సినిమా హీరోగా అనిల్ రావిపూడి.. డాలర్ నోట్ అడ్వాన్స్‌గా ఇచ్చిన అలీ.. లాస్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన డైరెక్ట‌ర్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కటౌట్ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదు. పైగా డ్యాన్స్ లు కూడా అదరగొట్టేస్తాడు అనిల్. అందుకే అతణ్ని హీరోగా చూడాలనుకునే వర్గం కూడా ఉంది. తాజాగా అనిల్ హీరోగా మూవీ చేసేందుకు అలీ అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. కానీ లాస్ట్ లో అనిల్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు.

Published on: Feb 7, 2026, 19:46:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇప్పటివరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ అనిల్ రావిపూడి. వరుసగా 9 హిట్లు కొట్టాడు. రీసెంట్ గా మన శంకర వర ప్రసాద్ గారుతో ఈ 2026 సంక్రాంతికి మరో సూపర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ జర్నీ చేస్తున్న అనిల్ రావిపూడి హీరోగానూ చేయాలనే కామెంట్లు ఎప్పటినుంచో వస్తున్నాయి. తాజాగా అనిల్ హీరోగా చేసే సినిమా కోసం అలీ ఓ అమెరికా డాలర్ నోటు అడ్వాన్స్ గా ఇచ్చాడు.

అనిల్ రాావిపూడి, అలీ
అనిల్ రాావిపూడి, అలీ

హీరోగా అనిల్ రావిపూడి

డైరెక్టర్ గా ఎదురులేని అనిల్ రావిపూడి హీరోగానూ యాక్ట్ చేయాలనే అభిప్రాయాలు ఎప్పటి నుంచి వినిపిస్తున్నాయి. కానీ డైరెక్షన్ పైనే పూర్తి కాన్సట్రేషన్ పెట్టిన అనిల్.. హీరో అనే బరువు ఎత్తుకోవడానికి రెడీగా లేడు. కానీ ఇవాళ (ఫిబ్రవరి 7) జరిగిన సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో అనిల్ ను లాక్ చేశారు.

అలీ అడ్వాన్స్

సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు అనిల్ రావిపూడి గెస్ట్ గా వచ్చాడు. స్టేజీపైన ఉన్న సీనియర్ కమెడియన్ అలీ, శివాజీ, ధన్ రాజ్ లాంటి వాళ్లందరూ కలిసి అనిల్ రావిపూడిని హీరోగా చేయాలని అడిగారు. అందుకు అలీ అడ్వాన్స్ కూడా ఇస్తానన్నారు. వెంటనే తన పర్స్ లో నుంచి అమెరికా డాలర్ నోట్ తీసి అనిల్ కు ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆ ట్విస్ట్

హీరోగా సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకున్న అనిల్ రావిపూడి లాస్ట్ లో ఓ ట్విస్ట్ ఇచ్చాడు. సినిమా చేస్తాను కానీ హీరోగా మాత్రం కాదని క్లారిటీనిచ్చాడు. ‘మీరు ఇచ్చిన ఈ డాలర్ నోటు కోసం మీకు ఓ సినిమా చేసి పెడతా’ అని అలీతో అనిల్ రావిపూడి అన్నాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా నవ్వేశారు.

జాగ్రత్తగా మాట్లాడతానని

సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాలో శివాజీ, లయ హీరోహీరోయిన్లు. ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ‘‘శివాజీ గారు నాకు కాల్ చేశారు. సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు రావాలన్నారు. నేను సరేనన్నా. ‘అంటే మొన్ననే కదా దండోరా ఈవెంట్ కు వచ్చారు. అలా కాకుండా ఈ సారి జాగ్రత్తగా మాట్లాడతా’ అని శివాజీ అన్నారు’’ అని అనిల్ చెప్పాడు.

శివాజీ వివాదం

దండోరా మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు శివాజీ కామెంట్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. హీరోయిన్ల బట్టల గురించి మాట్లాడుతూ అలాంటి దుస్తులు వేసుకోవద్దని చెప్పడమే కాకుండా ‘సామాన్లు’, ‘దొంగము**డా’ అనే అసభ్యకరమైన పదాలు వాడారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మహిళా కమిషన్ కు శివాజీ సమాధానం కూడా చెప్పుకోవాల్సి వచ్చింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More