Salman Khan: వినాయకుడికి సల్మాన్ ఖాన్ హారతి.. అలా కాదు ఇలా తిప్పాలంటూ సరిచేసిన చెల్లెలు.. వీడియో వైరల్!
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గణపతి నిమజ్జనం వేడుకల్లో ఆయన దేవుడికి హారతినిచ్చారు. కానీ హారతిని ఉల్టా తిప్పారు. వెంటనే అక్కడే ఉన్న సల్మాన్ ఖాన్ చెల్లులు అర్పిత తన అన్నయ్యకు ఎలా చేయాలో చెప్పింది. ఈ వీడియో పాపులర్ అయింది.
Salman Khan: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. తాజాగా ఆయన సోదరుడు సోహైల్ ఖాన్ నివాసంలో జరిగిన గణపతి విసర్జన కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.

సల్మాన్ ఖాన్ హారతి
సల్మాన్ ఖాన్ ఈ సందర్బంగా గణేషుడికి హారతినిచ్చారు. కానీ పూజ సమయంలో సల్మాన్ ఖాన్ వినాయకుడికి హారతి ఇస్తుండగా.. అది తప్పుడు దిశలో (ఉల్టా ఆరతి) ఇస్తున్నట్లు చెల్లెలు అర్పిత ఖాన్ గమనించారు. పెద్దగా మంత్రోచ్ఛారణలు వస్తుండటంతో సల్మాన్ ఖాన్ ను గట్టిగా పిలిచి.. హారతిని ఎలా తిప్పాలో ఆమె చేయి పట్టి చూపించారు.
గర్ల్‌ఫ్రెండ్ కూడా
ఈ సంఘటనకు సల్మాన్ ఇచ్చిన క్యూట్ రియాక్షన్ వైరల్ అవుతోంది. ఆ తర్వాత తన మేనకోడలు ఆయత్ కు సరైన పద్ధతిని వివరించడం కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకకు సల్మాన్ రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ ఇయులియా వంతూర్ (Iulia Vantur) కూడా హాజరయ్యారు.
ఈ వేడుకలో సల్మాన్ తన సవతి తల్లి హెలెన్‌తో సరదాగా ముచ్చటించడం, మీడియా ప్రతినిధులతో మాట్లాడటం నెటిజన్లను ఆకట్టుకుంది.
సల్మాన్ సినిమాలు
మరోవైపు సల్మాన్ ఖాన్ అప్‌కమింగ్ ప్రాజెక్టులపై కూడా పరిశ్రమలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అపూర్వ లఖియా దర్శకత్వంలో వస్తున్న 'మాతృభూమి' (Maatrubhumi) చిత్రంలో ఆయన చిత్రంగద సింగ్‌తో కలిసి నటిస్తున్నారు.
గతంలో 'బాటిల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రం చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ విమర్శలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పేరు మార్చుకుని రీషూట్‌లు జరుపుకుంటోంది.
దిల్ రాజు ప్రొడక్షన్ లో
ఇది కాకుండా దిల్ రాజు నిర్మాణంలో సల్మాన్ మరో మూవీ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. ఈ భారీ సినిమాను ఈద్ 2027 కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
బిగ్ బాస్ 20
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాస్ హిందీ 20వ సీజన్ కు హోస్ట్ గానూ కొనసాగుతున్నాడు. రీసెంట్ గా వీకెండ్ ఎపిసోడ్లో తన స్టైల్లో కంటెస్టెంట్లకు చురకలు అంటించాడు సల్మాన్. ఈ బిగ్ బాస్ సీజన్ కోసం సల్మాన్ ఏకంగా రూ.200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. మరోవైపు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఒకేసారి బిగ్ బాస్ కొత్త సీజన్లు స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


