ఫ్లాప్ తెలియ‌ని డైరెక్ట‌ర్‌-వ‌రుస‌గా తొమ్మిదో సూప‌ర్ హిట్‌-సంక్రాంతికి రిలీజైన అనిల్ రావిపూడి సినిమాలేవో తెలుసా?

టాలీవుడ్ లో ఫ్లాప్ అన్నదే తెలియని డైరెక్టర్లు అతి కొద్దిమంది మాత్రమే. ఇందులో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకరు. అతని ఖాతాలో అపజయమన్నదే లేదు. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారుతో వరుసగా తొమ్మిదో విక్టరీ కొట్టాడు అనిల్. సంక్రాంతికి రిలీజైన అనిల్ సినిమాలేవో చూసేయండి.  

Published on: Jan 12, 2026, 20:33:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏంటీ బాసు సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి.. ఇదీ మన శంకర వరప్రసాద్ గారు మూవీలోని సాంగ్ లిరిక్స్. ఇందుకు తగ్గట్లే డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతికి అదరగొట్టాడు. చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరూ ఫ్లాప్ అన్నదే లేని రికార్డును కొనసాగించాడు. సంక్రాంతికి వచ్చిన అనిల్ రావిపూడి సినిమాలేవో ఇక్కడ చూసేయండి.

అనిల్ రావిపూడి (x/AnilRavipudi)
అనిల్ రావిపూడి (x/AnilRavipudi)

వరుసగా 9

అనిల్ రావిపూడి కెరీర్ లో ఇప్పటివరకూ ఫ్లాప్ అన్నదే లేదు. 2015లో పటాస్ సినిమాతో స్టార్ట్ చేసి 2026లో మన శంకర వరప్రసాద్ గారు వరకు తొమ్మిది సినిమాలను డైరెక్ట్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ 9 మూవీస్ కూడా హిట్లే. ఒక్క ఫ్లాప్ కూడా లేదు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్.. ఇలా 9 సూపర్ హిట్లు అందుకున్నాడు అనిల్.

అనిల్ సంక్రాంతి సినిమాలు

ఇక సంక్రాంతి పండగకు రావడం హిట్ కొట్టడం అనిల్ రావిపూడికి అలవాటుగా మారింది. ఇప్పటివరకూ మొత్తం నాలుగు సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేశాడు అనిల్ రావిపూడి. అవే ఎఫ్2 (2019), సరిలేరు నీకెవ్వరు (2020), సంక్రాంతికి వస్తున్నాం (2025), మన శంకర వరప్రసాద్ గారు (2026). ఇప్పుడు వరుసగా సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారుతో బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతి హిట్లు కొట్టాడు.

ఫ్యాన్ పల్స్

అనిల్ రావిపూడి మేకింగ్ స్టైలే వేరు. ఫస్ట్ మూవీ పటాస్ నుంచి కూడా ఆయన కామెడీ యాంగిల్ వదల్లేదు. కామెడీకి ఫ్యామిలీ ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి హిట్లు అందుకుంటున్నాడు. ఆడియన్స్ కు కావాల్సింది ఫుల్ ఎంటర్ టైన్మెంట్. ఆ పల్స్ పట్టుకుని వరుసగా హిట్లు సాధిస్తున్నాడు. అనిల్ సినిమాకు వెళ్తే ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ అనే పేరు సంపాదించుకున్నాడు.

స్పీడ్ కు ఫిదా

అనిల్ రావిపూడి స్పీడ్ వేరే లెవల్. స్టోరీ రాసుకోవడం, హీరోను సెట్ చేసుకోవడం, మెరుపు వేగంతో షూటింగ్ కంప్లీట్ చేయడం అనిల్ స్టైల్. అందుకే 11 ఏళ్ల కెరీర్ లో 9 సినిమాలు తీశాడు. ఆయన సినిమా టేకింగ్ లో పెద్దగా రిస్క్ ఉండదు. ఆయా హీరోలను జనాలు ఎలా చూడాలనుకుంటున్నారు? వాళ్లతో మూవీ ఎలా తీస్తే నచ్చుతుందో అనిల్ కు బాగా తెలుసు.

అందుకే వెంకటేష్ లోని కామెడీ టైమింగ్ ను పట్టుకుని ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం హిట్లు అందుకున్నాడు అనిల్. ఇక భగవంత్ కేసరిలో బాలయ్య యాక్షన్ తో అదరగొట్టేలా చేశాడు. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి కామెడీ, డ్యాన్స్, ఫైట్లను ఫ్యాన్స్ కు నచ్చేలా తీశాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More