25 రోజుల్లోనే స్క్రిప్ట్ పూర్తి చేశా.. మీ అందరికీ చాలా గట్టిగా దొరికా.. మీకోసం చిప్పకూడు తినడానికి రెడీ: అనిల్ రావిపూడి

సంక్రాంతికి మరో బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనను రాజమౌళితో పోల్చడంపై స్పందించడంతోపాటు నాగార్జునతో మూవీ తీయబోతున్నాడన్న వార్తలపైనా అతడు మాట్లాడాడు.

Jan 14, 2026, 08:57:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో బ్లాక్‌బస్టర్ అందించాడు. ఈ సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో ఈ డైరెక్టర్ రేంజ్ మరో లెవెల్ కు వెళ్లింది. తాజాగా మూవీ సక్సెస్ మీట్ లో అతడు మీడియాతో మాట్లాడాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలు ఇస్తూ అనిల్ నవ్వించాడు.

25 రోజుల్లోనే స్క్రిప్ట్ పూర్తి చేశా.. మీ అందరికీ చాలా గట్టిగా దొరికా.. మీకోసం చిప్పకూడు తినడానికి రెడీ: అనిల్ రావిపూడి (x/Shine_Screens)
25 రోజుల్లోనే స్క్రిప్ట్ పూర్తి చేశా.. మీ అందరికీ చాలా గట్టిగా దొరికా.. మీకోసం చిప్పకూడు తినడానికి రెడీ: అనిల్ రావిపూడి (x/Shine_Screens)

చిరంజీవి వల్లే అంత త్వరగా..

మన శంకరవరప్రసాద్ గారు మూవీ స్క్రిప్ట్ ను తాను కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేసినట్లు అనిల్ రావిపూడి చెప్పాడు. తన కెరీర్లో అత్యంత వేగంగా పూర్తి చేసిన స్క్రిప్ట్ ఇదేనని తెలిపాడు. చిరులో ఉన్న లక్షణాలనే ఊహించుకుంటూ తాను కథ సిద్ధం చేశానని, దీంతో స్క్రిప్ట్ పూర్తి చేయడానికి పెద్దగా టైమ్ పట్టలేదని చెప్పాడు. ఈ సినిమా కోసం చిరంజీవి 85 రోజుల పాటు షూట్ చేశాడని వెల్లడించాడు.

ఇళయరాజాను అడిగాం.. ఓకే అన్నాడు

ఈ సినిమాలో దళపతి మూవీలో సుందరి పాటను వాడటంపైనా అనిల్ స్పందించాడు. తన పాటలను సినిమాల్లో వాడుకోవడం చాలా కఠినంగా ఉండే ఇళయరాజా.. ఈ సినిమాకు ఎలా అంగీకరించాడని అడగ్గా.. తాము వెళ్లి అడిగితే ఆయన ఓకే చెప్పారని అన్నాడు. ఆ పాట ఈ సినిమాలో వాడటం, అది కూడా చిరంజీవి, నయనతార లవ్ ట్రాక్ లో కావడం తన కెరీర్లోనే ఓ బెస్ట్ ఎపిసోడ్ అని అనిల్ చెప్పాడు.

ఆడవాళ్ల కోసం చిప్పకూడు తినడానికి రెడీ

ఇక ఈ సినిమాలో చిరంజీవితో ఆడవాళ్ల కోసం చేసిన చట్టాలతో మగవాళ్ల ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఓ డైలాగ్ చెప్పించడంపై ఓ లేడీ రిపోర్టర్ స్పందించారు. ఆడవాళ్లంతా కలిసి మీపై కేసు పెట్టాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు. దీనికి ఫన్నీగా స్పందించిన అనిల్.. మీకోసం జైలుకెళ్లడానికి రెడీ, చిప్పకూడు తినడానికి రెడీ, ఉరిశిక్షకైనా రెడీ అంటూ తనదైన స్టైల్లో జోక్ వేశాడు. ఏదో సరదాగా పెట్టిన సీన్ ఇది అని, ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతింటే ఏం జరుగుతుందో తెలుసు అని అతడు అన్నాడు.

గట్టిగా దొరికేశా

గత కొన్ని రోజులుగా తనపై జరుగుతున్న ట్రోలింగ్ పైనా అనిల్ స్పందించాడు. ఎక్కడ దొరుకుతాడా అని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారని, ఇప్పుడు గట్టిగా దొరికేశానని అన్నాడు. అయితే అది ప్రేక్షకులకు అని అనిల్ చమత్కరించాడు. టికెట్లు కొని మూవీని చూస్తూ బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులకు మరోసారి దొరికిపోయానని అనిల్ అన్నాడు.

రాజమౌళితో పోలికపై..

నిలకడగా హిట్స్ అందిస్తూ టాలీవుడ్ లో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడిని రాజమౌళితో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీనిపై అతన్ని స్పందించమని కోరగా.. రాజమౌళితో పోల్చడం తన అదృష్టమని, అలా అని తనతో పోల్చి తన స్థాయిని పెంచుకోవడానికో, రాజమౌళి స్థాయిని తక్కువ చేయడానికో తనకు ఇష్టం లేదని చెప్పాడు. నాగార్జునతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, మరోసారి సంక్రాంతికే రావాలని ఉందని కూడా అనిల్ స్పష్టం చేశాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More