వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. పూలు, హారతి పాట కూడా ఇదిగో!

భాద్రపద శుక్ల చవితి రోజున వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా వినాయకుడికి 21 రకాల పత్రాలు, వివిధ పుష్పాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. పూజ అనంతరం గణపతి హారతి ఇచ్చి స్వామిని ప్రార్థిస్తారు.

Published on: Sep 12, 2026, 09:30:46 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష చవితి నాడు వినాయక చవితిని జరుపుకుంటాము. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం నాడు వచ్చింది. ఆ రోజు వినాయకుడికి ఈ పత్రాలను సమర్పించండి. అలాగే వినాయక చవితి నాయుడు జపించాల్సిన మంత్రాలు, 21 నామాలతో పూజ, గణపతి హారతి మొదలైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. పూలు, హారతి పాట కూడా ఇదిగో! (AI)
వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. పూలు, హారతి పాట కూడా ఇదిగో! (AI)

వినాయకకుడికి సమర్పించాల్సిన పత్రాలు

మాచీ పత్రం – మాచీ ఆకు

బృహతీ పత్రం – వాకుడాకు

బిల్వ పత్రం – మారేడు ఆకు

దూర్వా పత్రం – గరిక

దత్తూర పత్రం – ఉమ్మెత్త ఆకు

బదరీ పత్రం – రేగి ఆకు

అపామార్గ పత్రం – ఉత్తరేణి ఆకు

తులసీ పత్రం – తులసి ఆకు

చూత పత్రం – మామిడి ఆకు

కరవీర పత్రం – గన్నేరు ఆకు

విష్ణుక్రాంత పత్రం – విష్ణుక్రాంత ఆకు

దాడిమీ పత్రం – దానిమ్మ ఆకు

దేవదారు పత్రం – దేవదారు

మరువక పత్రం – మరువం ఆకు

సింధువార పత్రం – వావిలి ఆకు

జాజీ పత్రం – జాజి ఆకు

గణకీ పత్రం – గణకీ ఆకు

శమీ పత్రం – జమ్మి ఆకు

అశ్వత్థ పత్రం – రావి ఆకు

అర్జున పత్రం – మద్ది ఆకు

అర్క పత్రం – జిల్లేడు ఆకు

వినాయక చవితి రోజు వినాయకుడికి సమర్పించే పూలు

వినాయకుడి పూజలో పూలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎరుపు రంగు పూలు గణపతికి చాలా ఇష్టం. అలాగే మందారం పూలు, చామంతి పూలు, గన్నేరు పూలు, మల్లె పూలు, జాజి పూలు, సంపెంగ పూలు, తామర పువ్వు, పారిజాతం పూలు, గరిక కూడా వినాయకుడికి సమర్పించండి.

శ్రీ గణపతి హారతి

హారతి ఇచ్చేటప్పుడు ఈ పాట పాడుతూ బొజ్జ గణపయ్యకు హారతి ఇవ్వండి.

జయ జయ గణపయ్యా.. జయ జయ గణపయ్యా

విఘ్నములన్నీ తొలగించు గణపయ్యా..

జయ జయ గణపయ్యా.. జయ జయ గణపయ్యా

ఏకదంతుడవయ్యా.. లంబోదరుడవయ్యా

మూషిక వాహనుడవై మమ్ము కాపాడవయ్యా

మోదకములు స్వీకరించి మమ్ము దీవించవయ్యా

జయ జయ గణపయ్యా.. జయ జయ గణపయ్యా..

పార్వతీ తనయుడవయ్యా.. పరమేశ్వర సుతుడవయ్యా

బుద్ధి సిద్ధులు ప్రసాదించు గణనాథుడవయ్యా

మా ఇంట సుఖశాంతులు నింపుమయ్యా

జయ జయ గణపయ్యా.. జయ జయ గణపయ్యా..

వక్రతుండ మహాకాయా.. సూర్యకోటి సమప్రభా

శుభకార్యములన్నిటిలో ముందుండి నడిపించవా

నిర్విఘ్నంగా మా పనులన్నీ నెరవేర్చవా

జయ జయ గణపయ్యా.. జయ జయ గణపయ్యా..

పుష్పములతో పూజింతుము.. దీపముతో హారతింతుము

భక్తితో నీ నామస్మరణ చేసెదము గణపయ్యా

ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించవయ్యా

జయ జయ గణపయ్యా.. జయ జయ గణపయ్యా..

సకల దేవతల వందితుడవయ్యా.. సిద్ధి వినాయకుడవయ్యా

మా కుటుంబమంతటినీ చల్లగా చూడు గణపయ్యా

శుభములు కలుగజేయుము శ్రీ గణనాథా

జయ జయ గణపయ్యా.. జయ జయ గణపయ్య..

శ్రీ గణపతికి మంగళం.. శుభ మంగళం

భక్తులందరికీ నిత్య శుభ మంగళం

విఘ్నేశ్వరునికి మంగళం.. శుభ మంగళం

శ్రీ సిద్ధి వినాయకునికి మంగళం.. శుభ మంగళం..

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More