వదినకు వెల్‌కమ్ చెప్పిన ఆనంద్ దేవరకొండ.. వాళ్లు అడిగిన ప్రశ్నకు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదంటూ పోస్ట్

తన వదిన రష్మిక మందన్నను వెల్కమ్ చెప్పాడు ఆనంద్ దేవరకొండ. అతడు చేసిన ఓ స్వీట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. అన్న, వదిన ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని అతడు వాళ్లకు విషెస్ చెప్పాడు.

Published on: Feb 26, 2026, 21:30:45 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ, ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న పెళ్లి పీటలెక్కారు. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై నడుస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని విజయ్ తమ్ముడు, నటుడు ఆనంద్ దేవరకొండ కొత్త జంట ఫోటోను షేర్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

వదినకు వెల్‌కమ్ చెప్పిన ఆనంద్ దేవరకొండ.. వాళ్లు అడిగిన ప్రశ్నకు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదంటూ పోస్ట్
వదినకు వెల్‌కమ్ చెప్పిన ఆనంద్ దేవరకొండ.. వాళ్లు అడిగిన ప్రశ్నకు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదంటూ పోస్ట్

‘వదిన.. ఎలా ఉన్నారు?’ అని అడిగేవారు

తన పోస్ట్‌లో ఆనంద్ దేవరకొండ గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. “గతంలో చాలా సందర్భాల్లో అభిమానులు నన్ను కలిసినప్పుడు ‘వదిన ఎలా ఉన్నారు?’ అని అడిగేవారు. అప్పట్లో ఆ ప్రశ్నకు ఎలా స్పందించాలో నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఈరోజు నా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత సానుకూల దృక్పథం, కరుణ కలిగిన వ్యక్తి నాకు వదినగా రావడం చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ జీవితాంతం ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. వెల్‌కమ్ టు ది ఫ్యామిలీ వదిన” అంటూ ఆనంద్ ఎమోషనల్ అయ్యాడు.

సంప్రదాయబద్ధంగా వివాహ వేడుక

ఉదయ్‌పూర్‌లోని లగ్జరీ రిసార్ట్ ‘ఐటీసీ గ్రాండ్ భారత్’ రిసార్ట్ లో విజయ్, రష్మిక వివాహం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో రెండు రాష్ట్రాల (తెలంగాణ, కర్ణాటక) సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి. ఉదయాన్నే గణేష్ పూజ, తెలుగు వారి అంగవస్త్రం ధరించే ఆచారంతో వేడుకలు మొదలయ్యాయి. ఆ తర్వాత రష్మిక కుటుంబ సంప్రదాయం ప్రకారం ‘కొడవ’ రీతిలో కూడా కొన్ని క్రతువులు నిర్వహించారు.

పెళ్లి మండపంలో విజయ్ ఐవరీ సిల్క్ వేష్టి, అంగవస్త్రంలో మెరిసిపోగా.. రష్మిక కాంచీవరం పట్టుచీరలో ధగధగలాడిపోయింది. బంతిపూలు, మల్లెపూల అలంకరణ మధ్య ఈ జంట మంగళసూత్ర ధారణతో ఒకటయ్యారు.

నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు నా భార్య: విజయ్ దేవరకొండ

పెళ్లి తర్వాత రష్మిక తన ఆనందాన్ని పంచుకుంటూ.. “విజయ్ నాకు నిజమైన ప్రేమ అంటే ఏంటో నేర్పించారు. నేను అనుకున్న స్థాయికి చేరడానికి నిరంతరం అండగా నిలిచారు. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది” అని పేర్కొంది.

మరోవైపు విజయ్ స్పందిస్తూ.. “నా రోజువారీ జీవితంలో, వర్కవుట్స్‌లో, భోజన సమయంలో.. ఇలా ప్రతిక్షణం రష్మిక లేని లోటు నాకు తెలిసేది. తన రాకతో నా జీవితంలో ప్రశాంతత నెలకొంది. నా బెస్ట్ ఫ్రెండ్‌ను భార్యగా పొందడం నా అదృష్టం” అంటూ తన ప్రేమను చాటుకున్నాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More