Rashmika Mandanna Mangalsutra: మెడలో మంగళసూత్రం, విజయ్ చేతిలో చేయి వేసి నడిచిన రష్మిక.. వీడియో వైరల్

పెళ్లయిన తర్వాత తొలిసారి సాంప్రదాయబద్ధంగా కనిపించి అభిమానులను అలరించింది కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న(Rashmika Mandanna Mangalsutra). విజయ్ దేవరకొండ సొంత ఊరు తుమ్మనపేటలో జరిగిన వేడుకల్లో మంగళసూత్రం, సింధూరంతో మెరిసిపోతున్న రష్మిక ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: Mar 3, 2026, 20:04:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రస్తుతం పెళ్లి తర్వాతి ఆచారాల్లో బిజీగా ఉన్నారు. ఈ వారం తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా, తుమ్మనపేట గ్రామంలోని విజయ్ సొంత ఇంటికి ఈ జంట చేరుకుంది. అక్కడ జరిగిన వేడుకల్లో రష్మిక పక్కా తెలుగింటి కోడలిలా కనిపించి అందరినీ ఆకట్టుకుంది.

Rashmika Mandanna Mangalsutra: మెడలో మంగళసూత్రం, విజయ్ చేతిలో చేయి వేసి నడిచిన రష్మిక.. వీడియో వైరల్
Rashmika Mandanna Mangalsutra: మెడలో మంగళసూత్రం, విజయ్ చేతిలో చేయి వేసి నడిచిన రష్మిక.. వీడియో వైరల్

ట్రెడిషనల్ లుక్‌లో ‘విరోష్’

విజయ్ దేవరకొండ సొంతూరు తుమ్మనపేట గ్రామంలో జరిగిన పూజా కార్యక్రమాల అనంతరం ఈ జంట మీడియా కంట పడింది. రష్మిక ఎరుపు రంగు బోర్డర్ ఉన్న బీజ్ కలర్ ప్రింటెడ్ చీరలో, మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరం ధరించి నిఖార్సైన పెళ్లికూతురిలా మెరిసిపోయారు.

విజయ్ దేవరకొండ తెల్లటి ఫ్లోరల్ ప్రింట్ కుర్తా, పైజామా ధరించి ఎంతో క్లాసీగా కనిపించాడు. తమ కొత్త ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం, గృహప్రవేశం పూర్తి చేసుకున్న ఈ జంట.. గ్రామస్థుల నడుమ ఎంతో సంతోషంగా గడిపారు.

గ్రామస్థుల ఘన స్వాగతం

విజయ్, రష్మికలు తమ గ్రామానికి రావడంతో తుమ్మనపేటలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు మేళతాళాలతో, సంగీతంతో ఈ నూతన దంపతులకు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ఈ జంట హైదరాబాద్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనుబంధ ఆలయాన్ని సందర్శించి భక్తులకు స్వయంగా స్వీట్లు పంపిణీ చేశారు. సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ వారు జరుపుకుంటున్న ఈ వేడుకలు అభిమానుల్లో వారిపై గౌరవాన్ని మరింత పెంచుతున్నాయి.

రేపే గ్రాండ్ రిసెప్షన్

పెళ్లి వేడుకల ముగింపు ఘట్టంగా మార్చి 4న (బుధవారం) హైదరాబాద్‌లో భారీ ఎత్తున రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. భారీ సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఈ వేడుకను కేవలం ఆహ్వానితులకు మాత్రమే పరిమితం చేశారు. దీనికోసం ఒకేసారి పని చేసే ఓ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం విశేషం. కేవలం ఇన్విటేషన్ ఉన్న వారికి మాత్రమే అనుమతించనున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More