Salman Khan: కనిపిస్తే చెంప పగలగొట్టండి.. అసభ్యకర వీడియోలు తీసే ఫొటోగ్రాఫర్లపై సల్మాన్ ఖాన్ సంచలన కామెంట్లు

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కోపమొచ్చింది. హీరోయిన్లను, విమెన్ సెలబ్రిటీలను వెనుకాల నుంచి వీడియోలు, ఫొటోలు తీసే ఫొటోగ్రాఫర్లపై సల్మాన్ ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ 20 సీజన్ కు హోస్ట్ గా ఉన్న ఆయన.. వీకెండ్ ఎపిసోడ్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Published on: Sep 20, 2026, 13:42:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Salman Khan: రియాలిటీ షో బిగ్ బాస్ 20 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్‌లో హోస్ట్, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ పపరాజీల (ఫొటోగ్రాఫర్లు) తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈవెంట్లలో మహిళా నటీమణులతో పాటు తన మేనకోడలిని వెనుక నుంచి అసభ్యకర కోణాల్లో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో 'ఎవరో గుర్తుపట్టండి' అంటూ క్యాప్షన్లు పెట్టే ఫోటోగ్రాఫర్ల వికృత మనస్తత్వాన్ని ఎండగట్టారు.

కనిపిస్తే చెంప పగలగొట్టండి.. అసభ్యకర వీడియోలు తీసే ఫొటోగ్రాఫర్లపై సల్మాన్ ఖాన్ సంచలన కామెంట్లు (PTI)
కనిపిస్తే చెంప పగలగొట్టండి.. అసభ్యకర వీడియోలు తీసే ఫొటోగ్రాఫర్లపై సల్మాన్ ఖాన్ సంచలన కామెంట్లు (PTI)

సల్మాన్ ఖాన్ ఫైర్

బిగ్ బాస్ 20 వేదికగా సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ, డిజిటల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పబ్లిక్ ఈవెంట్లు, పార్టీలలో హీరోయిన్లు, విమెన్ సెలబ్రిటీల ప్రమేయం లేకుండా వారిని వెనుక వైపు నుండి కెమెరాల్లో బంధిస్తూ, అసభ్యకరంగా విజువల్స్ క్రియేట్ చేస్తున్న పపరాజీల తీరును సల్మాన్ తీవ్రంగా నిరసించారు.

ఇటీవల తన మేనకోడలు నడుచుకుంటూ వెళ్తుంటే వెనుక నుంచి ఫోటోలు తీసి "ఈమె ఎవరో గుర్తుపట్టండి" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. నటి సయీ మంజ్రేకర్ ఈ పరిస్థితి వల్ల తీవ్ర ఇబ్బందికి గురైందని, నేహా ధూపియా దీనిపై బహిరంగంగానే పోరాడిందని సల్మాన్ గుర్తుచేశారు.

చెంప పగలగొట్టండని

ఇటువంటి అసహ్యకరమైన ప్రవర్తనను చూస్తూ ఊరుకోవద్దని, నటీమణులంతా ఏకమై నిలబడాలని సల్మాన్ ఖాన్ పిలుపునిచ్చారు. "ఎవరైనా మీ అనుమతి లేకుండా వెనుక నుంచి ఇటువంటి షాట్స్ తీస్తే, వెంటనే వెనక్కి తిరిగొచ్చి చెంప పగలగొట్టండి. మీ ఇంట్లోని తల్లి, చెల్లెళ్ల ఫోటోలు కూడా ఇలాగే తీసి మాకు చూపించండని నిలదీయండి" అంటూ సల్మాన్ ఆవేశంగా మాట్లాడారు.

ఇండస్ట్రీలోని 90 శాతం మంది నటీమణులు ఇటువంటి కల్చర్‌ను ఎంతమాత్రం ఇష్టపడటం లేదని, ఇటువంటి పనులు చేసే వారి గుట్టు తెలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

హీరోయిన్లు కూడా

సినీ పరిశ్రమలో ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు కూడా ఫొటోగ్రాఫర్ల తీరుపై గళమెత్తారు. నేహా ధూపియా, అయేషా ఖాన్, సోనాక్షి సిన్హా, పాలక్ తివారీ, జరీన్ ఖాన్, మానుషి చిల్లర్ వంటి నటీమణులు ఇటువంటి అసభ్యకర షూటింగ్ ధోరణిని గతంలోనే ఖండించారు. నటి జాన్వీ కపూర్ తనను వెనుక నుంచి ఫోటోలు తీయవద్దని కెమెరామెన్లకు డైరెక్ట్ గా చెప్పింది. వారు ఆ మాటను గౌరవించి ఆపేశారని, అదే విధంగా ప్రతి ఒక్కరూ తమ స్పష్టం చేయాలని సల్మాన్ వ్యాఖ్యానించారు.

వ్యూస్ కోసం

సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్, క్లిక్‌బైట్ ట్రాఫిక్ కోసం ప్రైవేట్ యాంగిల్స్‌ను టార్గెట్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేయడం ఇటీవల పపరాజీ సంస్కృతిలో ఒక ప్రధాన సమస్యగా మారిందని చెప్పొచ్చు. జర్నలిజం విలువల కంటే కూడా సంచలనం కోసమే ప్రాధాన్యత ఇస్తుండటం వల్ల మహిళా సెలబ్రిటీల ప్రైవసీ, ఆత్మగౌరవానికి తీవ్ర భంగం వాటిల్లుతోందనే విమర్శలు వస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More