Ananya Panday: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని గంటలుగా ఒక వీడియో క్లిప్ విపరీతంగా హల్చల్ చేస్తోంది. 'చాంద్ మేరా దిల్' మూవీలో హీరో లక్ష్య (Lakshya) ఎంతో ఆశ్చర్యంగా చూస్తుండగా.. నటి అనన్యా పాండే స్టేజ్ పైన భరతనాట్యం ఫ్యూజన్ డ్యాన్స్ ప్రదర్శిస్తుంది.

సినిమాలో హీరో ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయిపోయినట్లు చూపించినప్పటికీ, బయట రియల్ లైఫ్‌లో మాత్రం నెటిజన్లు, ముఖ్యంగా క్లాసికల్ డ్యాన్స్ ఆర్టిస్టులు ఈ సీన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఆ సీన్ ఏంటి?
ఈ సినిమాలో అనన్యా పాండే 'చాందిని' అనే పాత్రను పోషించింది. కథ ప్రకారం ఆమె ఒక భరతనాట్యం డ్యాన్సర్ (చారు శంకర్) కూతురు. అయితే ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ సమయంలో సంప్రదాయ భరతనాట్యానికి బదులుగా.. ఆమె భరతనాట్యాన్ని హిప్-హాప్, లాకింగ్ స్టెప్పులతో మిక్స్ చేసి ఒక ఫ్యూజన్ డ్యాన్స్ రూపంలో ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇదొక హాట్ టాపిక్‌గా మారింది.
‘నటరాజ స్వామి కూడా బాధపడుతుంటాడు’
ప్రముఖ నృత్యకారిణి, ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత అనితా ఆర్ రత్నం (Anita R Ratnam) ఎక్స్ వేదికగా అనన్య డ్యాన్స్‌పై అత్యంత ఘాటుగా స్పందించారు.
"ఈ క్లిప్ చూస్తుంటే భరతనాట్యం రూపాన్ని ఎవరో బందీగా మార్చి ఘోరంగా అవమానించినట్లు అనిపించింది. చేతులు విసిరేయడం, విచిత్రమైన కెమెరా కదలికల మధ్య అసలైన నృత్యం మూటముల్లే సర్దుకుని థియేటర్ నుండి బయటకు వెళ్ళిపోయింది. భరతనాట్యం అనేది సాంకేతికత, నియంత్రణ, సంప్రదాయం, జామెట్రీ, సంగీత పరిజ్ఞానం, భావోద్వేగాల కలయిక. కానీ ఈ సీన్ చూస్తుంటే ఏదో చిన్నపాటి భూకంపం వస్తున్నప్పుడు పెళ్లి సంగీత్‌లో డ్యాన్స్ చేసినట్లు ఉంది. ఇందులో 'అడవుస్' (Adavus - భరతనాట్య ప్రాథమిక అడుగులు) అనేవి ఆప్షనల్ కాదు. ఇదొక అల్గారిథమిక్ పానిక్ కొరియోగ్రఫీ.. ఆ నటరాజ స్వామి కూడా ఈ ఘోరానికి బాధపడుతుంటాడు" అని ఘాటుగా విమర్శించారు.
మరీ ఇంత చిన్న చూపా?
మరో ప్రసిద్ధ నృత్యకారిణి కృతిక శివస్వామి కూడా ఈ విషయమై స్పందిస్తూ, "బాలీవుడ్‌కు మన సాంప్రదాయ కళలపై ఎంత నిర్లక్ష్యం, అగౌరవం ఉందో అనన్యా పాండే 'భరతనాట్యం' నిరూపించింది. భారతదేశంలో ఇలా శాస్త్రీయ కళలను అవహేళన చేసేవారిపై కేసు వేసే చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరం. అందుకే ఎవరైనా వచ్చి ఇలాంటి చెత్త ప్రయోగాలు చేస్తున్నారు" అని తీవ్రంగా మండిపడ్డారు.
అనన్య అద్భుతంగా చేసింది: కొరియోగ్రాఫర్ సమర్థన
{{/usCountry}}మరో ప్రసిద్ధ నృత్యకారిణి కృతిక శివస్వామి కూడా ఈ విషయమై స్పందిస్తూ, "బాలీవుడ్‌కు మన సాంప్రదాయ కళలపై ఎంత నిర్లక్ష్యం, అగౌరవం ఉందో అనన్యా పాండే 'భరతనాట్యం' నిరూపించింది. భారతదేశంలో ఇలా శాస్త్రీయ కళలను అవహేళన చేసేవారిపై కేసు వేసే చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరం. అందుకే ఎవరైనా వచ్చి ఇలాంటి చెత్త ప్రయోగాలు చేస్తున్నారు" అని తీవ్రంగా మండిపడ్డారు.
అనన్య అద్భుతంగా చేసింది: కొరియోగ్రాఫర్ సమర్థన
{{/usCountry}}శాస్త్రీయ నృత్యకారుల నుండి ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ, ఈ సినిమాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన అనన్య ఆర్ కురుప్ మాత్రం అనన్యా పాండేకు మద్దతుగా నిలిచారు. షూటింగ్‌కు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ (BTS) ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఆమె ఇలా రాసుకొచ్చారు..
"అనన్యా పాండే చాలా స్వీట్ పర్సన్. తనకు భరతనాట్యం నేర్పించడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. చాంద్ మేరా దిల్ సినిమాలో ఆమె ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌ను ఎంతో అద్భుతంగా చేసింది" అని అన్నారు.
ఈ పోస్ట్‌కు నటి అనన్యా పాండే కూడా స్పందిస్తూ లవ్ ఎమోజీలను రిప్లైగా ఇచ్చింది. వివేక్ సోని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 22న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ సమీక్షలను అందుకుంటోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'చాంద్ మేరా దిల్' సినిమాలో వివాదాస్పదమైన సీన్ ఏంటి?
ఈ సినిమాలో హీరోయిన్ అనన్యా పాండే సంప్రదాయ భరతనాట్యాన్ని హిప్-హాప్, లాకింగ్ స్టెప్పులతో కలిపి ఒక 'ఫ్యూజన్ డ్యాన్స్' చేస్తుంది. ఈ స్టెప్పులు శాస్త్రీయ నృత్య రూపానికి విరుద్ధంగా ఉన్నాయంటూ వివాదం రేగింది.
2. అనన్యా పాండే డ్యాన్స్‌పై నృత్యకారిణి అనితా రత్నం ఏమని విమర్శించారు?
ఇది భరతనాట్యాన్ని బందీగా ఉంచినట్లు ఉందని, చిన్నపాటి భూకంపం వస్తున్నప్పుడు పెళ్లి సంగీత్‌లో డ్యాన్స్ చేసినట్లు ఈ సీన్ ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ఇది కళను అవహేళన చేయడమేనని పేర్కొన్నారు.
3. చాంద్ మేరా దిల్ సినిమా దర్శకుడు, నిర్మాత ఎవరు?
ఈ చిత్రానికి వివేక్ సోని దర్శకత్వం వహించగా, కరణ్ జోహార్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'ధర్మ ప్రొడక్షన్స్' దీనిని నిర్మించింది.