Vijay Rashmika: రష్మికకు విజయ్ ముద్దు.. పెళ్లికి ముందు ప్రధానం, మెహెందీ సెలబ్రేషన్స్‌లో విరోష్ రొమాంటిక్ ఫొటోలు
Vijay Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లికి ముందు జరిగిన ప్రధానం, మెహెందీ వేడుకల ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోల్లో ఈ కపుల్ మాంచి రొమాంటిక్ మూడ్ లో కనిపించారు. ఒకదాంట్లో రష్మికకు విజయ్ ముద్దు ఇవ్వడం చూడొచ్చు.
ఏడేళ్ల ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లిన టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి సెలబ్రేషన్స్ కు సంబంధించిన అద్భుతమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన వీరి వివాహానికి ముందు నిర్వహించిన 'ప్రధానం', 'మెహందీ' వేడుకల ఫోటోలను ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకల్లో 'విరోష్' (Virosh) జోడీ సందడి చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

అంగరంగ వైభవంగా ప్రీ-వెడ్డింగ్ వేడుకలు
గత నెల అంటే ఫిబ్రవరి 25న జరిగిన ఈ వేడుకల్లో విజయ్, రష్మికలు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. షేర్ చేసిన ఫోటోల్లో ఈ జంట కలిసి డ్యాన్స్ చేస్తూ, నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఒక ఫోటోలో రష్మిక నుదుటిపై విజయ్ ముద్దు పెడుతున్న సీన్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఈ వేడుక కోసం రష్మిక ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న దుస్తుల్లో మెరిసిపోయింది.
తమ సంతోషాన్ని పంచుకుంటూ రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టింది. "25.02.26.. అది ఒక అద్భుతమైన మెహందీ, ప్రధానం ఈవెనింగ్. అంతా పర్ఫెక్ట్‌గా జరిగింది, కానీ సమయం మాత్రం చాలా వేగంగా గడిచిపోయింది. మా కోసం ఇంతటి ప్రత్యేకమైన దుస్తులను రూపొందించినందుకు తోరాని (Torani) టీమ్‌కు ధన్యవాదాలు" అని పేర్కొంది.
విజయ్ దేవరకొండ కూడా అదే రోజును గుర్తు చేసుకుంటూ.. "ఆ సాయంత్రం ఎంతో సరదాగా గడిచింది. వంద గంటలైనా ఆ సమయం అలాగే ఉంటే బాగుండు అనిపించింది" అని తన మనసులోని మాటను రాసుకొచ్చాడు.
'విరోష్' వివాహం.. తరలివచ్చిన సినీ తారాలోకం
ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ శివార్లలోని ఒక లగ్జరీ హోటల్‌లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. అనంతరం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ దిగ్గజాలు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున, అమల, నాగచైతన్య, వెంకటేష్, నాని వంటి తారలు హాజరయ్యారు. అలాగే బాలీవుడ్ నుంచి కృతి సనన్, కరణ్ జోహార్ సహా పలువురు ప్రముఖులు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు.
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ ఏడడుగులు వేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'రణబాలి' అనే పీరియడ్ డ్రామాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


