మీ ఫ్లో చూస్తుంటే యాక్షన్, కట్ కూడా మీరే చెప్పేస్తారేమో.. నేనింకా పేపర్ మీద పెన్ను కూడా పెట్టలేదు: అనిల్ రావిపూడి ట్వీట్
డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీ టైటిల్ ఏంటన్నదానిపై నెలకొన్న తాజా బజ్ కు అతడు తెరదించాడు. అతని సినిమా టైటిల్ ఇదీ అంటూ వస్తున్న వార్తలను ఖండిస్తూ.. మంగళవారం (ఫిబ్రవరి 10) అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
వరుసగా రెండు సంక్రాంతులకు రెండు బ్లాక్‌బస్టర్లు అందించిన అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి మరో మూవీని రెడీ చేయబోతున్నాడు. అయితే ఈ మూవీ గురించి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. సినిమాకు శ్రీమతి లలితా రెడ్డి అనే టైటిల్ పెట్టినట్లు పుకార్లు వచ్చాయి. దీనిపై అనిల్ స్పందిస్తూ.. తనదైన స్టైల్లో వాటిని ఖండించాడు.
మీ ఫ్లో చూస్తుంటే యాక్షన్, కట్ కూడా మీరే చెప్పేస్తారేమో.. నేనింకా పేపర్ మీద పెన్ను కూడా పెట్టలేదు: అనిల్ రావిపూడి ట్వీట్
త్వరలోనే పూర్తి నిజమైన వివరాలు ఇస్తా..
అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీలో వెంకటేశ్, ఫహాద్ ఫాజిల్ నటించబోతున్నారని, ఈ సినిమా పేరు శ్రీమతి లలితా రెడ్డి అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై అనిల్ స్పందిస్తూ.. మంగళవారం (ఫిబ్రవరి 11) చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అభిమానుల ఫ్లో చూస్తుంటే యాక్షన్, కట్ కూడా వాళ్లే చెప్పేసేలా ఉన్నారని అనడం విశేషం.
“నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా .. నటీనటులు, కథ, టైటిల్ కూడా పెట్టేసారు.. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్.. కట్ కూడా చెప్పేస్తారేమో.. మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను.. అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో.. నిజమైన పూర్తి వివరాలు.. మీకు అందిస్తాం” అని ట్వీట్ చేశాడు. దీనికి బ్రహ్మానందం తల గోక్కొంటూ ఏంటో అనుకునే ఓ చిన్న క్లిప్ కూడా జోడించడం విశేషం.
అనిల్ రావిపూడి కెరీర్ ఇలా..
తెలుగులో ఇప్పటి వరకూ ఓటమెరగని డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. అతడు తీసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర విఫలం కాలేదు. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల విషయంలో అతనికి తిరుగు లేదని తాజాగా చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారుతో నిరూపితమైంది.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించి సుమారు రూ.400 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇప్పుడీ సినిమా బుధవారం (ఫిబ్రవరి 11) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. దీనికి ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మూవీ ఓటీటీ ప్రమోషన్లను కూడా అనిల్ మొదలుపెట్టాడు. తన మార్క్ ఫన్నీ ప్రమోషన్లు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలను జీ5 ఓటీటీ ట్వీట్ చేసింది.