Anand Deverakonda: వీడు పక్కా ఒరిజినల్ డైరెక్టర్.. ఆమె స్పెషల్ యాక్టర్.. వదినమ్మను కూడా పిలుస్తా: ఆనంద్ దేవరకొండ
Anand Deverakonda: ఎపిక్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఆనంద్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ట్రైలర్ లాంచ్ కు వదినమ్మ (రష్మిక)ను కూడా పిలుస్తానని చెప్పిన అతడు.. హీరోయిన్ వైష్ణవి చైతన్య, డైరెక్టర్ ఆదిత్యపై ప్రశంసల వర్షం కురిపించాడు.
Anand Deverakonda: ఆనంద్ దేవరకొండ చాలా రోజుల తర్వాత నటించిన మూవీ ఎపిక్ (Epic). ఈ మూవీ టీజర్ బుధవారం (ఏప్రిల్ 29) రిలీజైంది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఆనంద్ తోపాటు వైష్ణవి చైతన్య, డైరెక్టర్ ఆదిత్య హాసన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వదినమ్మను కూడా పిలుస్తా..
ఎపిక్ టీజర్ లాంచ్ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ సందర్భంగా చివర్లో వదినను కూడా పిలుస్తారా అని ఒకరు అడిగారు. దీనికి ఆనంద్ స్పందిస్తూ.. కచ్చితంగా వదినమ్మ (రష్మిక మందన్న)ను కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు పిలుస్తాను అని ఆనంద్ అన్నాడు.
అంతేకాదు ఇంతకుముందు వదిన అంటూ ఏడిపించారు.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా వదిన వదిన అంటున్నాను అని ఆనంద్ అనడం విశేషం. రష్మిక తమ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఓ పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని, మరింత వెలుగు నింపిందని చెప్పాడు.
నువ్వో స్పెషల్ యాక్టర్
ఈ సందర్భంగా ఎపిక్ మూవీలో ఫిమేల్ లీడ్ గా నటించిన వైష్ణవి చైతన్యపైనా ఆనంద్ ప్రశంసలు కురిపించాడు. ఆమెతో నటిస్తుంటే తాను ఆటో పైలట్ మోడ్ లోకి వెళ్లిపోతానని, ఆమె ఓ స్పెషల్ యాక్టర్ అని అన్నాడు. ఆమె ఓ నటిగా మారడానికే పుట్టిందని, ఎలాంటి నటననైనా చాలా సులువుగా చేసేస్తుందని ఆనంద్ చెప్పాడు. తనతో నటించే అవకాశం రావడం అదృష్టమని తెలిపాడు. కెరీర్లో ఆమె చాలా ఎత్తుకు వెళ్తుందని కూడా అన్నాడు.
వీడు పక్కా ఒరిజినల్ డైరెక్టర్
ఇక ఎపిక్ మూవీ డైరెక్టర్ ఆదిత్య గురించి ఆనంద్ మాట్లాడుతూ.. వీడు ఓ పక్కా ఒరిజినల్ డైరెక్టర్ అని అన్నాడు. “డైరెక్టర్లలో రెండు రకాలు ఉంటారు. ఒకరు ఒరిజినల్ డైరెక్టర్స్. మరొకరు ఈ ఒరిజినల్ డైరెక్టర్లను చూసి ఇన్‌స్పైర్ అయ్యే డైరెక్టర్లు. వీడు మాత్రం పక్కా ఒరిజినల్ డైరెక్టర్. మీలో ఎవరైనా డైరెక్టర్ కావాలనుకుంటే వీడిని చూసి ఇన్‌స్పైర్ అవుతారు” అని ఆనంద్ స్పష్టం చేశాడు.
ఎపిక్ టీజర్ విశేషాలు
ఎపిక్ మూవీ టీజర్ చాలా ఇంట్రెస్టింగా సాగింది. ముఖ్యంగా ఇందులో ఆనంద్, వైష్ణవి మధ్య కెమెస్ట్రీ, లిప్ లాక్స్ ఆకట్టుకున్నాయి. 90's వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆదిత్య డైరెక్టర్ గా వస్తున్న మూవీ కావడంతో ఎపిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఆనంద్ మాట్లాడుతూ.. ఈ మూవీ చూస్తుంటే కాలేజీ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారని, ఆ నోస్టాల్జియా ఫీలింగ్ మీకు కలుగుతుందని చెప్పాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


