Anand Deverakonda: అన్న, వదినలతో కలిసి డ్యాన్స్ చేసిన ఆనంద్ దేవరకొండ.. సంచారమే ఎంతో బాగున్నదే అంటూ..
Anand Deverakonda: అన్న, వదినలతో కలిసి ఆనంద్ దేవరకొండ చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. విజయ్, రష్మిక పెళ్లికి ముందు సెలబ్రేషన్స్ లో భాగంగా చేసిన డ్యాన్స్ వీడియోను ఆనంద్ తాజాగా షేర్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి ఇంటి వేడుకల తర్వాత సోషల్ మీడియాలో అంతగా ట్రెండ్ అవుతున్న వీడియో ఏదైనా ఉందంటే అది దేవరకొండ బ్రదర్స్ అండ్ రష్మిక మందన్నదే. ఆనంద్ దేవరకొండ బుధవారం (మార్చి 11) తన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్న విజయ్ దేవరకొండ, వదిన రష్మిక మందన్నలతో కలిసి దిగిన ఒక క్రేజీ వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో ఈ ముగ్గురూ తమ స్నేహితులతో కలిసి ఉదయ్‌పూర్ లో వాళ్లు ఉన్న రిసార్ట్ లో స్టెప్పులేస్తూ కనిపించారు.

'సంచారమే' పాటకు రష్మిక, విజయ్ స్టెప్పులు
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ 'ఎపిక్' (Epic)లోని 'సంచారమే' అనే పాటకు వీరంతా కలిసి డ్యాన్స్ చేశారు. విజయ్ రంగురంగుల షర్ట్, వైట్ ట్రౌజర్స్‌లో స్టైలిష్‌గా కనిపిస్తుండగా.. రష్మిక షార్ట్స్, షర్ట్‌లో క్యాజువల్ లుక్‌లో మెరిసిపోయింది.
"ఇది కాస్త గందరగోళంగా అనిపించవచ్చు కానీ, ఆ క్షణంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం. మనకు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణిస్తూ డ్యాన్స్ చేయడం కంటే మించిన ఆనందం ఏముంటుంది?" అని ఆనంద్ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు.
అభిమానులు ఈ వీడియోను చూసి ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా రష్మికను 'వదిన' అని సంబోధిస్తూ ఆనంద్ వీడియో షేర్ చేయడంపై నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. "చివరికి అన్న, వదినలతో కలిసి చూశాం.. చాలా బాగుంది" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
'విరోష్' వివాహం.. ఒక మధుర జ్ఞాపకం
గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న విజయ్-రష్మిక జంట, ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమ అభిమానులు ముద్దుగా పిలుచుకునే 'విరోష్' (Virosh) పేరుతోనే తమ పెళ్లిని వారు సెలబ్రేట్ చేసుకున్నారు. ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగగా, హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
పెళ్లి తర్వాత తెలంగాణలోని విజయ్ స్వగ్రామానికి వెళ్లి సత్యనారాయణ వ్రతం, ఇతర సంప్రదాయ పూజలు నిర్వహించారు. తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్నదాన కార్యక్రమాలు, ఫుడ్ ట్రక్కుల ద్వారా స్వీట్ల పంపిణీ చేపట్టి తమ ఉదారతను చాటుకున్నారు.
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఈ జంట, త్వరలోనే 'రణబాలి' అనే సినిమాతో మరోసారి వెండితెరపై అలరించనున్నారు. మరోవైపు ఆనంద్ దేవరకొండ ఎపిక్ మూవీతోపాటు నెట్‌ఫ్లిక్స్ లోకి రానున్న తక్షకుడు అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


