Annamayya Song: ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేజీపై మార్మోగిన అన్న‌మ‌య్య కీర్త‌న‌-బ్ర‌హ్మ‌మొక్క‌టే పాట‌కు గూస్ బంప్స్‌-వీడియో వైర‌ల్

Annamayya Song: ఇంటర్నేషనల్ స్టేజీపై మరోసారి తెలుగు సంకీర్తన మార్మోగింది. అన్నమాచార్చుల ప్రముఖ కీర్తన ‘బ్రహ్మమొక్కటే’ అంతర్జాతీయ వేదికపై గూస్ బంప్స్ తెప్పించింది. స్విట్జర్లాండ్ లో జరిగిన మూవీ ఫెస్టివల్ లో ఈ పాటను ఎలాంటి ఇన్ స్ట్రుమెంట్స్ వాయించకుండా ఫారెన్ టీమ్ పాడటం విశేషం. ఈ వీడియో వైరలవుతోంది.

Published on: Nov 28, 2026, 16:29:47 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Annamayya Song: తెలుగు పాటలు, భక్తి కీర్తనలు ఇంటర్నేషనల్ స్టేజీపై వింటే కలిగే కిక్కే వేరు. మన పాట గొప్పతనం ప్రపంచానికి చాటితే వచ్చే ఆనందమే వేరు. ఇప్పుడు తెలుగు జనాలు మరోసారి అలాంటి అనుభూతికే లోనవుతున్నారు. అన్నమాచార్య కీర్తన ఇంటర్నేషనల్ స్టేజీపై మార్మోగడమే ఇందుకు కారణం.

ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేజీపై మార్మోగిన అన్న‌మ‌య్య కీర్త‌న‌-బ్ర‌హ్మ‌మొక్క‌టే పాట‌కు గూస్ బంప్స్‌-వీడియో వైర‌ల్
ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేజీపై మార్మోగిన అన్న‌మ‌య్య కీర్త‌న‌-బ్ర‌హ్మ‌మొక్క‌టే పాట‌కు గూస్ బంప్స్‌-వీడియో వైర‌ల్

స్విట్జర్లాండ్ లో

అన్నమయ్య కీర్తనల్లో ‘బ్రహ్మమొక్కటే’ పాటకు ఉన్న ప్రాముఖ్యత వేరు. ఆ పాటకు ఉన్న ప్రాధాన్యత వేరు. ఎవరైనా సరే మామూలుగా ఈ వింటేనే పులకించిపోతారు. ఇక ఇంటర్నేషనల్ స్టేజీపై వింటే ఏ లెవల్ లో ఫీల్ అవుతారో ఊహించుకోవచ్చు.

తాజాగా స్విట్జర్లాండ్ లో సాల్జ్ బర్ట్ ఫెస్టివల్ 2026 జరిగింది. ఈ ఫెస్టివల్ లోనే శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన అమెరికన్ పాపులర్ మ్యూజిక్ గ్రూప్ ‘చాంటిక్లియర్’ ఈ బ్రహ్మమొక్కటే పాటను ఆలపించారు.

తెలుగు సంతతి కుర్రాడు

చాంటిక్లియర్ అనేది ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ మ్యూజిక్ గ్రూప్. ఈ గ్రూప్ గ్రామీ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడు బ్రహ్మమొక్కటే గీతాన్ని ఆలపించిన ఈ గ్రూప్ లో మెయిన్ సింగర్ గా ఉన్న వినీల్ గరిసా తెలుగు సంతతి యువకుడే. వాళ్ల పేరేంట్స్ ఎప్పుడో అమెరికాలో సెటిల్ అయ్యారని తెలిసింది. వినీల్ అక్కడే పుట్టి పెరిగాడు.

గూస్ బంప్స్ వీడియో

బ్రహ్మమొక్కటే అనే అన్నమాచార్యుల గీతాన్ని సంగీతంతో కలిపి వింటే చెవుల విందుగా ఉంటుంది. అలాంటిది చాంటిక్లియర్ గ్రూప్ ఎలాంటి మ్యూజిక్ లేకుండా మరీ ఈ గీతాన్ని ప్రదర్శించారు. అయినా కూడా గూస్ బంప్స్ వచ్చాయంటే అతిశయోక్తి కాదు. సంప్రదాయ కర్ణాటక సంగీత శైలిలో కాకుండా.. ఫారెన్ లో పాపులర్ అయిన ‘అకాపెల్లా’ స్టైల్ లో ఈ పాట పాడారు.

అకాపెల్లా అంటే పాట పాడేటప్పుడు ఎలాంటి మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్స్ యూజ్ చేయరు. చప్పట్లు, నోటితోనే విభిన్న స్వరాలు వచ్చేలా సౌండ్లు చేస్తూ పాటను పాడతారు. ఇప్పుడు ఈ అన్నమాచార్య సంకీర్తనను కూడా అలాగే పాడారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

చిన్నప్పుడు కార్లో విన్న పాట

చాంటిక్లియర్ గ్రూప్ లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మూలాలు ఉన్న సింగర్ గా ఇప్పటికే వినీల్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక చిన్నప్పుడు అమ్మానాన్నలతో కార్లో వెళ్తూ విన్న పాటలే తన సంగీత ప్రయాణానికి బాటలు వేశాయని వినీల్ చెప్పుకొచ్చాడు. తన గ్రూప్ తో కలిసి బ్రహ్మమొక్కటే గీతాన్ని పాడటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.