Rashmika Vijay wedding reception: విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్‌కు వచ్చిన చిరంజీవి, నాగార్జున, చైతన్య.. వీడియోలు
బుధవారం రాత్రి హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల వెడ్డింగ్ రిసెప్షన్ (Rashmika, Vijay wedding reception) కనుల పండువగా జరిగింది. టాలీవుడ్ అగ్ర హీరోలు, ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించగా, విజయ్ తనదైన శైలిలో చేసిన కామెంట్స్ నవ్వులు పూయించాయి.
టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకలు హైదరాబాద్ రిసెప్షన్‌తో ఘనంగా ముగిశాయి. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట.. బుధవారం (మార్చి 4) సినీ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో మెరిసిపోయారు. ఈ ఇద్దరి డ్రెస్సింగ్ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

సాంప్రదాయ దుస్తుల్లో కొత్త దంపతులు
రిసెప్షన్ వేడుక కోసం రష్మిక ఎరుపు, బంగారు రంగు కలగలిసిన పట్టుచీరలో అచ్చమైన తెలుగింటి కోడలిలా మెరిసిపోగా.. విజయ్ క్రీమ్ కలర్ కుర్తా, ధోతీ, భుజంపై కండువాతో రాయల్ లుక్‌లో కనిపించాడు. వేదిక వద్దకు రాగానే ఈ జంట కెమెరాలకు నవ్వుతూ ఫోజులిచ్చారు. ఈ క్రమంలో పాపరాజీలతో విజయ్ మాట్లాడుతూ.. "ఈ రోజుతో ఈ వేడుకలను ముగించి, కాస్త ప్రశాంతత కోసం అండర్ గ్రౌండ్ (ఏకాంతం)లోకి వెళ్లాలనుకుంటున్నాం" అని సరదాగా వ్యాఖ్యానించాడు. విజయ్ మాటలకు రష్మికతో పాటు అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయాడు.
తరలివచ్చిన సినీ దిగ్గజాలు
రష్మిక, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ పెద్దలంతా తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, దగ్గుబాటి వెంకటేష్, నాగార్జున తన భార్య అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి వచ్చారు.
అలాగే నేచురల్ స్టార్ నాని, నమ్రతా శిరోద్కర్ తన కుమార్తె సితారతో కలిసి హాజరయ్యారు. వీరితో పాటు సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, శరత్‌కుమార్, దర్శకుడు సుకుమార్, నవీన్ పొలిశెట్టి, దీక్షిత్ శెట్టి, బాలీవుడ్ నటి నీనా గుప్త కూడా ఈ వేడుకలో సందడి చేశారు.
ప్రైవేట్ వెడ్డింగ్ నుంచి పబ్లిక్ సెలబ్రేషన్ వరకు
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల ద్వారా దగ్గరైన ఈ జంట, తమ ప్రేమ విషయాన్ని పెళ్లి వరకు అత్యంత సీక్రెట్ గా ఉంచారు. ఉదయ్‌పూర్‌లోని ఆరావళి కొండల నడుమ ఒక లగ్జరీ హోటల్‌లో అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వరుసగా ఆలయాల సందర్శన, సొంతూరికి వెళ్లి వ్రతాలు పూర్తి చేసుకున్న ఈ జంట.. రిసెప్షన్‌తో ఈ వేడుకలకు ముగింపు పలికారు. అంతేకాదు పెళ్లి తర్వాత దేశవ్యాప్తంగా స్వీట్లు పంచడం, అన్నదానాలు చేయడం ద్వారా ప్రత్యేకంగా నిలిచారు.
సెప్టెంబర్‌లో మళ్ళీ వెండితెరపై..
నిజ జీవితంలో ఒక్కటైన విజయ్ - రష్మికలు త్వరలోనే వెండితెరపై కూడా జంటగా కనిపించనున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'రణబాలి' అనే పీరియడ్ డ్రామాలో వారు నటిస్తున్నారు. ఇందులో విజయ్ 'రణబాలి'గా, రష్మిక 'జయమ్మ'గా అలరించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper












