Killer Trailer: బుల్లితెర జగతి మేడం ఊహించని బోల్డ్ అవతారం.. కిల్లర్ ట్రైలర్ అదుర్స్.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్తే ఒక కోటి!
Killer Trailer: బుల్లితెరపై సీరియల్స్ తో ఎంటర్ టైన్ చేసిన జ్యోతి పూర్వాజ్.. ఇప్పుడు సినిమా కోసం బోల్డ్ అవతారంలోకి మారింది. ఆమె లీడ్ రోల్ ప్లే చేస్తున్న ‘కిల్లర్’ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ మూవీ సెకండాఫ్ లో వచ్చే ట్విస్ చెప్తే రూ.1 కోటి ఇస్తామని మేకర్స్ ప్రకించారు.
Killer Trailer: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన 'గుప్పెడంత మనసు' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు నటి జ్యోతి రాయ్. ఆ సీరియల్లో సంప్రదాయబద్ధమైన 'జగతి మేడం' పాత్రలో ఆమె చూపించిన నటన, హుందాతనం అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఆమె వెండితెరపై కంప్లీట్ మేకోవర్‌తో షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

కిల్లర్ ట్రైలర్
జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'కిల్లర్' (KilleR). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో జ్యోతి పూర్వాజ్ బోల్డ్ గా కనిపిస్తోంది. ఫైటింగ్ సీక్వెన్స్ కూడా అదరగొట్టింది.
భర్త దర్శకత్వంలో
ఈ 'కిల్లర్' చిత్రానికి మరో ప్రత్యేకత ఉంది. జ్యోతి పూర్వాజ్ భర్త, టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ పూర్వాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గతంలో ఆయన చేసిన ప్రయోగాత్మక చిత్రాల తరహాలోనే, ఈ సినిమాను కూడా ఊహకందని మైండ్ బెండింగ్ థ్రిల్లర్‌గా మలిచారు. బుల్లితెరపై కేవలం హోమ్లీ క్యారెక్టర్లలోనే చూసిన జ్యోతిని, ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా చాలా వైల్డ్, బోల్డ్ అండ్ ఇంటెన్స్ రోల్లో చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఒళ్ళు గగుర్పొడిచే ట్రైలర్
తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతోంది. ఇదొక మర్డర్ మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని స్పష్టంగా తెలుస్తోంది. జ్యోతి పూర్వాజ్ హావభావాలు, గ్లామర్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ జగతి మేడంను ఇలాంటి డార్క్ రోల్లో ఊహించుకోవడం కష్టమే అయినా, ఆమె తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెస్మరైజ్ చేశారు.
ట్విస్ట్ చెప్తే రూ.1 కోటి
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కిల్లర్ మూవీ యూనిట్ ఒక వినూత్నమైన ప్రకటనతో సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది. ఈ సినిమా సెకండాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్‌ను ఎవరైనా ముందే కనిపెట్టి కరెక్ట్‌గా చెప్తే వారికి ఏకంగా కోటి రూపాయల బహుమతి ఇస్తానంటూ డైరెక్టర్ పూర్వాజ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఈ భారీ ఆఫర్ ప్రకటించడంతో థ్రిల్లర్ మూవీ లవర్స్ అంతా ఈ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
అక్టోబర్ చివర్లో థియేటర్లలో రచ్చ
భారీ అంచనాలు నెలకొల్పిన ఈ 'కిల్లర్' చిత్రం అక్టోబర్ 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. బుల్లితెరపై స్టార్డమ్ తెచ్చుకున్న జ్యోతి పూర్వాజ్.. వెండితెరపై ఈ చిత్రంతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సరికొత్త క్రైమ్ మిస్టరీలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


