VIROSH: తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది.. మంచిగ చూసుకోండి.. జంటగా మీ ముందుకు వచ్చాం: విజయ్ దేవరకొండ
Virosh: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత తొలిసారి తెలుగు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. హైదరాబాద్ లో వెడ్డింగ్ రిసెప్షన్ కు ముందు ఈ కొత్త జంట ప్రెస్ తో మాట్లాడటం విశేషం. కొత్త కోడలిని మంచిగ చూసుకోండంటూ విజయ్ చెప్పాడు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Virosh) జంట బుధవారం (మార్చి 4) మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చిందని విజయ్ అనడం.. దానికి రష్మిక సిగ్గు పడటం కొత్తగా అనిపించింది. ఉదయ్‌పూర్ లో పెళ్లి తర్వాత వీళ్లు రోజుకో ఈవెంట్ లో పాల్గొంటూ చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు.

కొత్త కోడలిని బాగా చూసుకోండి: విజయ్
విజయ్, రష్మిక కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో మీడియా వాళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, వాళ్లతో తనకున్న బంధాన్ని విజయ్ నెమరు వేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఇలా మీడియా ముందుకు రావడం కొత్తగా ఉందని చెప్పాడు.
“ఇప్పుడు పెళ్లి చేసుకొని నేను, రష్మిక మీ ముందుకు జంటగా వచ్చాం. ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది. టైమ్ వేగంగా వెళ్తోంది. జీవితం గడిచిపోతోంది. మీరెప్పుడూ నా సొంత ప్రెస్. తెలుగు ప్రెస్ ఎప్పుడూ మా ప్రెస్. మీ బ్లెస్సింగ్స్ కోసం ఇక్కడికి వచ్చాం. తెలుగు స్టేట్స్ కి ఓ కొత్త కోడలు వచ్చింది. మంచిగ చూసుకోండి” అని విజయ్ అనడంతో రష్మిక సిగ్గు పడుతూ అతని వెనక్కి వెళ్లింది.
అటు రష్మిక మాత్రం పెద్దగా మాట్లాడలేదు. ఇప్పటి వరకూ సినిమాల విషయంలో మీ ముందుకు వచ్చేదాన్ని కానీ.. తొలిసారి జీవితంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకొని, పెళ్లి చేసుకొని మీ ఆశీర్వాదం కోసం వచ్చాం అని ఆమె చెప్పింది.
అభిమానులకు విరోష్ విందు
అంతకుముందు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ అభిమానుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయడం విశేషం. తమ పెళ్లి సందర్భంగా ఫ్యాన్స్ కు గుర్తుండిపోయే రిసెప్షన్ ఇచ్చారు. మంగళవారం (మార్చి 3) రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఫ్యాన్స్ కోసం ఈ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో స్వయంగా విజయ్, రష్మిక తమ చేతులతో ఫ్యాన్స్ కు వడ్డించారు.
ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ డిన్నర్ లో విజయ్, రష్మిక మెరిశారు. ప్రతి ఒక్క అభిమానికి వీళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఓ అమ్మాయిని రష్మిక హగ్ చేసుకుంది. ఆ తర్వాత అభిమానులకు విజయ్, రష్మిక కలిసి వడ్డించారు. ఆటోగ్రాఫ్ లు, ఫొటోలు ఇచ్చారు. అనంతరం విజయ్, రష్మిక కూడా వాళ్లతో కలిసి భోజనం చేశారు. రష్మిక తన భర్త విజయ్ కు ప్రేమతో తినిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

E-Paper












