
బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య యాక్టింగ్ తో అదరగొట్టింది. సిన్సియర్ గా లవ్ చేసే ఓ అబ్బాయి ఉండగానే మరో యువకుడితో చెట్టపట్టాలు వేసుకుని తిరిగే అమ్మాయి క్యారెక్టర్ ను వైష్ణవి చేసింది. ఈ క్యారెక్టర్ జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే ‘‘బేబీ తర్వాత ఇమేజ్ ఛేంజ్ ఓవర్ కావాలి కదా. ఎపిక్ లో ఆ మార్పు ఉంటుందా’’ అని ఓ మీడియా ప్రతినిధి వైష్ణవిని అడిగాడు.
ఆనంద్ సపోర్ట్
ఆ ప్రశ్నకు వైష్ణవి చైతన్య కన్ఫ్యూజ్ కావడంతో పాటు ఇబ్బంది పడింది. మీకే ఆ ప్రశ్న అన్నట్లు డైరెక్టర్ వైపు చూసింది. ‘బేబీ ఇమేజ్’ అని ఎవరన్నారంటూ ఆ డైరెక్టర్ కాస్త గట్టిగానే మాట్లాడాడు. అప్పుడే వైష్ణవి నుంచి మైక్ తీసుకున్న ఆనంద్ ఆమెకు సపోర్ట్ గా కామెంట్లు చేశాడు.
‘‘క్యారెక్టర్ ను బట్టి కెరీర్ అంతా ఒకే ఇమేజ్ కంటిన్యూ చేయాలని లేదు కదా. ఎపిక్ తో ఆమెకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. బేబీలో ఆమె యాక్టింగ్ కు మెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఫీమేల్ స్ట్రాంగ్ క్యారెక్టర్ చేసింది. ఈ క్యారెక్టర్ ను ఎంతో బాగా తీర్చిదిద్దారు’’ అని ఆనంద్ చెప్పాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


