Virosh Sangeet: విరోష్ సంగీత్ ఫొటోలు చూశారా? విజయ్, రష్మిక ఎంత ముద్దుగున్నారో.. మరిదితోనూ స్టెప్పులేసిన మందన్న

Virosh Sangeet: అందమైన ప్రేమకు అద్భుతమైన వేడుక. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి కూడా ఇలాంటి వేడుకే. ఇప్పుడు తమ సంగీత్ కు సంబంధించిన ఫొటోలను రష్మిక ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఎంతో క్యూట్ గా ఉన్న ఈ జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Published on: Mar 3, 2026, 11:10:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ.. ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో ఈ జోడీదే హవా. వీళ్ల వెడ్డింగ్ ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి తర్వాత వీళ్ల జర్నీ, విజయ్ సొంత ఊర్లో వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఇప్పుడు తమ లవ్ ను తెలిపేలా సంగీత్ ఫొటోలను రష్మిక షేర్ చేసింది.

సంగీత్ లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ
సంగీత్ లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ

విరోష్ సంగీత్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ లో విరోష్ వెడ్డింగ్ జరిగింది. అంతకంటే ముందు సంగీత్ నిర్వహించారు. ఈ సంగీత్ పిక్స్ ను ఇవాళ (మార్చి 3) రష్మిక మందన్న సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఎంత ముద్దుగున్నారో

రష్మిక మందన్న షేర్ చేసిన ఫొటోల్లో విరోష్ జోడీ ముద్దుగా ఉంది. ఈ పిక్స్ చూస్తుంటేనే విజయ్, రష్మిక మధ్య లవ్ క్లియర్ గా తెలుస్తోంది. తమ మెమోరబుల్ సంగీత్ నైట్ కోసం ఈ జంట స్పెషల్ గా రెడీ అయింది. రాయల్ లుక్ లో విరోష్ జంట మెరిసిపోయింది. సంగీత్ లో వీళ్ల డ్యాన్స్ పోజులు ఆకట్టుకుంటున్నాయి.

మరిదితో డ్యాన్స్

మరిది ఆనంద్ దేవరకొండతోనూ కలిసి రష్మిక మందన్న స్టెప్పులు వేసింది. ఫస్ట్ ఆనంద్ తో కలిసి రష్మిక స్టేజీపైకి వచ్చింది. ఆ తర్వాత తన ప్రేయసి రష్మిక కోసం విజయ్ స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ తర్వాత విజయ్, రష్మిక కలిసి రొమాంటిక్ సాంగ్ కు అదిరిపోయేలా డ్యాన్స్ చేశారు.

ఎమోషనల్ గా

తమ సంగీత్ ఫొటోలు పంచుకుంటూ రష్మిక మందన్న కాస్త ఎమోషనల్ కూడా అయింది.

‘‘లవ్, ఆనంద బాష్పాలు, నవ్వులు, మ్యూజిక్, సింగింగ్ తో ఆ రాత్రి నిండిపోయింది. మేము రాత్రంతా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాం. ఇది నిజంగానే అత్యంత ఫన్ తో కూడిన రాత్రి. నేను, విజ్జు ఒకరికొరం సర్ ప్రైజ్ చేయాలనుకున్నాం.

ఫ్యామిలీ మమ్మల్ని సర్ ప్రైజ్ చేయాలనుకుంది. చివరగా మా కుటుంబాలు డ్యాన్స్ చేయడం చూసి సర్ ప్రైజ్ అయ్యాం. 24.2.26! మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లవ్ మధ్యలో ఆ రాత్రి విజయ్, నేను ఒక్కటిగా డ్యాన్స్ చేశాం’’ అని తన పోస్టులో రష్మిక పేర్కొంది. రష్మిక పోస్టు ప్రకారం విరోష్ సంగీత్ ఫిబ్రవరి 24న జరిగిందని తెలిసింది. వీళ్ల వెడ్డింగ్ రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్ లో జరగనుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More