Maatrubhumi Trailer: తెలంగాణ అమరవీరుడి స్ఫూర్తితో సినిమా.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న సల్మాన్ ఖాన్ మాతృభూమి ట్రైలర్!
Maatrubhumi Trailer: గాల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాటంలో వీర మరణం పొందిన తెలంగాణ సైనికుడు సంతోష్ బాబు స్ఫూర్తితో సల్మాన్ ఖాన్ మూవీ రాబోతుంది. సల్మాన్ ఖాన్ హీరోగా మాతృభూమి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా.
Maatrubhumi Trailer: టైటిల్ మార్చుకొని, ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతుందనే ప్రచారాన్ని దాటుకొని థియేటర్లకు వచ్చేందుకు సల్మాన్ ఖాన్ మాతృభూమి మూవీ రెడీ అవుతోంది. తెలంగాణ అమరవీరుడు, మహా వీర చక్ర సంతోష్ బాబు కథతో స్ఫూర్తి పొంది ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది.

మాతృభూమి ట్రైలర్
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' ట్రైలర్ రిలీజైంది. మంగళవారం (నవంబర్ 10) రాత్రి ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. భారత్-చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్.. యుద్ధం వల్ల కలిగే నష్టాలను, సైనికులు, వారి కుటుంబాల ఎమోషన్స్ ను కళ్లకు కట్టినట్లు చూపించింది. కేవలం శత్రువుల మీద పోరాటమే కాదు, శాంతిని నెలకొల్పడమే అసలైన దేశభక్తి అని ఈ ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు.
గాల్వాన్ లోయ నేపథ్యంలో
2020లో తూర్పు లద్ధాఖ్ లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా మాతృభూమి సినిమాను తెరకెక్కించారు. ఇందులో 16 బీహార్ రెజిమెంట్ కు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు స్ఫూర్తితో రూపొందించిన పాత్రలో సల్మాన్ ఖాన్ నటించారు. ఫస్ట్ ఈ మూవీకి ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే టైటిల్ పెట్టారు. ఆ తర్వాత ఛేంజ్ చేశారు.
యాక్షన్, ఎమోషన్స్ తో
ఈ మాతృభూమి ట్రైలర్ ఆద్యంతం యాక్షన్, ఎమోషన్స్ తో నిండిపోయింది. భారతీయ సైనికులు తమ కుటుంబాలను వదిలి సరిహద్దులకు వెళ్లేటప్పుడు వారు పడే మానసిక వేదనను దర్శకుడు అద్భుతంగా చూపించారు. ఒక సీనియర్ అధికారి తన బృందంతో.. "సైనికులు వెళ్లేటప్పుడు వీడ్కోలు (గుడ్ బై) చెప్పరు.. సెల్యూట్ చేస్తారు, అవునా?" అని అడగడం ఆకట్టుకుంటుంది.
అలాగే యుద్ధరంగానికి బయలుదేరుతున్న ఓ సైనికుడు.. "మేము డ్యూటీలో ఉన్నాం, 10 నిమిషాల్లో బయలుదేరాలి. మా అబ్బాయి దగ్గర వాళ్ల అమ్మ తోడుంది.. మా అమ్మకు తన కొడుకు (నేను) ఉన్నాడు" అని చెప్పే డైలాగ్ కంటతడి పెట్టిస్తుంది.
బలమైన సందేశం
ఈ సినిమాలో సల్మాన్ పాత్ర కేవలం ఫైటింగ్ కే పరిమితం కాలేదు. "సైనికులారా గుర్తుంచుకోండి.. ధైర్యం అంటే ఎప్పుడూ పోరాడటం మాత్రమే కాదు, పోరాటాన్ని ఆపడం కూడా" అని సల్మాన్ తన బృందానికి దిశానిర్దేశం చేస్తారు. మరొక సన్నివేశంలో.. "ఏం జరిగినా సరే మన వైపు నుంచి ఒక్క బుల్లెట్ కూడా పేలకూడదు" అని కమాండ్ ఇస్తాడు.
"మానవత్వం, దేశభక్తి అంటే శత్రువును అంతం చేయడం కాదు.. శత్రుత్వాన్ని అంతం చేయడం" అనే బలమైన సందేశంతో ఈ ట్రైలర్ ముగుస్తుంది. చైనా సైనికుడిని చూస్తూ.. "లెట్స్ సార్ట్ దిస్ షిట్ బ్రో.. పీస్ ఔట్" అంటూ సల్మాన్ చెప్పే డైలాగ్ ఈ సినిమా అసలు ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. సల్మాన్ ఖాన్ సొంతంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 4న రిలీజ్ అవుతుంది. దీనికి అపూర్వ లాఖియా డైరెక్టర్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


